వైరల్‌ ఫ్లూలా భావించి..ఆ వ్యాధిని జయించా..!: సంజయ్‌ దత్‌ | Sanjay Dutt Said Just Like A Viral Flu On Surviving Stage 4 Lung Cancer | Sakshi
Sakshi News home page

Sanjay Dutt: వైరల్‌ ఫ్లూలా భావించి..కేన్సర్‌తో పోరాడా..!

Jul 16 2026 5:06 PM | Updated on Jul 16 2026 5:45 PM

Sanjay Dutt Said Just Like A Viral Flu On Surviving Stage 4 Lung Cancer

బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ విలక్షణమైన నటనకు పేరుగాంచిన హీరో. సంజు బాబాగా పిలిచే ఆయన తన నాలుగు దశాబ్దాల సినీ కెరీర్‌లో ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. ఆయన స్టేజ్‌ 4 లంగ్‌ కేన్సర్‌ని జయించిన వారియర్‌ కూడా. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సంజయ్‌ దత్‌ స్వయంగా తాను ఈ కేన్సర్‌ని ఎలా జయించానో వెల్లడించారు. అంతేగాదు అందరూ ఇలానే పోరాడాలంటూ కేన్సర్‌ బాధితుల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు. 

సంజయ్‌ దత్‌కు 2020 ఆగస్టులో స్టేజ్‌ 4 ఊపిరితిత్తుల కేన్సర్‌ నిర్థారణ అయింది. ఆయనకు ఊపిరితిత్తుల్లో ద్రవంచ చేరడంతో శ్వాస తీసుకోవడలో చాలా ఇబ్బందిపడ్డారు. ఆయన ముంబైలో చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత అక్టోబర్‌ 2020లోనే కేన్సర్‌ నుంచి బయటపడ్డారు కూడా. దాంతో ఒక్కసారిగా కుటంబసభ్యులు, అభిమానులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ కేన్సర్‌ని జయించడంలో తను ఎలాంటి మానసిక ధైర్యంతో ఉన్నానో పంచుకున్నారు. తాను ఆ సమయంలో కేన్సర్‌ని వైరల్‌ ఫ్లూ వ్యాధిలా చూశానని, అన్నారు. ఎప్పుడూ మనం పోరాట యోధులుగా ఉండాలే తప్ప.. అంత సులభంగా వదిలేయకూడదని అన్నారు. 

అనారోగ్య సమస్య ఎలాంటిదైనా ధైర్యంగా పోరాడలని అన్నారు. కేన్సర్‌ బాధితులు ఎవరైనా..ఆ వ్యాధికి లొంగిపోకూడదని, బదులుగా ఇతర అనారోగ్యాల మాదరిగా చూడాలని హితవు పలికారు. నిజానికి అది కష్టమని తనకు తెలుసని..అయినప్పటికీ మనం నవ్వుతూనే పోరాడలన్నారు. కేన్సర్‌ నుంచి కోలుకుంటున్నప్పుడూ ఎదురయ్యే శారీరక బాధలు గురించి తనకు తెలుసన్నారు. ముఖ్యంగా మహిళలు ఈ విషయంలో ఎక్కువ ఇబ్బంది పడతారని అన్నారు. అదే సమయంలో తనకు సూదులంటే ఎంత భయమో కూడా చెప్పారు. 

తను యోగా లేదా ధ్యానం వంటివి చేయనని, కానీ జిమ్‌లో వర్కౌట్లు చేస్తానని చెప్పారు. అలాగే తను శివ భక్తుడనని, తనకు శివుడే సర్వస్వం అని చెప్పారు. చివరగా ఆయన జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా పోరాడాల్సిందేనని అన్నారు. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు పోరాడుతూనే ఉంటామని అన్నారు. పుట్టినప్పుడు మొదటగా ఆక్సిజన్‌ కోసం పోరాడతాం, ఆ తర్వాత ఆరోగ్యం లేదా వ్యక్తిగత సమస్యల కోసం పోరాడతామని అన్నారు. 

ఒక్కటి గుర్తించుకోండి సమస్యను ఎదుర్కోండి తప్ప పారిపోకండని పిలుపునిచ్చారు. ఒక్కసారిగా సమస్యను ఎదుర్కోవడం మొదలుపెడితే..ఆటోమేటిగ్గా పరిష్కరించుకోవడం ప్రారంభిస్తారని అన్నారు. అందుకే ఏ సమస్యనైనా ఎదుర్కోండి తప్ప పారిపోయే ప్రయత్నం చేయకండి దానివల్ల సమస్య మరింత ఎక్కువవుతుంతే గానీ దానికి పులిస్టాప్‌ పడదంటూ తన సంభాషణను ముగించారు. 

(చదవండి: ప్రేమ కోసం సైకిల్‌పై భారత్‌ నుంచి స్వీడన్‌కు..! ట్విస్ట్‌ ఏంటంటే..)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement