ప్లాన్‌ చేస్తున్నాం కానీ... | Non Surgical Treatment Breast Fibroadenoma symptoms | Sakshi
Sakshi News home page

ప్లాన్‌ చేస్తున్నాం కానీ...

Jun 29 2025 9:06 AM | Updated on Jun 29 2025 9:06 AM

Non Surgical Treatment Breast Fibroadenoma symptoms

నాకు ముప్పై ఐదు సంవత్సరాలు. నా రెండు రొమ్ముల్లో గడ్డల్లాగా ఉన్నాయి. కాని, ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లా¯Œ  చేస్తున్నాం. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
– అనిత, విజయవాడ.
మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేస్తుండగా రొమ్ముల్లో గడ్డలు కనిపిస్తే, అది చిన్న సమస్య అయి ఉండొచ్చు, కాని నిర్లక్ష్యం చేయరానిది. చాలా సందర్భాల్లో ఇది ఫైబ్రో ఎడినోమా అనే సాదారణ సమస్యగా ఉంటుంది. ఇది నొప్పి లేకుండా కనిపిస్తుంది. మీ వయస్సు, కుటుంబంలో బ్రెస్ట్‌ కేన్సర్‌ చరిత్ర, బాడీ మాస్‌ ఇండెక్స్‌ 35 కంటే ఎక్కువగా ఉన్నట్లయితే, థైరాయిడ్, బీపీ వంటి సమస్యలుంటే, తప్పకుండా బ్రెస్ట్‌ అల్ట్రాసౌండ్‌ చెక్‌ చేయించాలి. గడ్డల  పరిమాణం, ప్రదేశం, స్వభావం ఆధారంగా దానికి బైరాడ్స్‌ గ్రేడింగ్‌ చేస్తారు. చాలా సందర్భాల్లో ఇది తక్కువ గ్రేడింగ్‌ అయ్యే అవకాశం ఉంది. 

అలాంటి సమయంలో ఇది ప్రమాదకరం కాదు. అలాగే ఇది భవిష్యత్తులో బ్రెస్ట్‌ ఫీడింగ్‌కు కూడా అంత అడ్డు రాదు. కానీ బ్రెస్ట్‌లో ఆకస్మికంగా వాపు, రంగు మారటం, నొప్పి రావడం లాంటివి కనిపిస్తే వెంటనే వైద్యుని కలవాలి. సంవత్సరానికి ఒకసారి చెక్‌ చేయించుకోవడం మంచిది. అలాగే స్వయంగా పరిశీలించి చూసుకోవడం వలన ఏదైనా మార్పు ఉంటే వెంటనే గుర్తించవచ్చు. అవసరమైతే డాక్టర్‌ ఎఫ్‌ఎ¯Œ ఏసీ లేదా బయాప్సీ చెయ్యమని సూచిస్తారు. ఎక్కువ మార్పులు కనిపిస్తే శస్త్రచికిత్స కూడా చేస్తారు. ఇది ప్రెగ్నెన్సీకి ఏ ప్రమాదం చేయదు. అయితే ప్రతి మార్పును గమనిస్తూ రెగ్యులర్‌ ఫాలోఅప్‌ చేస్తూ, డాక్టర్‌ సూచించిన పరీక్షలు, స్కానింగ్‌లను తప్పకుండా చేయించుకోవాలి.

నేను ఇప్పుడు మూడు నెలల గర్భవతిని. మా ఫ్యామిలీలో చాలామందికి థైరాయిడ్‌ ఉంది. అందుకే, ప్రెగ్నెన్సీలో నాకు కూడా వస్తుందేమో అనిపిస్తోంది. ఇందుకు ఏవైనా పరీక్షలు చేయించుకోవాలా?
– సుమలత, నూజివీడు.

మీ కుటుంబంలో థైరాయిడ్‌ సమస్యలు ఉన్నట్లయితే, ప్రెగ్నెన్సీ సమయంలో మీరు తప్పనిసరిగా థైరాయిడ్‌ పరీక్షలు చేయించుకోవాలి. ఎందుకంటే గర్భధారణ సమయంలో థైరాయిడ్‌ సమస్యలు ఉంటే అవి శిశువు ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. ముఖ్యంగా మెదడు అభివృద్ధి, నరాల వ్యవస్థపై దీని ప్రభావం ఉంటుంది. ప్రెగ్నెన్సీ మొదటి మూడు నెలల్లో టీఎస్‌హెచ్‌ అనే థైరాయిడ్‌ పరీక్ష చేయించాలి. ఈ సమయంలో టీఎస్‌హెచ్‌ స్థాయి 2.5 కంటే తక్కువగా ఉండాలి. 

అలాగే కుటుంబంలో ఇప్పటికే థైరాయిడ్‌ ఉన్నవారు ఉంటే, థైరాయిడ్‌ యాంటీబాడీ పరీక్ష కూడా చేయించాలి. ఈ పరీక్షలో యాంటీబాడీలు పాజిటివ్‌గా ఉంటే, గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువ. అందుకే, అలాంటి సందర్భాల్లో వైద్యుని సూచనల మేరకు తక్కువ మోతాదులో థైరాక్సి¯Œ  అనే మందును వాడాలి. ప్రెగ్నెన్సీ మొత్తం వ్యవధిలో టీఎస్‌హెచ్‌ స్థాయిని ప్రతి నెలా పరీక్ష చేయాలి. మూడో నెల దాటిన తర్వాత టీఎస్‌హెచ్‌ స్థాయి 3 వరకు ఉండవచ్చు. అంతకంటే ఎక్కువైతే, వైద్యులు మందుల మోతాదును సరిచేస్తారు. గర్భవతిగా ఉన్నప్పుడు టీఎస్‌హెచ్‌ స్థాయి మారుతూ ఉండే అవకాశం ఉంటుంది. 

అందువలన ప్రతిసారీ పరీక్షల ద్వారా స్థాయిని గమనించి, మందుల మోతాదును మార్చుకుంటూ ఉండాలి. చాలామంది గర్భవతులకు డెలివరీ తర్వాత కూడా థైరాయిడ్‌ యాంటీబాడీలు కొనసాగుతాయి. అందుకే డెలివరీ అనంతరం కూడా మందులను కొనసాగించే అవసరం ఉంటుంది. థైరాయిడ్‌ సమస్య ఉన్నా కూడా శిశువు ఆరోగ్యంగా పుట్టే అవకాశం ఉంది. ఇందుకోసం ముఖ్యంగా శిశువు మెదడు, చురుకుదనం, శరీరాభివృద్ధి బాగా జరగాలంటే మొదటి మూడు నెలల్లో టీఎస్‌హెచ్‌ స్థాయిని 2.5 కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అందుకే, ఎప్పటికప్పుడు డాక్టర్‌ను సంప్రదిస్తూ, వారు చెప్పే సూచనలు, సలహాలు పాటించడం చాలా అవసరం.  
∙ 

Advertisement
 
Advertisement
Advertisement