ఎస్‌బీఐ ఆధ్వర్యంలో మహిళలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ | SBI Launches Skill Development Program for Women | Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐ ఆధ్వర్యంలో మహిళలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ

Jan 28 2025 1:28 PM | Updated on Jan 28 2025 1:32 PM

SBI Launches Skill Development Program for Women

దేశంలోనే అతిపెద్ద బ్యాంకు మహిళల కోసం శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంహించింది.  21 కోట్లకు పైగా మహిళా ఖాతాదారులున్న  గణ తంత్ర దినోత్సవం సందర్బంగా ఎస్‌బీఐ  మహిళల కోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని  ప్రారంభించింది. దీని ద్వారా సుమారు 5,200 మంది మహిళా అభ్యర్థులకు ప్రయోజనం చేకూరుతుందని బ్యాంకు ప్రకటించింది.ఈ కార్యక్రమాన్ని (MoRD) కార్యదర్శి శైలేష్ కుమార్ సింగ్, ఎస్‌బీఐ చైర్మన్ సీఎస్‌సెట్టి సంయుక్తంగా ప్రారంభించారనీ ఈ ప్రారంభోత్సవంలో SBI ఎండీ వినయ్ టోన్సే కూడా పాల్గొన్నారని ఒక ప్రకటనలో తెలిపింది.

'మహిళా సాధికారత' లక్ష్యంలో భాగంగా దీన్ని  తీసుకొచ్చింది.  153 గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థలలో (RSETIలు) మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన శిక్షణా కార్యక్రమం ద్వారా తన లక్ష్యాన్ని బలోపేతం చేస్తుంది.  ఈ కార్యక్రమంలో టైలరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, బ్యూటీ సర్వీసెస్, వర్మికల్చరల్, అగర్బత్తి/కొవ్వొత్తుల తయారీ, తేనెటీగల పెంపకం, సాఫ్ట్ టాయ్ క్రియేషన్, జనపనార ఉత్పత్తుల తయారీలో శిక్షణ ఇవ్వనుంది

అలాగే శిక్షణ తీసుకునేవారికి  ఆర్థిక సహాయం, సొంత వెంచర్‌ ఏర్పాటు, మార్కెట్ లింకేజీలను ఏర్పాటు చేయడంపై  మార్గదర్శకత్వ సలహాలు కూడా అందిస్తుంది.  శిక్షణ పొందేమహిళల్లో ఉత్సాహం నింపేలా స్థానిక ప్రముఖులు , విజయవంతమైన వ్యవస్థాపకులు వారి అనుభవాలను తెలిపే అవకాశం కూడా ఉంటుంది.

ఇది గ్రామీణ మహిళలను స్వావలంబన చేయడంతపాటు “వికసిత్ భారత్” వైపు ఒక అడుగు కూడా  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్  సి.ఎస్. సెట్టి తెలిపారు.మహిళలను నైపుణ్యాలతో సన్నద్ధం చేయడం ద్వారా, దేశ నిర్మాణం విస్తృత లక్ష్యానికి దోహదపడుతూ ఆర్థిక స్వాతంత్ర్యం వైపు మహిళలప్రయాణానికి మద్దతు ఇవ్వడమే తమ లక్ష్యమన్నారు.

ఎస్‌బీఐ చేపట్టిన నైపుణ్యాభివృద్ధి  కార్యక్రమం ద్వారా మహిళలు సాధికారత సాధించి స్థిరమైన జీవనోపాధిని నిర్మించుకోవాలని గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శిశైలేష్ కుమార్ సింగ్‌ అభిలషించారు. గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారతలో ఎస్‌బీఐ నిబద్ధతను ఆయన ప్రశంసించారు.మహిళల్లో ఆర్థిక అక్షరాస్యత, నైపుణ్యాభివృద్ధి , వ్యవస్థాపకతను పెంపొందించడంలో  ఎస్‌బీఐ RSETIలు పోషించిన కీలక పాత్రను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement