Health Tips: నెలసరి నొప్పితో బాధపడుతున్నారా? పుదీనా నీళ్లను..

 Natural Simple Tips For Maintaining Healthy Lifestyle - Sakshi

Health Tips: 
ఉసిరి పచ్చడి తీసుకోవడం, తేనెలో నానపెట్టిన ఉసిరిని నిత్యం పద్ధతి ప్రకారం సేవించడం ద్వారా దృష్టిలోపం తగ్గుతుంది. ఉసిరి పొడిని నిత్యం పరకడుపున తేనెతో కలిపి సేవించడం వల్ల వత్తిడి, అలసట తగ్గుతుంది.

ఎండు ద్రాక్షలు లేదా కిస్‌మిస్‌లు వాడడం మంచిది. వీటికి చలువ చేసే గుణం వుంది. గ్లాసుడు నీళ్లలో ఎండు ద్రాక్షలు వేసి, నానపెట్టి, ఆ నీటిని తీసుకుంటే వేడి చేయకుండా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకు చాలా మంచిది.

► గోధుమలు, బియ్యం, పెసలు, రాగులు, సోయాగింజ లు, జొన్నలు అరకిలో వంతున కలిపి, 50 గ్రాముల నువ్వులు, 20 గ్రాముల జీలకర్ర జోడించి, దోరగా విడివిడిగా వేయించాలి. ఆపై మరపట్టించి రొట్టెలు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పిండితో జావ కూడా చేసుకోవచ్చు.

► నెలసరి నొప్పితో బాధపడేవారు పుదీనా ఆకులను నీళ్లలో వేసి మరిగించి, వడకట్టి, ఆ నీటిని సేవించడం వల్ల మంచి ఫలితం వుంటుంది. పుదీనా ఆకులు, ఉప్పు కలిపి నీటిలో మరిగించి, ఆ ఆవిరి పడితే గొంతు మృదువుగా మారుతుంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top