
తలస్నానం చేసిన మరుసటి రోజుకే జుట్టు నిర్జీవంగా మారిపోతుంటుంది. అలాంటప్పుడు కొన్ని చిట్కాలు పాటిస్తే జుట్టు పట్టుకుచ్చులా మెరుస్తుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
►అర టీ స్పూను అలోవెరా జెల్, ఒక టీ స్పూను నిమ్మరసం తీసుకుని రెండింటినీ బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రెగ్యులర్‌గా ఉపయోగించే షాంపూలో కలపాలి. ఈ షాంపూ మిశ్రమాన్ని కేశాలకు పట్టించి, పది నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికోసారి చేస్తే పట్టు కుచ్చుల్లా మెరుస్తుంది.
►శీకాకాయ, ఉసిరిపొడి, కరివేపాకు, మందార పువ్వులను సమపాళ్లల్లో తీసుకుని రాత్రంతా నానబెట్టాలి. మరుసటిరోజు ఉదయం వీటన్నింటిని పేస్టు చేయాలి. ఈ పేస్టుని జుట్టుకి పట్టించి అరగంట తరువాత షాంపూతో కడిగేయాలి. వారానికి మూడుసార్లు ఇలా చేయడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
► ఏదైనా ఆయిల్‌ను తలకు పట్టించి, మర్దనా చేసి వెచ్చని నీళ్లలో ముంచి తీసిన టర్కీ టవల్‌ని చుట్టుకోవాలి. అరగంట తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. Simple Home Remedies To Make Ur Hair Smooth And Shine
► ఒక గ్లాసు నీటిలో గుప్పెడు పుదీనా ఆకులు వేసి ఆ నీటిని 15 నుంచి 20 నిమిషాల పాటు మరగపెట్టుకోవాలి. ఆ నీళ్ళు చల్లారిన తర్వాత వడకట్టి, షాంపూలో వేసుకోవాలి.తలస్నానం చేసే ముందు ఈ షాంపూను కేశాల కుదుళ్ళ నుంచి, చివర్ల వరకూ అప్లై చేసుకుని పది నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి.
► గ్లాసు నీళ్ళల్లో టేబుల్ స్పూను వెనిగర్, కొద్దిగా ఉప్పు కలపాలి. ఈ మిశ్రమంలోంచి రెండు టేబుల్‌స్పూన్లు తీసుకుని మాడుకు పట్టించి మసాజ్ చేసుకోవాలి. 45 నిమిషాల తర్వాత నీటితో కేశాలను శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికోసారి చేస్తే జుట్టులో అధికంగా ఉండే ఆయిల్ తగ్గి జుట్టు స్మూత్‌గా మారుతుంది.