ధ్యాన సాధన గురించి ప్రముఖ యోగా గురువుల వద్ద శిక్షణ తీసుకుని మరీ ప్రయత్నిస్తుంటాం. అయినప్పటికీ నిలకడ సాధ్యం గాక పట్టు సాధించలేకపోతుంటాం. అలాంటి ధ్యాన సాధనను గౌతమ్ వైష్ణవ్ అనే కళాకారుడు రాళ్లతో అలవోకగా నేర్పిస్తున్నాడు. అదెలాగో తెలిస్తే..విస్తుపోతారు.
రాళ్లతో సాధన అంటే..సున్నితమైన ఆకృతుల్లో రాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చేలా సమతుల్యం చేయడం. అందుకోసం ఎలాంటి జిగురు ఉపయోగించరు. ఇది కేవలం మన ఏకాగ్రత, ఓపికలకు సంబంధించిన సామర్థ్యం. మరి ఇదెలా ధ్యాన సాధన అవుతుందంటే..ముంబైకి చెందిన కళాకారుడు గౌతమ్ వైష్ణవ్ ధ్యాన చేయడం ఎలా అనేది నేర్పించారు. కేవలం చేసేలా ఈ టెక్నిక్‌తో బలవంతం చేస్తారు.
అంటే వివిధ రాళ్లను వాటిని ఒకదానిపై ఒకటి నిలబడేలా చేసే టెక్నిక్‌ని నేర్పిస్తారు. అంతే అదే వారిని లోతైన ధ్యాన సాధన చేసేలా చేస్తుంది. ఇక్కడ ఈ టెక్నిక్‌లో రాళ్లతో మమేకమవ్వుతారు. ఒకదానిపై ఒకటి పెట్టే క్రమంలో ఓపిక, పదే పదే ప్రయత్నాలు..ఏకాగ్రత, నిలకడని పెంపొందిస్తాయి. పైగా ఏ కేంద్రం వద్ద రాయి నిలబడగలదు అనే దానిపై పూర్తి అటెన్షన్ సామర్థ్యం పెంపొంది సులభంగా తనకు తెలియకుండానే ధ్యాన సాధన చేయగలుగుతారు.
రాళ్లను సమతుల్యంచేసే కళాత్మక నైపుణ్యం ఏళ్లు గడిచే కొద్ది లోతైన ధ్యాన సాధనగా పరిణామం చెందుతుందట. ఇది ఏకాగ్రత, సహనం, భావోద్వేగ స్థిరత్వం, మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. ఈ టెక్నిక్‌లో రాయి చేప్పేది వింటుంటారు. అదే అన్ని నేర్పిస్తుందని అంటున్నారు. కార్పొరేట్ ప్రపంచంలో కావాల్సింది కూడా ఇదే. ఇదొక విభిన్నమైన ధ్యాన పద్ధతని గౌతమ్ నొక్కి చెబుతున్నారు.
అందుకే తాను ఎవ్వరికి ధ్యానం గురించి భోధించనని, చేసేలా బలవంతం చేస్తానని నవ్వుతూ చెబుతున్నారు. ఆలోచనలను నిశబ్దం చేయడానికి సతమతమయ్యే వాళ్లకు ఈ టెక్నిక్ ఎంతగానో ఉపకరిస్తుందని అంటున్నారు. ఇది పూర్తి మైండ్‌ఫుల్‌నెస్ ఆధారిత విధానం అని అంటున్నారు గౌతమ్. దాదాపు 90 నిమిషాల పాటు ఎవరైనా నిరంతరాయంగా రాళ్లను సమతుల్యం చేసేలా దృష్టిసారిస్తే..కచ్చితం మిగతా విషయాలన్నింటి గురించి ఆలోచించడం మానేస్తారని అంటున్నారు.
తమకు తెలియకుండానే నిశ్చల స్థితిని అనుభవిస్తారని అంటున్నారు. ధ్యానం అంటేనే ఎలాంటి ఆలోచనలు లేని నిశ్చల స్థితి, శ్వాసపై ధ్యాస అది ఈ టెక్నిక్‌తో సులభంగా అలవడుతుందని గౌతమ్ చెబుతున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం చూసేయండి..ధ్యాన సాధన సునాయాసంగా నేర్చుకోండి.
(చదవండి: 52 ఏళ్ల వయసులో సీఏ..! తండ్రి 75వ పుట్టినరోజుకి..)


