ఖాన్‌లు చేస్తున్న రావణ బొమ్మ | Kashi Muslim artisans keep Dussehra tradition blooming with Ravana effigies | Sakshi
Sakshi News home page

ఖాన్‌లు చేస్తున్న రావణ బొమ్మ

Oct 12 2024 9:19 AM | Updated on Oct 12 2024 9:19 AM

 Kashi Muslim artisans keep Dussehra tradition blooming with Ravana effigies

ఉత్తరప్రదేశ్‌ రాంపూర్‌లోని ఒక ముస్లిం కుటుంబానికి దసరా వస్తుందంటే చాలు... చేతి నిండా పని ఉంటుంది. తరతరాలుగా ఈ కుటుంబం దసరాకు రావణాసురుడి దిష్టి బొమ్మలను తయారు చేస్తోంది. ఈ ఏడాది ప్రత్యేకత విషయానికి వస్తే 80 అడుగుల ఎత్తులో రావణాసురుడి దిష్టి బొమ్మను తయారుచేశారు.

‘తాతముత్తాతల కాలం నుంచి ఈ పనిలో ఉన్నాం. మా తాత చేసిన పనిని మా నాన్న చేశాడు. నాన్న చేసిన పనిని నేను చేస్తున్నాను. నేను చేసిన పనిని పిల్లలు చేస్తున్నారు. ఈ పనివల్ల పెద్దగా డబ్బు సం΄ాదించక΄ోయినా మా తాతలు చేసిన పనిని మేము కొనసాగించడం సంతృప్తిగా, సంతోషంగా ఉంది’ అంటున్నాడు ముంతాజ్‌ ఖాన్‌.

ఖాన్‌ కుటుంబం తయారు చేసిన దిష్టి బొమ్మల కోసం మొరాదాబాద్, ఫతేపూర్, హపూర్‌...లాంటి ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఈ సంవత్సరం హరియాణా, పంజాబ్‌ల నుంచి కూడా దిష్టిబొమ్మల కోసం ఆర్డర్లు వస్తున్నాయి

‘దిష్టిబొమ్మల తయారీలో మేము ఉపయోగించే గన్‌ ΄ûడర్‌ ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాలుష్య రహితంగా ఉంటుంది. పెద్ద అధికారులు ఈ దిష్టిబొమ్మలను తనిఖీ చేసిన తరువాతే విక్రయిస్తాం’ అంటున్నాడు ఖాన్‌.

రావణుడి దిష్టి బొమ్మలను తయారు చేయడం అనేది ఒక ముస్లిం కుటుంబం చేసే పని అనుకోవడం కంటే మన దేశంలో మతసామరస్యానికి ఉదాహరణ అని సగర్వంగా చెప్పుకునే పని. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement