అను వైద్యనాథన్‌: సాహసాల నుంచి నవ్వుల వరకు

Multi talented artiste Anu Vaidyanathan stand up comedy - Sakshi

అనురాధ వైద్యనాథన్‌ ఇంజినీర్, ట్రయాథ్లెట్‌ (స్విమ్మింగ్, బైస్కిల్‌ రైడింగ్, రన్నింగ్‌), రైటర్, ఫిల్మ్‌ మేకర్‌. ఇప్పుడు స్టాండప్‌ కామెడీతో కూడా తన ప్రతిభను చాటుకుంటోంది.  పిల్లలకు తల్లిగా తన అనుభవాలే ‘బిఫోర్‌ చిల్డ్రన్‌: ఆఫ్టర్‌ డైపర్స్‌’ (బీసి: ఏడీ).  ఈ స్టాండప్‌ కామెడి షోతో నవ్వుల ప్రయాణాన్ని మొదలు పెట్టింది అను విశ్వనాథన్‌... 

దిల్లీలో పుట్టిన అను వైద్యనాథన్‌ కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ చేసింది. న్యూజిలాండ్‌లోని ‘యూనివర్శిటీ ఆఫ్‌ కాంటర్‌బరీ’లో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ లో పీహెచ్‌డీ చేసింది. 2008లో ‘హాఫ్‌ ఐరన్‌మ్యాన్‌ 70.3 క్లియర్‌ వాటర్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌’ కు అర్హత సాధించిన మొదటి భారతీయ మహిళగా, 2009లో ‘అల్ట్రామాన్‌కెనడా’ ఈవెంట్‌ను పూర్తి చేసిన మొదటి ఆసియా మహిళగా ప్రత్యేకత చాటుకుంది. ఐఐఎం అహ్మదాబాద్, ఐఐటీ రోపర్‌లలో విజిటింగ్‌ ఫ్యాకల్టీగా పనిచేసింది.

తన సాహసాలకు ‘ఎనీ వేర్‌ బట్‌ హోమ్‌’ పేరుతో పుస్తక రూపం ఇచ్చింది. ఈ పుస్తకానికి మంచి స్పందన లభించింది. సినిమా అవకాశాలు వచ్చాయి. పిల్లల తల్లిగా తన అనుభవాలను ‘బిఫోర్‌ చిల్డ్రన్‌: ఆఫ్టర్‌ డైపర్స్‌’గా మలిచింది. ఈ స్టాండప్‌–కామెడీ షో ఘన విజయం సాధించింది. 

నవ్వించడం చాలా కష్టం’ అంటున్న అను అందుకోసం ‘కామిక్‌ పెర్‌ఫామెన్స్‌’ లో శిక్షణ తీసుకున్న తరువాతే స్టేజీ మీద అడుగు పెట్టింది.
న్యూ మామ్స్‌లో సహజంగా ఉండే ఒత్తిడిని మాయం చేసి వారి మనసులను తేలిక చేయడంలో ఈ షో విజయం సాధించింది.

తెల్లారి లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఎన్నో జరుగుతుంటాయి. వాటిలో నుంచి కామెడీకి అవసరమైన ముడిసరుకు దొరుకుతుంది. మనం ఏదీ మరిచి΄ోవడం లేదుగానీ నవ్వును మాత్రం మరిచిపోతున్నాం. నవ్వు మనల్ని సంతోషంగానే కాదు చురుగ్గానూ ఉంచుతుంది. పిల్లలకు తల్లిగా నేను కొత్త జీవితాన్ని ప్రారంభించాను. పేరెంట్‌గా ప్రతి రోజూ ఒక కొత్త విషయం తెలుసుకోవచ్చు. ఒకవైపు పిల్లల బాధ్యతలు చూసుకుంటూనే మరోవైపు కామెడీ షో కోసం ప్రయాణాలు చేస్తుంటాను. ఈ విషయంలో నా కుటుంబం నాకు అండగా ఉండి ముందుకు నడిపిస్తోంది’ అంటుంది అను విశ్వనాథన్‌.

  

whatsapp channel

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top