
79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులను భారత దేశం ఘనం నిర్వహించుకుంటోంది. చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతీ భారతీయుడు దేశవ్యాప్తంగా మువ్వన్నెల జెండాను ఎగురవేసి వేడుకులను చేసుకుంటున్నారు. పలువురు రాజకీయ, సినీ, క్రీడారంగ ప్రముఖులు, సెలబ్రిటీలు ఇండిపెండెన్స్ డే వేడుకల వివరాలను పంచుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలకు, అభిమానులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అందిస్తున్నారు. అలాంటివాటిలో కొన్నింటిని చూద్దాం.
టాలీవుడ్ హీరో రాంచరణతో తన కుమార్తె క్లిన్ కారాతో కలిసి వేడుకలను నిర్వహించారు. తిరంగా జెండాకు సెల్యూట్ చేస్తూ వీడియోను షేర్ చేశారు..
నటి ప్రగ్వాజైశ్వాల్ అందరికీ 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది.
ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా,మనం అనుభవిస్తున్న స్వేచ్ఛకు, అందుకోసం తమ ప్రాణాలను పణంగా పెట్టిన లెక్కలేనన్ని ప్రాణాలకు కృతజ్ఞత తెలుపుదాంఅంటూ పోస్ట్ చేసింది. అలాగే పహల్గామ్ దాడి , ఆపరేషన్ సిందూర్‌లో అసమాన ధైర్యాన్ని ప్రదర్శించిన ధైర్యవంతులను గుర్తు చేసుకున్నాడు. మన ప్రశాంత జీవనానికి తోడ్పడుతున్న ప్రతి సైనికుడికి. మన సాయుధ దళాలకు, లక్షలాది మందికి సెల్యూట్ చే సింది.
ప్రముఖ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ కూడా ఇన్‌స్టాలో ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలతో ఒక ఫోటోను షేర్ చేశారు.