
ఆపదలో అండగా...‘ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా చిన్న ఆలోచనతోనే మొదలవుతుంది’ అంటుంది కర్ణాటకలోని బెలగావికి చెందిన యువ ఇంజనీర్ నందిత యెనగి. శరద్ పాటిల్‌తో కలిసి సెల్ఫ్–డిఫెన్స్ బ్రాండ్ ‘వేల్ వేరబుల్’ను ప్రారంభించింది నందిత. ఈవ్–టీజింగ్ రూపంలో తనకో చేదు అనుభవం ఎదురైంది. ఆ సమయంలోనే వచ్చిన ఒక ఆలోచనే సెల్ఫ్–డిఫెన్స్ స్టార్టప్‌కు కారణం అయింది.
ఉమెన్ సేఫ్టీ వేరబుల్స్‌పై కంపెనీ దృష్టి పెట్టింది. ‘వేల్ వేరబుల్’ కంపెనీ ప్రసిద్ధ టీవీ షో ‘షార్క్ ట్యాంక్ ఇండియా’ దృష్టిలో పడింది. కంపెనీ ప్రారంభించడానికి కారణం, లక్ష్యాల గురించి ఈ కార్యక్రమంలో వివరించింది నందిత. ఈ కంపెనీలో 30 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేయడానికి అమన్ గుప్తా, వినీత్‌సింగ్‌లు ముందుకు వచ్చారు.
‘మహిళల భద్రతే ప్రధాన లక్ష్యంగా కంపెనీ మొదలు పెట్టాం. ఆత్మరక్షణ పరికరాల గురించి విస్తృతంగా ప్రచారం చేస్తాం’ అంటుంది నందిత. ఎలక్ట్రికల్ షాక్ వేరబుల్స్ ద్వారా సెల్ఫ్–డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించి కొత్త అడుగు వేసింది...వేల్ వేరబుల్.
దేశీయ మార్కెట్‌పైనే ప్రధానంగా దృష్టి పెట్టినప్పటికీ అంతర్జాతీయ మార్కెట్ దృష్టిని కూడా ఆకట్టుకుంది వేల్ వేరబుల్. నందితను యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్ తమ కంపెనీ గ్యాడ్జెట్స్‌ను పరిచయం చేయడానికి తమ దేశానికి ఆహ్వానించింది. యూఎస్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌లో తమ కంపెనీ సెల్ఫ్–డిఫెన్స్ గ్యాడ్జెట్‌ల గురించి వివరించింది నందిత యెనగి.