
కళ వద్దకు వచ్చేటప్పటికీ..ఎంత అత్యున్నత హోదాలో ఉన్న వ్యక్తి అయినా చిన్నపిల్లవాడిలా మారిపోతారు. బహుశా ఆర్ట్‌కి ఉన్న శక్తి కాబోలు. ఇక్కడ అలానే ఒక రాష్ట్ర సీఎం పియానో చూడగానే ఆలపించాలనిపించిందో లేదా తన టాలెంట్‌ని చూపించాలనుకున్నారో గానీ అందరూ ఆశ్చర్యపోయేలా ప్లే చేయడమే గాక మైమరచిపోయేలా చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
రాజకీయాలకు అతీతంగా మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె సంగ్మా తన సంగీత ప్రతిభతో మరోసారి ప్రజలను మంత్రముగ్దుల్ని చేశారు. ఆ వీడియోల ఆయన 150 ఏళ్ల నాటి పియానోపై బాలీవుడ్ ప్రసిద్ధ పాట షెహ్లో నషా పాటను ప్లే చేశారు. షిల్లాంగ్‌లోని రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రి అలా ప్లే చేశారో లేదా ఒక్కసారిగా ప్రేక్షకులు చిరునవ్వులు చిందిస్తూ ఆస్వాదించారు.
ఈ రాక్‌స్టార్ సీఎం సగ్మా ఆలసించిన శ్రావ్యమైన సంగీతాన్ని అక్కడున్న చాలామంది తన ఫోన్ రికార్డు చేశారు కూడా. ఇక గవర్నర్ సీహెచ్ విజయ్ శకంర్ అక్కడున్న ప్రేక్షకుల్లో భాగం కావడం విశేషం. సంగ్మా ఇలా సంగీత వాయిద్యాన్ని సీఎం సంగ్మా ప్లే చేయడం కొత్తేం కాదు. గతంలో కూడా ఇలానే పలు సందర్భాల్లో తన సంగీత ప్రతిభను చాటుకున్నారు కూడా. ఇక సంగ్మా ప్రస్తుం పియానోపై ఆలపించిన పాట 1992లో విడుదలైన అమీర్‌ఖాన్ మూవీ ‘జో జీతా వోహి సికందర్’లోనిది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి మరి.
(చదవండి: కుటుంబం దూరమై... శునకాలే కుటుంబమై!)