కేరళకు చెందిన నన్ సిస్టర్ సబీనా రాష్ట్ర మాస్టర్స్ అథ్లెటిక్స్ మీట్‌లో హర్డిల్స్‌లో అద్భుతంగా రాణించారు. 55 ఏళ్ల సబినా 55–ప్లస్ విభాగంలో మొదటిస్థానంలో నిలిచారు. కాసరగోడ్ ప్రాంతానికి చెందిన సబినా ఒకప్పుడు జాతీయ స్థాయి హర్డిలర్. తొమ్మిదో క్లాస్‌లో ఉన్నప్పటి నుంచి జాతీయస్థాయి హర్డిల్స్ ఈవెంట్స్‌లో పాల్గొనేవారు. యూనివర్శిటీ స్థాయి పోటీలలో కూడా సత్తా చాటారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా ఆమె ఎంతోమంది విద్యార్థులను క్రీడలలో తీర్చిదిద్దారు.
‘రాబోయే మార్చిలో ఉద్యోగం నుంచి రిటైర్ అవుతున్నాను. ఈలోపు ఒకసారి పోటీలో పాల్గొనాలనుకున్నాను’ అన్నారు సబీన. ‘ఆమె విజయం సంకల్ప బలానికి ప్రతీక. లక్ష్యం చేరుకోవడానికి వయసు ఎప్పుడూ అడ్డు కాదని నిరూపించారు’ అని సబీనాపై ప్రశంసలు కురిపించారు కేరళ విద్యాశాఖ మంత్రి శివన్ కుట్టి. మతపరమైన దుస్తులు ధరించి సబీనాపోటీలో పాల్గొనడం విశేషంగా మారింది.
చదవండి: రూ. 1.75 - 5.27 కోట్లదాకా జీతం : ఆ 600 మందికి సుదర్శన్ కామత్ ఆఫర్


