ఈ మినీ మెషిన్‌తో.. స్కిన్‌ సమస్యలకు చెక్‌! | Sakshi
Sakshi News home page

ఈ మినీ మెషిన్‌తో.. స్కిన్‌ సమస్యలకు చెక్‌!

Published Sun, May 26 2024 1:14 PM

Solve To Skin Problems With Microcurrent Line Smoothing Instant Plumper Device

వయసు పెరిగే కొద్ది కళ్ల చుట్టూ ముడతలు, పెదవుల చుట్టూ గీతలు పడటం సర్వసాధారణం. అయితే దాన్ని.. చిత్రంలోని ఈ మైక్రోకరెంట్‌ లైన్‌ స్మూతింగ్‌ ఇన్‌స్టంట్‌ ప్లంపర్‌ డివైస్‌తో తగ్గించుకోవచ్చు. ఈ మినీ మెషిన్‌.. ఆ సమస్యను కేవలం వారం రోజుల్లోనే పరిష్కరించేస్తుంది.

ఈ మినీ మెషిన్‌ తో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటే.. కళ్లు కాంతిమంతమవుతాయి. పెదవులు ఆరోగ్యంగా కనిపిస్తాయి. ఈ డివైజ్‌కి ఒకవైపు రెండు చిన్న చిన్న బాల్స్‌ లాంటి మసాజర్‌ హెడ్స్‌ ఉంటాయి. వాటిని చర్మానికి ఆనించి మసాజ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టూల్‌కి మధ్యలో చిన్న రోలర్‌ బాటిల్‌ ఉంటుంది. అందులో సీరమ్‌ ఉంటుంది.

మసాజ్‌ చేసుకునేముందు ఆయా ప్రదేశాల్లో ఆ సీరమ్‌ని అప్లై చేసుకుని ట్రీట్‌మెంట్‌ తీసుకోవాలి. సీరమ్‌ రోలర్‌ని డివైస్‌ నుంచి బయటికి తీసుకోవచ్చు.. తిరిగి అక్కడే అటాచ్‌ చేసుకోవచ్చు. ఈ సీరమ్‌ .. యాంటీ ఆక్సిడెంట్‌ కెఫిన్, క్రాన్‌ బెర్రీ ఎక్స్‌ట్రాక్ట్, రోజ్‌ వాటర్, ఫర్మింగ్‌ నియాసినామైడ్, విటమిన్‌ బి5 వంటి 95% సహజ పదార్థాలతో తయారైంది.

ఈ మెషిన్‌ తో సుమారు ఏడు రోజులు ట్రీట్‌మెంట్‌ తీసుకుంటే.. కళ్లు, పెదవుల చుట్టూ ఉన్న ముడతలు, గీతలు పోయి సహజమైన అందం సొంతమవుతుంది. ఈ డివైస్‌కి చార్జింగ్‌ పెట్టుకుని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఈ మసాజర్‌లో 5 లెవల్స్‌తో కూడిన ఆప్షన్‌్స ఉంటాయి. దాంతో అవసరాన్ని బట్టి పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. ధర 186 డాలర్లు. అంటే 15,530 రూపాయలన్నమాట.

ఇవి చదవండి: ఇవి మార్జాల పుష్పాలనుకుంటున్నారా!

Advertisement
 
Advertisement
 
Advertisement