ఉల్లాసంగా నారీ ఫౌండేషన్‌ ‘గ్రాండ్‌ గార్బా’ | Naari Foundation Grand Garba held at Mumbai | Sakshi
Sakshi News home page

ఉల్లాసంగా నారీ ఫౌండేషన్‌ ‘గ్రాండ్‌ గార్బా’

Oct 29 2024 2:18 PM | Updated on Oct 29 2024 2:18 PM

Naari Foundation Grand Garba held at Mumbai

సాక్షి ముంబై: నారీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం వర్లీలో డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ హాల్‌లో ‘గ్రాండ్‌ గార్బా’కార్యక్రమం ఘనంగా జరిగింది. దాదాపు 150 మంది మహిళలు పాల్గొన్న ఈ కార్యక్రమానికి ప్రముఖ కొరియోగ్రాఫర్‌ కిషోర్‌ కకేరా న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా లక్కీడ్రా నిర్వహించి ఉత్తమ ఆహార్యం, ఉత్తమ నృత్య ప్రదర్శన కనబరిచిన మహిళలకు బహుమతులను అందజేశారు. 

ప్రతి ఏడాది అక్టోబర్‌ నెలలో ఇలాగే గ్రాండ్‌ గార్బా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నారీ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ సంజయ్‌ అల్లె తెలియజేశారు. ఈ ఈవెంట్‌ను విజయవంతం చేసేందుకు పవిత్ర కిరణ్‌ దొంత, నితిన్‌ దోమల్, గణేష్‌ గడ్డిమిడి, ఆకాష్‌ నంది, రాకేష్‌ గడిపెల్లి, రాజేంద్ర ఆడెపు, శ్రీమతి మయూరి, శ్రీమతి సమత, శ్రీమతి వినోద గుజ్జేటి తదితరులు ఎంతగానో శ్రమించారని పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement