పాలక్‌ పనీర్‌, పనీర్‌ బటర్‌ మసాలా : రెస్టారెంట్‌ స్టైల్లో టేస్ట్‌ అదుర్స్‌! | Palak paneer and Paneer Butter Masala Recipe Restaurant style | Sakshi
Sakshi News home page

పాలక్‌ పనీర్‌, పనీర్‌ బటర్‌ మసాలా : రెస్టారెంట్‌ స్టైల్లో టేస్ట్‌ అదుర్స్‌!

Jan 27 2025 4:36 PM | Updated on Jan 27 2025 5:16 PM

Palak paneer and Paneer Butter Masala Recipe Restaurant style

పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం తినిపించాలంటే కత్తిమీద సామే. ఏదో ఒకటి వంక పెడుతూ ఇంటి ఫుడ్‌ను దూరం పెడుతూ ఉంటారు. చిప్స్‌, న్యూడిల్స్‌ అంటూ  పరుగులు పెడతారు.  ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పనీర్‌తో చేసుకునే  అద్భుతమైన రెసిపీలను ఇక్కడ చూద్దాం.    రెస్టారెంట్‌ రుచి కావాలంటే.. మరిన్ని టిప్స్‌ మీకోసం.

పాలక్ పనీర్...ఇది ఫేమస్ పంజాబీ రెసిపీ కానీ ప్రపంచ వ్యాప్తంగా దీనికి అభిమానులున్నారు. పాలక్ పనీర్ చపాతీ, రోటీలు, పుల్కా, ఇంకా జీరా రైస్ లో చాలా రుచిగా ఉంటుంది. పాలక పనీర్ రెసిపీ చాలా సింపుల్ కొన్ని చిన్న టిప్స్ కొలతలు సరిగా పాటిస్తే.. అదిరిపోయేటేస్ట్‌ వుస్తుంది.  

కావాల్సిన పదార్థాలు: అర కప్పు సన్నగా తరిగిన పాలకూర, అర కప్పు పనీర్‌ ముక్కలు , సన్నగా తరిగిన ఉల్లిపాయ, సగం కప్పు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒకటిన్నర టీస్పూన్,  అల్లం వెల్లుల్లి  పేస్ట్‌, 2 స్పూన్లు సన్నగా తరిగిన కొత్తిమీర,1/4 స్పూన్ గరం మసాలా, ఫ్రెష్‌  క్రీమ్‌

తయారీ 
మీడియం వేడి మీద పాన్ వేడెక్కాక, నూనె వేసి,  వెల్లుల్లి రెబ్బలు,  తరిగిన ఉల్లిపాయలవేయించుకోవాలి. ఇవి బాగా వేగాక  సిద్ధం చేసుకున్న పాలకూర పేస్ట్‌ వేసుకోవాలి.   కొద్దిగా నీళ్లు పోసి పాన్ ని మూత పెట్టి మీడియం మంట మీద 10 నిమిషాలు ఉడికించాలి. అడుగు అంటుకోకుండా ఉండటానికి  తిప్పుతూ ఉండాలి. పాలకూర ఉడికిన తర్వాత, గరం మసాలా, పసుపు, కారం, ఉప్పు వేసి ఉడికించాలి.  ఇందులోనే క్రీమ్‌ లేదా చక్కెర వేసుకోవాలి. బాగా దగ్గరికి ఉడికిన తరువాత పనీర్ వేసి కలిపి మరో 4-5 నిమిషాలు ఉడికనివ్వాలి. మంటను ఆపివేసి. కసూరి మేథీ వేసి కలుపుకోవడమే. టేస్టీ టేస్టీ  పాలక్‌  పనీర్‌ రెడీ.

రుచిని పెంచే  టిప్స్:
పాల కూర ఆకులు మరిగే నీళ్ళలో వేసి 3 నిమిషాలు ఉడికించి వెంటనే చన్నీళ్ళ లో  వేయాలి. అప్పుడు గ్రీన్ కలర్లోనే ఉంటుంది. లేదంటే ముదురు ఆకుపచ్చ రంగులోకి మారిపోతుంది.ఇంట్లో చేసుకున్న పనీర్ ఎప్పుడూ బెస్ట్, రెడీమేడ్ తెస్తే పనీర్ ముక్కలుగా చేసి వేడి నీళ్ళలో 10 నిమిషాలు ఉంచితే పనీర్ మెత్తబడుతుంది. ఉల్లిపాయ ఎర్రగా వేగాలి.కసూరి మేథి తప్పక వేయాలి అప్పుడే ఫ్లేవర్ బాగుంటుంది.   ఇందులో పాల మీగడ లేదా ఫ్రెష్ క్రీమ్ వాడితే టేస్ట్‌ అదిరిపోతుంది.పాలకూర కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి, చేదును తగ్గించడానికి కొంచెం క్రీమ్  లేదా  చక్కెర వాడతారు. వెల్లుల్లి ఇష్టం లేనివారు మానేయవచ్చు.కొంతమంది టమాటా గుజ్జుకూడా కలుపుకుంటారు.


పనీర్‌ బటర్‌ మసాలా

కావలసినవి: పనీర్‌ ముక్కలు– ఒకటిన్నర కప్పు; ఉల్లిపాయ ముక్కలు-ముప్పావు కప్పు; టొమాటో ముక్కలు-కప్పు; వెల్లుల్లి రేకలు-4; అల్లం తురుము-టీ స్పూన్‌; పచ్చిమిర్చి-2; జీడిపప్పు-పది పలుకులు; పాలు- అర కప్పు; మీగడ-పావు కప్పు; కసూరీ మేథీ లేదా తాజా మెంతి ఆకు-టీ స్పూన్‌; ధనియాల  పొడి- టీ స్పూన్‌; మిరపపొడి-టీ స్పూన్‌; పసుపు - పావు టీ స్పూన్‌; వెన్న-2 టీ స్పూన్‌లు; ఉప్పు-అర టీ స్పూన్‌ లేదా రుచిని బట్టి; కొత్తిమీర తరుగు– 3 టేబుల్‌ స్పూన్‌లు.

పోపు కోసం...  నూనె - టేబుల్‌ స్పూన్‌; యాలకులు-2; లవంగం – 1; దాల్చిన చెక్క- అంగుళం ముక్క;
తయారీ: పనీర్‌ ముక్కలను వేడి నీటిలో వేసి మెత్తబడే వరకు పక్కన ఉంచాలి. బాణలి లో నూనె వేడి చేసి మీగడ, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు వేసి ఒక మోస్తరుగా వేయించాలి. వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకుని అదే బాణలిలో మిగిలిన నూనెలో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేయించాలి. ఆ తర్వాత మిరకపొడి, ధనియాల పొడి,పసుపు, మేథీ వేసి పచ్చిదనం పోయే వరకు వేయించాలి. ఉల్లిపాయ, టొమాటో ముక్కలు, జీడిపప్పు చల్లారిన తర్వాత మిక్సీలో గ్రైండ్‌ చేసి ఆ మిశ్రమాన్ని బాణలిలో వేయాలి. అందులో పాలు  పోసి, ఉప్పు వేసి కలిపి చిక్కదనం, రుచి చూసుకోవాలి. మిశ్రమం ఉడకడం మొదలై బుడగలు రావడం మొదలైన తర్వాత పనీర్‌ ముక్కలను నీటిలో నుంచి తీసి బాణలిలో వేసి కలపాలి. మంట తగ్గించి, వెన్న వేసి, కొత్తిమీర చల్లి స్టవ్‌ ఆపేయాలి.

ఇవీ చదవండి: అందం, ఆరోగ్యమే కాదు, బరువు తగ్గడంలో కూడా ‘గేమ్‌ ఛేంజర్‌’ ఇది!
శానిటరీ ప్యాడ్‌ అడిగితే.. ఇంత దారుణమా! నెటిజన్ల ఆగ్రహం



 

Advertisement
 
Advertisement
Advertisement