
ఇటీవల కాలంలో తారలు తమ అభిరుచులను ఇతర రంగాలకూ విస్తరిస్తున్నారు. వారిలో మరింత విభిన్నంగా తనని తాను నిరూపించుకుంటోంది 33 ఏళ్ల సయామీ ఖేర్. ఒకే సంవత్సరంలో రెండుసార్లు ‘ఐరన్‌మ్యాన్ 70.3’ పూర్తి చేసిన తొలి భారతీయ నటిగా వార్తల్లో నిలిచింది.
ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చే సయామీ ఖేర్ జూలై 6న స్వీడన్‌లోని జోంకోపింగ్‌లో జరిగిన ఐరన్‌మ్యాన్ 70.3 యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని, పతకాన్ని సాధించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత కఠినమైన ట్రయాథ్లాన్ సర్క్యూట్‌లలో ఒకటి. కిందటేడాది సెప్టెంబర్‌లో తొలిసారిగా మెడల్ అందుకున్న ఆమె ఇప్పుడు స్వీడన్‌లో నిర్వహించిన రేస్‌లో సత్తా చాటి మరో పతకం అందుకుంది.
తన విజయంపై సయామీ ఖేర్ స్పందిస్తూ ‘ఎంతో ఆనందంగా ఉంది. క్రమశిక్షణతో ఏదైనా సాధ్యమే. అలాగని ప్రపంచానికి నేనేంటో నిరూపించుకోవాలన్న ఉద్దేశంతో ఇదంతా చేయలేదు. నా మనసుకు నచ్చింది చేస్తున్నాను. ఒక మహిళగా ఇది శారీరకంగా సవాల్‌తో కూడిన పనే. అసాధ్యం అనిపించిన దానిని పూర్తి చేయడంలో ఒక గర్వం, అపరిమితమైన ఆనందం’’ ఉంటాయి అంటోంది.
నాసిక్‌కు చెందిన సయామీ ఖేర్ తెలుగు సినిమా ‘రేయ్’తో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో అవకాశాలు అందుకున్న ఆమె... కొన్నాళ్ల గ్యాప్ అనంతరం ‘వైల్డ్ డాగ్’తో తెలుగు ఆడియన్స్‌ను పలకరించింది. మళ్లీ తెలుగులో నటించలేదు. ఇటీవల వచ్చిన హిందీ చిత్రం ‘జాబ్’లో కీలక పాత్ర పోషించింది.
(చదవండి: చేనేతలకు జాతీయ గౌరవం..! ఒకరు సరికొత్త పంథాతో, మరొకరు మార్కెటింగ్‌తో..)