
తెలంగాణలోని ప్రముఖ ఆలివ్ హాస్పిటల్ (Olive Hospital) కొత్త ఆరోగ్యకరమైన వంటకాలతో మరో పుస్తకాన్ని విడుదల చేసింది. ప్రసిద్ధ వంటకాలతో , "హోల్సమ్ రెసిపీస్ ఫర్ ఎ వైబ్రెంట్ లైఫ్" (Wholesome Recipes for a Vibrant Life) ఐదో ఎడిషన్‌ను ప్రారంభించింది. ఆసుపత్రి నిపుణులైన డైటీషియన్లు ఈ పుస్తకం,రుచిలో రాజీ పడకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఆస్వాదించేలా ఈ రెసిపీలను రూపొందించారు.
2025 ఎడిషన్‌లో భారతదేశపు గొప్ప పాక సంప్రదాయాలను సమతుల్య పోషకాహారంతో మిళితం చేసే 60 కి పైగా వంటకాలు ఉన్నాయి. ఇందులో తృణధాన్యాలు, పప్పుధాన్యాలు,రోగనిరోధక శక్తిని పెంచే సుగంధ ద్రవ్యాలు వంటి వివిధ పదార్థాలు ఉన్నాయి. ముఖ్యంగా వెజిటబుల్ ఫ్రైడ్ రైస్, కాశ్మీరీ పులావ్ బిసి బెలె బాత్, పనీర్ టిక్కా బిర్యానీ, స్పినాచ్ పులావ్ ఉన్నాయి.ఇవన్నీ ఇంట్లో సులభంగా తయారు చేయడంతోపాటు, ఇవి అవసరమైన పోషకాలను అందిస్తాయని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. ఆరోగ్య సంరక్షణలో విశ్వసనీయత, నాణ్యమన వైద్య విధానాలతో మెరుగన ఆరోగ్య సేవలను అందిసున్న ఆలివ్ హాస్పిటట్ పోషకాహారం పాధాన్యతను వివరిస్తూ దీన్ని విడుదల చేసింది.
మెరుగైన ఆరోగ్యం వైపు ఒక అడుగు
ఆలివ్ హాస్పిటల్ గత నాలుగేళ్లుగా తీసుకొస్తున్న డైట్ ప్లాన్ పుస్తకం ఆరోగ్య స్పృహ ఉన్న వ్యక్తులు, రోగులకు ఉపయోగ పడుతోంది. ఆసుపత్రి వారి శ్రేయస్సు పట్ల నిరంతర నిబద్ధతలో భాగంగా ఇది రోగులకు పంపిణీ చేస్తారు. ప్రోటీన్-రిచ్ వంటకాల్లో పనీర్ టిక్కా బిర్యానీ, మాటర్ పులావ్ ఫీచర్లు, ప్రోటీన్ సుసంపన్నం కోసం పనీర్, టోఫు, కాయధాన్యాలు, బీన్స్, పాల ఉత్పత్తులను ఉపయోగిస్తారు. ఆకుకూరలతో సమృద్ధిగా ఉండే పాలకూర పులావ్, కాలీఫ్లవర్ లెమన్ రైస్, ఫైబర్-ప్యాక్డ్ రెసిపీలుంటాయి.
ఇందులోని వంటకాలు రోగనిరోధక శక్తిని పెంచడానికి, జీర్ణక్రియకు సహాయపడటానికి మరియు శక్తి స్థాయిలను నిలబెట్టడానికి పదార్థాల సమతుల్య మిశ్రమాన్ని అందిస్తుందని డైటెటిక్స్ హెడ్ సుగ్రా ఫాతిమా చెప్పారు.