నార్త్‌ టు సౌత్‌ నగరానికి క్యూ కడుతున్న నార్త్‌ ఫుడ్‌ బ్రాండ్స్‌ | Lazeez Affaire makes South India debut in Hyderabad | Sakshi
Sakshi News home page

నార్త్‌ టు సౌత్‌ నగరానికి క్యూ కడుతున్న నార్త్‌ ఫుడ్‌ బ్రాండ్స్‌

Apr 25 2025 10:29 AM | Updated on Apr 25 2025 10:47 AM

Lazeez Affaire makes South India debut in Hyderabad

గ్లోబల్‌ వంటకాలకు కేంద్రంగా..  

ఇప్పటికే పాతికకు పైగా ప్రముఖ నార్త్‌ రెస్టారెంట్స్‌

జూబ్లీహిల్స్‌లో లజీజ్‌ అఫేర్‌ ప్రారంభం

సాక్షి, సిటీబ్యూరో:  విభిన్న సంస్కృతుల సమ్మేళనంలో భాగంగా నగరంలో వివిధ ప్రాంతాలకు చెందిన ఆహార రుచులు ఆదరణ పొందటం విధితమే. ఈ మధ్య కాలంలో నగరం వేదికగా నార్త్‌ డిషెస్‌కు విశేష ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో నగరంలో నార్త్‌ రెస్టారెంట్ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. ఇందులో భాగంగానే నార్త్‌ ఇండియన్‌ ఫుడ్‌కు ప్రసిద్ధి చెందిన లజీజ్‌ అఫేర్‌ నగరానికి విచ్చేసింది. ఢిల్లీ వేదికగా ప్రసిద్ధి చెందిన లజీజ్‌ అఫేర్‌ దక్షిణాదిలో మొదటిసారిగా నగరంలోని జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌–45లో ఆవిష్కరించడం ఇక్కడి ఫుడ్‌ లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌ అని ఫుడ్‌ బ్లాగర్స్‌ చెబుతున్నారు.

స్మోక్‌ తందూరి కబాబ్‌లు మొదలు మటన్‌ షికంపురి కబాబ్, పత్తర్‌ కా గోష్ట్‌ వంటి వంటకాలు ఉత్తరాది లాజీజ్‌ అఫైర్‌ ప్రత్యేకత. వీటితో పాటు షాహి దమ్‌ కా ఆలూ, భట్టి కా పనీర్, షాదీ కా లాల్‌ చికెన్, దాల్‌ లాజీజ్, కేసర్‌ ఫిర్ని వంటి రుచులను నగరవాసులకు చేరువ చేయడానికి జూబ్లీహిల్స్‌లో లజీజ్‌ అఫేర్‌ను ప్రారంభించినట్లు ఇన్నాటో హాస్పిటాలిటీ డైరెక్టర్‌ యాష్‌ త్రివేది తెలిపారు. ప్రత్యేకించి నార్ట్‌ స్టైల్‌ హైదరాబాదీ దమ్‌ బిర్యానీ మరోసారి నగరవాసులకు రుచి చూపించడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఉద్యోగం కోసం వెళ్లి, 42 ఏళ్లు అక్కడే మగ్గిపోయాడు...చివరికి

సుగంధ ద్రవ్యాల సమ్మిళితంతో సాంస్కృతిక వంటకాలు, ఉత్తరాది పాకశాస్త్ర నైపుణ్యాలతో వడ్డించిన పసందైన రుచులు హైదరాబాదీల మనసు దోచేస్తాయన్నారు. అనాది ప్రపంచ స్థాయి వంటకాలకు నగరం వేదికగా నిలుస్తోంది. ఇక్కడి ప్రజలు వినూత్న రుచులను ఆస్వాదించే లక్షణమే ఈ ఆహార వైవిధ్యానికి కారణం. ఈ ప్రయాణంలో లజీజ్‌ అఫేర్‌కు స్పందన వస్తుండటం తమ ప్రయత్నానికి భరోసా లభించిందని సహా డైరెక్టర్‌ కుష్‌ త్రివేది వివరించారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement