
తాళజాతి వనం పచ్చందం..
ఓల్డ్‌మలక్‌పేట ఈ–సేవ వెనుక భాగంలో ఉన్న తాళజాతి వనం సందర్శకులను ఇట్టే ఆకర్షిస్తోంది. అక్కడ ఉండే చెట్లన్నీ పొట్టిగా, ఇంటి ఆవరణలో పెంచుకునేందుకు వీలుగా ఉంటాయి. 103 దేశాలకు చెందిన తాళజాతి చెట్లన్నీ ఒకే చోట ఏర్పాటు చేయడంతో ఆకర్షణతో పాటు ఆహ్లాదంగా ఉంటుంది.
వీటితో పాటు వివిధ దేశాల్లోని సముద్ర తీర ప్రాంతాలలో పెరిగే మొక్కలు కూడా ఈ పార్కులో పెరుగుతున్నాయి. ఉదయం సాయంత్రం ఈ పార్కు సందర్శకులతో కిటకిటలాడుతోంది. వేసవిలో సందర్శకుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.

బ్రెజిల్, జర్మని, ఆ్రస్టేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్, ఈస్ట్ ఆసియా మొదలగు దేశాల నుంచి సేకరించిన వివిధ రకాల మొక్కలు ఈ పార్కులో జీవం పోసుకుంటున్నాయి. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు సందర్శకులకు ప్రవేశం ఉంటుందని ప్రవేశం ఉచితమని అధికారులు పేర్కొంటున్నారు. – చాదర్‌ఘాట్

ఇదీ చదవండి: రూ. 2 లక్షలతో మొదలై రూ. 8,500 కోట్లకు, ఎవరీ ధీర
తాళ జాతి మొక్కల ఉపయోగాలు:
ఆహారం: తాళ జాతి మొక్కల నుండి మనం వివిధ రకాల ఆహారాన్ని తయారు చేయవచ్చు. ఉదాహరణకు, తాటి పండ్లను తినవచ్చు తాటి నూనెను తయారు చేయవచ్చు. తాళ జాతి మొక్కలు ఔషధ లక్షణాలను కలిగి ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో తాటి మొక్కలనుంచి తీసని కల్లునుఉపయోగిస్తారు.
తాళ జాతి మొక్కలను వివిధ రకాలుగా వాడుకోవచ్చు, ఉదాహరణకు, తాటి కలపను ఉపయోగించి ఇల్లు కట్టవచ్చు. తాటి ఆకులతో ఇల్లు కట్టుకోవచ్చు. తాటి చాపలు , బుట్టలతోపాటు, అనేక రకాల అలకరణ వస్తువులను తయారు చేసుకోవచ్చు. మొదలనవి. పర్యావరణానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాతావరణాన్ని శుభ్రం చేయడంలో సహాయపడుతుంది , జీవరాసులకు నివాస స్థలాన్ని అందిస్తుంది.