యూత్ క్వీన్ | Meenakshi Dinesh shares her Life journey | Sakshi
Sakshi News home page

యూత్ క్వీన్

Jul 26 2026 1:03 AM | Updated on Jul 27 2026 4:35 PM

Meenakshi Dinesh shares her Life journey

అమ్మ కలను తన కలగా మార్చుకున్న నటి మీనాక్షి దినేష్‌ (Meenakshi Dinesh). కెమెరా ముందు హీరోయిన్ గా మెరిసినా... కెమెరా వెనుక మాత్రం కొత్త రుచుల కోసం ఊరంతాచుట్టేసే ఫుడీ! గాసిప్స్‌ను నవ్వుతూ పక్కన పెట్టే ఈ ‘యూత్‌’ హీరోయిన్ మనసులోని ముచ్చట్లు... మీకోసం.

ఆయన ఫ్యాన్  గర్ల్‌ని!
సూర్య సర్‌ అంటే నాకు చెప్పలేనంత అభిమానం. ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే... టెన్షన్ లో నా డైలాగులే మర్చిపోతానేమో! అలాగే నాని సర్‌ సినిమాలు కూడా చాలా ఇష్టం. ‘మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి’ సినిమాను నేను లెక్కలేనన్ని సార్లు చూశాను.

నా కల కాదు!
హీరోయిన్ అవ్వాలనేది నా ప్లాన్ కాదు... పూర్తిగా మా అమ్మ కల! నాలో ఏదో స్పార్క్‌ ఉందని మొదట గుర్తించింది ఆమే. నాతో ఆరేళ్ల వయసులోనే ఫొటోషూట్లు చేయించి, ఆడిషన్స్కు తీసుకెళ్లేది. పన్నెండేళ్లకే ‘పాండియన్ స్టోర్స్‌’ షోతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. అప్పుడు వచ్చిన నా తొలి పారితోషికం రూ.3,000. ఆ డబ్బు చూసి నేను ఆస్కార్‌ గెలిచినంతగా మా అమ్మ సంబరపడిపోయింది.

క్యాట్‌ ఫైట్స్‌... అంతా కథే!
నాతో పాటు అనిష్మ, ప్రియాన్షి లాంటి యంగ్‌ నటీమణులు ఉండటంతో మా మధ్య గొడవలు ఉన్నాయంటూ ఎన్నో గాసిప్స్‌ వచ్చాయి. కానీ సెట్స్‌లో మేమంతా ఒక ఫ్యామిలీలా ఉండేవాళ్లం. ఈ ఇండస్ట్రీలో ఎవరూ శత్రువులు కాదు... ప్రతి రోజూ కొత్తగా నేర్చుకునే సహనటులే. అందుకే నాకు ఎవరితోనూ పోటీ అనే భావనే లేదు.

సెలెక్టివ్‌గా ఉండడంలో తప్పేంటి?
‘యూత్‌’ విజయం తర్వాత నేను కథల విషయంలో చాలా కండిషన్స్ పెడుతున్నానని, డిఫికల్ట్‌గా మారానని రాస్తున్నారు. కానీ మంచి పాత్రలు కోరుకోవడం తప్పా? ప్రేక్షకుల మనసులో నిలిచిపోయే పాత్ర కోసం ఎదురు చూడాల్సి వచ్చినా నేను సిద్ధమే. డైరీ నింపుకోవడానికి సినిమాలు చేయను... గుర్తుండిపోయే పాత్రల కోసమే ఎదురుచూస్తాను.

ఎలాగోలా పాస్‌ అయ్యేదాన్ని!
నా చిన్నతనం అంతా ఒకవైపు స్కూల్, మరోవైపు యాడ్‌ షూటింగ్స్‌తోనే గడిచిపోయింది. సినిమాల్లో చూపించినంత కలర్‌ఫుల్‌గా నా స్కూల్‌ లైఫ్‌ ఉండేది కాదు. పరీక్షల్లో ఎలాగోలా పాస్‌ అయితే చాలు అనుకునే సాధారణ స్టూడెంట్‌ని.

డైటింగ్‌ నా వల్ల కాదు!
నేను పక్కా ఫుడీని. ‘యూత్‌’ సినిమాలో నా పాత్రకు తిండి అంటే ఎంత ఇష్టమో... నిజ జీవితంలో నాకు కూడా అంతే. ప్రమోషన్స్ కోసం హైదరాబాద్‌కు వచ్చినప్పుడు అందరూ షెడ్యూల్స్‌లో బిజీగా ఉంటే... నేను మాత్రం బెస్ట్‌ బిర్యానీ, బెస్ట్‌ లోకల్‌ ఫుడ్‌ ఎక్కడ దొరుకుతుందా అని వెతికేదాన్ని.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement