వర్షాకాలం వచ్చేసింది.. పాదరక్షలతో పదిలం! | Monsoon Footwear Tips, How To Choose the Right Slippers To Avoid Slips And Infections, More Details Inside | Sakshi
Sakshi News home page

వర్షాకాలం వచ్చేసింది.. పాదరక్షలతో పదిలం!

Jun 20 2026 8:47 AM | Updated on Jun 20 2026 10:27 AM

Precautions And Suggestions For The Monsoon Season

వర్షాకాలం

వర్షాకాలం వచ్చేసింది. ధరించే దుస్తుల విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్లే వేసుకునే చెప్పుల విషయంలోనూ జాగ్రత్తలు ముఖ్యమే. లేదంటే కొద్దిపాటి అజాగ్రత్తగా ఉన్నా జారిపడటమో, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు రావడమో జరుగవచ్చు. అందుకోసం ఈ చిన్నచిన్న టిప్స్‌...

మంచి గ్రిప్‌ ముఖ్యం: వర్షాకాలంలో అడుగు భాగంలో అరిగిపోయిన ఫ్లాట్‌ చెప్పులను అస్సలు వాడకూడదు. తడి నేలపై నడిచేటప్పుడు జారిపడకుండా ఉండటానికి గరుకుగా, గట్టిగా నేలను పట్టుకునే గ్రిప్‌ ఉన్న చెప్పులను మాత్రమే ఎంచుకోవాలి.

వాటర్‌ ప్రూఫ్‌వి: లెదర్, కాన్వాస్‌ లేదా బట్టతో చేసిన చెప్పులు నీటిని ఎక్కువగా పీల్చుకుంటాయి. ఇవి త్వరగా ఆరకపోవడమే కాకుండా దుర్వాసనకు, బ్యాక్టీరియాకు నిలయంగా మారుతాయి. కాబట్టి రబ్బర్, సిలికాన్‌ లేదా ప్లాస్టిక్‌తో తయారైన వాటర్‌ ప్రూఫ్‌ చెప్పులను వాడటం ఉత్తమం.

సరైన సైజ్‌: చెప్పులు మరీ లూజ్‌గా గానీ, మరీ టైట్‌గా గానీ ఉండకూడదు. బురదలో నడిచేటప్పుడు కాళ్ళు బెణకకుండా ఉండేందుకు యాంకిల్‌ సపోర్ట్‌ ఉన్న చెప్పులు మరింత సురక్షితం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement