వాస్తవికతకే రూపం ఇస్తే..పాజిటివ్‌ ఎమోషన్‌.. | Shreya Roy Chowdhurys Art Extraordinarily Captures Bonds | Sakshi
Sakshi News home page

వాస్తవికతకే రూపం ఇస్తే..పాజిటివ్‌ ఎమోషన్‌..

Published Fri, Oct 6 2023 11:05 AM | Last Updated on Fri, Oct 6 2023 11:05 AM

Shreya Roy Chowdhurys Art Extraordinarily Captures Bonds  - Sakshi

‘సృజనకారులకు పరిశీలనకు మించిన బలం లేదు’ అంటుంది కోల్‌కత్తాకు చెందిన యంగ్‌ ఆర్టిస్ట్‌ శ్రేయా రాయ్‌. తాము పరిశీలించిన వాటిని కొందరు కవిత్వంలోకి తీసుకెళతారు. శ్రేయ మాత్రం చిత్రాల్లోకి తీసుకువచ్చింది. తనదైన శైలితో వాటికి కొత్త రూపం ఇస్తుంది. ఆమె జ్ఞాపకాలకు, పరిశీలనలకు డిజిటల్‌ కాన్వాస్‌ను వేదికగా చేసుకుంది. శ్రేయ చిత్రాలు గ్రాఫిక్‌ నవలలోని క్యారెక్టర్‌లను గుర్తు తెస్తాయి. పాజిటివ్‌ ఎమోషన్స్‌ ఆమె చిత్రాలకు బలాన్ని ఇస్తాయి, నిత్యజీవిత దృశ్యాలను గుర్తు తెస్తాయి.

‘స్త్రీలకు సంబంధించి నిత్యజీవిత దృశ్యాలు నా చిత్రాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఆరు బయట కూర్చొని స్త్రీలు మాట్లాడుకునే దృశ్యాలలో కూడా ఎంతో అందం ఉంది. కాల్పనికతకు కాకుండా వాస్తవికతకే ప్రాముఖ్యత ఇస్తాను’ అంటున్న రాయ్‌ ఆర్కిటెక్ట్‌ కూడా. అయితే ఆమెకు చిత్రలేఖనం అంటేనే బాగా ఇష్టం. ‘ఆర్కిటెక్చర్‌లో రకరకాల కొలతలతో పని. చిత్రప్రపంచంలో ఆలోచనలతోనే పని’ అంటోంది రాయ్‌. 

(చదవండి: సింగిల్‌ షోల్డర్‌..డబుల్‌ బ్యూటీ!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement