డీఎన్‌డీ మోడ్‌..! ఈజీగా నోటిఫికేషన్స్‌, ఫోన్‌కాల్స్‌ మ్యూట్‌ చెయ్యొచ్చు.. | Mobile Phone: How to use Do Not Distrub On Android | Sakshi
Sakshi News home page

డీఎన్‌డీ మోడ్‌..! ఈజీగా నోటిఫికేషన్స్‌, ఫోన్‌కాల్స్‌ మ్యూట్‌ చెయ్యొచ్చు..

May 30 2025 8:25 AM | Updated on May 30 2025 8:25 AM

Mobile Phone: How to use Do Not Distrub On Android

పనిచేస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు లేదా డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు స్మార్ట్‌ఫోన్‌ల నుంచి తరచుగా వచ్చే నోటిఫికేషన్‌లు దృష్టిని మరల్చుతుంటాయి. అలా అని ఫోన్‌ను ఏరోప్లేన్‌ మోడ్‌లో ఉంచడం మంచిది కాదు. ఇలాంటి పరిస్థితుల్లో డీఎన్‌డీ మోడ్‌గా ప్రసిద్ధి చెందిన ‘డూ నాట్‌ డిస్టర్బ్‌ మోడ్‌’ అవసరం. 

అప్లికేషన్‌ల నుండి నోటిఫికేషన్‌లను బ్లాక్‌ చేయడానికి, ముఖ్యమైన పనుల్లో ఉన్నప్పుడు దృష్టిని మరల్చే ఫోన్‌కాల్‌లను మ్యూట్‌ చేయడానికి డీఎన్‌డీ ఉపయోగపడుతుంది. డీఎన్‌డీ సెట్టింగ్‌ బ్రాండ్‌ నుంచి బ్రాండ్‌కు భిన్నంగా ఉంటుంది. కానీ బేసిక్స్‌ మాత్రం అలాగే ఉంటాయి.

డీన్‌డీ సెట్‌ చేయడానికి...
ఫోన్‌లో సెట్టింగ్స్‌ ఓపెన్‌ చెయ్యాలి ∙ ‘డోన్ట్‌ డిస్టర్బ్‌’ అని సెర్చ్‌బార్‌లో టైప్‌ చేయాలి. ∙ఆండ్రాయిడ్‌ ఫోన్‌లోని క్విక్‌ సెట్టింగ్‌ ప్యానెల్‌లో కూడా డీఎన్‌డీ కనిపిస్తుంది. ∙ఇప్పుడు డీఎన్‌డీ మోడ్‌ ఆన్‌ చేయవచ్చు  డీఎన్‌డీని షెడ్యూల్డ్‌ చేయడానికి ‘షెడ్యూల్డ్‌’ను క్లిక్‌ చేయాలి  ప్లస్‌(+) సైన్‌లోకి వెళ్లి యాక్టివిటీని ఎంపిక చేసుకోవాలి. 

ఉదా: వర్కింగ్, స్లీపింగ్, స్టడీ... మొదలైనవి  డీఎన్‌డీ మోడ్‌ టైమింగ్స్‌ ఎంపిక చేసుకోవచ్చు ∙ఎక్సెప్షెన్స్‌ను యాడ్‌ చేసుకోవచ్చు. ఉదా: బాస్, వైఫ్, ఫాదర్, మదర్‌... మొదలైనవి ∙నోటిఫికేషన్‌ రిసీవ్‌ చేసుకోవాలనుకునే యాప్‌లను కూడా యాడ్‌ చేసుకోవచ్చు.

(చదవండి: డైట్‌ సెన్స్‌ ఉంటే చాలు..! ఆరోగ్యం మన చేతిలోనే..)

Advertisement
 
Advertisement
Advertisement