breaking news
independance day celrbrations
-
ఒకనాటి జెండా పండగ మువ్వన్నెలూ పిల్లల ముఖాల్లోనే...
ఆగస్టు పదిహేనంటే ముందు దేశభక్తి గీతాల అడావిడి. క్లాసులో ఎవరికీ సరిగా పాడటం రాదు. కాని అందరూ చేతులెత్తేవారే. ఊరి హైస్కూల్లో... ఏ హైస్కూల్లో అయినా నలుగురైదుగురు టీచరమ్మలు ఉంటారు. ఒక ఐవోరుకి పాటల గురించి కొద్దిగా తెలిసి ఉంటుంది. అంతో ఇంతో పాడేవాడై కూడా ఉంటాడు. వీళ్లకు హెడ్మాస్టర్ పుణ్యమా అని ఈ దేశభక్తి పాటల డ్యూటీ. ఎయిత్ క్లాస్, నైన్త్ క్లాస్ వాళ్లను వెతికి గ్రూపులు చేసి పాడించడం. మరి టెన్త్‌క్లాస్ వాళ్లో? వాళ్లకు పబ్లిక్ ఎగ్జామ్స్ కదా. చదువుకోవాలి. ఈ ఆపరేషన్‌కు దూరంగా ఉంచాలి. అయితే ఒక సర్దా ఉందండోయ్. రిహార్సల్స్ పేరు చెప్పి పీరియడ్స్ ఎగ్గొట్టొచ్చు. ఐవోర్ల స్టాఫ్‌రూమ్‌లో రిహార్సల్స్. ప్రతిసారీ అవే పాటలు. బ్యాచ్‌లు మారతాయంతే.‘వందేమాతరం.. సుజలాం.. సుఫలాం.. మలయజశీతలాం’..‘తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా’...‘పాడవోయి భారతీయుడా ఆడిపాడవోయి విజయగీతికా’...‘సారే జహాసే అచ్ఛా హిందూసితా హమారా’...‘జయజయ ప్రియభారత జనయిత్రీ దివ్యధాత్రి’...‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ’....అదేంటోగాని ఆగస్టు పదిహేనుకు ఫండు పిల్లలే తేవాలి. రంగు కాగితాలకీ, చార్ట్లకీ, పురికొసలకీ. ఇంట్లో అడగాలి. ఎంత? పావలా... అర్ధరూపాయి... అమ్మో అన్ని డబ్బులే. మరి 1985–86ల్లో అవి పెద్ద డబ్బులే. కొందరు తెచ్చేవారు. కొందరు మెదలకుండా ఉండేవాళ్లు. క్లాసులో ఎవడైతే పరమ బేవార్సు స్టూడెంట్‌గా ఉంటాడో వాడికి రంగు కాగితాలు కట్ చేయడంలో, రంగురంగుల త్రికోణాలు పురికొసకు అంటించి వేళ్లాడగట్టడంలో తోట తరణి అంత అనుభవం ఉంటుంది. వాడికి సేకరించి ఐదురూపాయల పావలా ఇస్తే తుర్రున బుక్‌స్టోర్‌కు పరిగెత్తి రంగు కాగితాలూ కత్తెర కొని ఒక టీమ్‌తో మైదా పిండి ఉడకబెట్టించి ఆ పనిలో ఉంటాడు. బోర్డును నీటుగా కడిగి, తడిపిన రంగు చాక్‌పీస్‌లతో ‘స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు’ అని అందంగా రాసే స్టూడెంట్లు ప్రతి క్లాస్‌లో ఒకరో ఇద్దరో ఉంటారు. వీరు మ్యాథ్స్‌లో వీక్... డ్రాయింగ్‌లో ఫస్ట్. ఈ డ్యూటీ వారిది.అయితే ప్రతి సెక్షన్ వారికీ ఈ ఆగస్టు 15న కాస్త కుళ్లు ఉండేది ఒకే ఒక వ్యక్తి మీద. వాడు ఎస్.పి.ఎల్. ఆ రోజు వాడి డాబు, దర్పాన్ని ఆపేవాడుండదు. అందరూ యూనిఫామ్ వేసుకుంటే వాడు ఎన్సిసి డ్రస్సు లాంటిది వేసుకొని ఎర్రబంతి వేళ్లాడే ఖాకీ క్యాప్ పెట్టుకొని ఏ పోలీస్ ఆఫీసరులానో ఉంటాడు. వాడు ‘అటెన్షన్’ అంటే అటెన్షన్. వాడు ‘స్టాండ్ ఎట్ ఈజ్’... అంటే తెరిపి. జెండా ఎగరేయడానికి వీడు మార్చింగ్ చేస్తూ హెడ్మాస్టర్ని, చీఫ్గెస్టునీ తీసుకొస్తాడు. జెండా ఎగరేశాక వీడు సెల్యూట్ కొడితే హెడ్మాస్టర్ వీడికి సెల్యూట్ కొడతారు. మిగిలిన పిల్లలకి ఈ చాన్స్ ఎక్కడా? అందుకే వాడంటే కొంచెం ఇది.ఆగస్టు పదిహేనుకు పూలు తెచ్చి జెండాలో పెట్టే పని టీచరమ్మలది. పూలున్న జెండాను పొట్లంలా చుట్టి జెండాకర్ర కొసాకు పంపించడం, తాడు లాగినప్పుడు జెండా విడివడి పూలు అందరి మీద పడేలా కట్టడం అందరికీ వచ్చనుకుంటున్నారా? రాదు. దానికి పీఈటీ వోరు ఎక్స్పర్ట్. ఆయనే అది చేయాలి. మనం చేస్తే తాడు లాగితే జెండా ఊడదు. పరువు పోతుంది. అందుకని ప్రతి ఆగస్టు 15న తాడు లాగితే జెండా ఎగరుతుందా లేదా అని అదో టెన్షన్.ప్రతి స్టూడెంట్ బాగా ఉతికిన యూనిఫామ్ ఇస్త్రీ చేయించుకొని మరీ ఆ రోజున వేసుకోవాలి. చెంబిస్త్రీ, చేటిస్త్రీ తప్పదు. పాపం హాస్టల్ పిల్లలు శుభ్రమైన బట్టలు వేసుకొచ్చినా వారికి ఇస్త్రీ వీలు లేకపోవడంతో చిన్నబుచ్చుకునేవారు. ఫ్రెండ్సు వారితో చేరి ‘ఏం పర్లేదు లేరా. మీ చొక్కాలే మా చొక్కాల కంటే తెల్లగా ఉన్నాయి’ అని ఉత్సాహపరిచేవారు. వారు నూనె రాసుకున్న తలలతో తెల్లగా నవ్వేవారు.రోజూ స్కూలు ఉదయం తొమ్మిదికైతే ఆ రోజున ఎనిమిదికే సిద్ధం. గ్రౌండ్లో సుద్దపొడి వేసి లైన్లు కొట్టి ఒక్కో సెక్షన్ ఒక్కో లైన్లో నిలబడేలా చేసేవారు. జెండా కర్ర దగ్గర స్టేజ్. ఊరి ఆర్డివోనో తాసిల్దారో రిటైరై వెళ్లిపోయిన హెడ్మాస్టరో చీఫ్ గెస్టు. టిఫిన్ చేసొచ్చిన పిల్లలూ... చేయకుండా వచ్చిన పిల్లలూ... చాక్లెట్లు ఎన్ని పంచొచ్చో ఎక్స్‌పెక్టేషన్స్‌లో ఉన్న పిల్లలూ... వీళ్లు మళ్లీ ఇంట్లో తోబుట్టువులకు హామీ ఇచ్చి వచ్చి ఉంటారు... చాక్లెట్లు తెచ్చిస్తా అని. అదొక టెన్షన్. హెడ్మాస్టర్ మూడ్ బాగుంటే రెండు పెద్ద పెద్ద పళ్లేలు తెప్పించి మూడు నాలుగు రకాల చాక్లెట్లు పోయించి, నయాపైసాకు ఒకటి వచ్చే బ్రిటానియా రౌండ్ బిస్కెట్లు వాటిలో కలిపి, మిశ్రీ ముక్కలు కూడా మిక్స్ చేసి గుప్పెడు గుప్పెడు పంచితే అదీ కిక్కు. పాపం కొన్ని వీధి బడుల్లో బొరుగుల్లో బెల్లం ముక్కలు కలిపి పంచేవారు. ఆ స్కూళ్ల ఆగస్టు 15కు పిల్లలు వెళ్లేవాళ్లు కాదు.అయితే చాక్లెట్లు, బిస్కెట్లు అంత సులువుగా రావు. ఎండ వాయకొడుతున్నా లెక్కచేయకుండా జెండా వందనం చేయించి, దేశభక్తి గీతాలు పాడించి, గెస్టు స్పీచు, హెడ్మాస్టరు స్పెషలు స్పీచు ఇచ్చి... దేశం తాలుకు బాధ్యతలన్నీ ఆ పూట ఎదురుగా నిలుచున్న పిట్ల ప్రాణాలకే అప్పజెప్పేసేవారు. నేటి బాలలే రేపటి పౌరులు అనేసేవారు. ఆ బాలలేమో స్కూల్లేదు కదా... మధ్యాహ్నం మేట్నీకి డబ్బులెలా అనే మనాదిలో ఉంటారు.ఇన్నింటి మధ్య కూడా ఆగస్టు పదిహేను బాగుండేది. స్కూల్లోని ప్రతి క్లాసు రంగు కాగితాలతో రెపరెపలాడేది. ప్రతి గుండె మీద త్రివర్ణపతాకం గుండు పిన్నుతో అంటుకుపోయేది. ప్రతి పెదవి మీద గాంధీ నెహ్రూ సుభాసుబోసు భగత్సింగుల పేరు పలికేది. ‘హమ్ బుల్బులేహై ఇస్కే ఏ గుల్‌సితా హమారా’... ఈ దేశపు గువ్వపిట్టలం... రెక్కలు సాచి ఎగురతాం అని పాడుతూ ప్రతి చిన్నారి హృదయం ఆకాంక్ష చేసేది. పొందికైన బట్టల్లో టీచర్లు, ఉపాధ్యాయులు హుందాగా కనిపించేవారు. ప్రతి పీరియడ్కూ బెల్లు కొట్టే ప్యూన్ ఆ రోజు చాక్లెట్లు పంచుతూ చక్కగా నవ్వేవాడు. క్లాసులు చిమ్మే ఆయమ్మ కొప్పులో చామంతులు పెట్టుకొని కొత్తగా కనిపించేది. అందరం పెద్దయ్యి దేశం కోసం ఏదో ఒకటి చేయాలని కాసేపైనా గట్టిగా అనిపించేది. ఇక రోజూ చేసే ప్రతిజ్ఞ ఆ రోజు మరింత ప్రత్యేకంగా ఉండేది. ‘నేను నా సహోదరులను ప్రేమించుచున్నాను’.... ఈ ఒక్కలైను భవిష్యత్తు సమాజాన్ని నిర్మించేది. ‘ఈ దేశ సంపదకు అర్హుడనవ్వడానికి సదా కృషి చేస్తాను’ ఈ లైనూ ముఖ్యమే.మనం అర్హులమై ఉండాలి. మనం మన సమాజాన్ని ప్రేమించడానికి. మనల్ని మన దేశం ప్రేమించడానికి. పాఠశాల మరో తల్లి గర్భం. అక్కడ పొందే జవసత్వాలు, బుద్ధి కుశలతలు, చదువూ సంస్కారాలు... ఇవే నిజమైన దేశభక్తి. ఇవే నిజమైన ఆగస్టు 15. ప్రతి తరాన్ని ‘అర్హులైన తరం’గా మలచగలినంత కాలం మన దేశ ఖ్యాతికీ, దీప్తికీ ఢోకా లేదు. అలా జరిగినంత కాలం విశ్వానికి మనమే ‘భాగ్య విధాతలం’. తెలుగు తల్లి, తెలంగాణ తల్లి... భరతమాతకు ప్రతిరూపమే. ఏ తల్లిబిడ్డలైనా అందరూ భరతమాత బిడ్డలే.జెండా ఊంచా రహేగా హమారా.భారతమాతాకీ జై. జైహింద్!విదేశీ గడ్డపై మన జెండా!జర్మనీలోని స్టట్‌గార్డ్‌లో 1907లో జరిగిన ఒక విప్లవ సమావేశంలో భారతదేశ స్వాతంత్య్ర ఆకాంక్షలను చాటి చెప్పేలా డిజైన్ చేసిన ఒక జెండా (ఇప్పటి జాతీయ జెండా కాదు)ను ఎగరేశారు భికాజీ కామా. విదేశీ గడ్డపై మన జెండా ఎగరేసిన తొలి భారతీయురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు.గాంధీ గారి రేడియోనానిక్ మోత్వానీ అనే వ్యాపారవేత్త అమెరికా, ఇంగ్లాండ్‌ల నుంచి రివర్స్–ఇంజినీర్ యాంప్లిఫయర్స్, మైక్రోఫోన్స్, లౌడ్స్పీకర్లను దిగుమతి చేసుకొని ‘చికాగో రేడియో’ ప్రారంభించారు. ఈ రేడియో మహాత్మాగాంధీ ప్రసంగాలను విస్తృతంగా ప్రసారం చేసేది. స్వాతంత్య్ర సమరయోధులు రహస్య, భూగర్భ నెట్‌వర్క్‌లను నడపడంలో మోత్వానీ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న సాంకేతిక పరికరాలు ఉపయోగపడ్డాయి.క్యాట్ ఆర్మీస్వాతంత్రోద్యమ కాలంలో బ్రిటిష్ వారిపై నిరసన కార్యక్రమాలు సృజనాత్మకంగా, ఆకట్టుకునేలా రూపొందించేవారు. శాసనోల్లంఘన ఉద్యమ కాలంలో సూరత్‌లో క్యాట్ ఆర్మీ(మంజరి సేన) అనే సంఘంలోని మహిళలు జాతీయజెండా రంగులలో ముంచిన ఖాదీ వస్త్రాలు ధరించి బ్రిటిష్ అధికారులను ధిక్కరించారు. ∙సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా నిరసనలు జరిగినప్పుడు లక్నోలాంటి నగరాల్లో ‘సైమన్ గో బ్యాక్’ అని రాసి ఉన్న గాలిపటాలను ఎగరేశారు.అసామాన్య మహిళలుకొత్తగా వెలుగులోకి వచ్చిన బీబీసి వారి ఫొటో ఆర్కైవ్‌లో.... ఉప్పు సత్యాగ్రహంలో సామాన్య మహిళలు ఎంత ధైర్యసాహసాలు, అంకితభావంతో పాల్గొన్నారో, శాసనోల్లంఘన ఉద్యమాన్ని ఎలా నడిపించారో కళ్లకు కట్టే ఫొటోలు ఉన్నాయి. పోలీసులను బహిరంగంగా సవాలు చేశారు, మాటకు మాట బదులిచ్చారు మహిళా స్వాతంత్య్ర సమరయోధులు.నివేదిత వజ్ర ఫ్లాగ్సిస్టర్ నివేదిత 1904లో భారత జాతీయ జెండాకు రూపకల్పన చేశారు. ‘నివేదిత వజ్ర ఫ్లాగ్’ అని పిలిచే ఈ జెండాలో ఎరుపు, పసుపు రంగుల నేపథ్యం, తెల్లని తామరపువ్వుతో కూడిన వజ్రం చిహ్నం, వందేమాతరం నినాదం కనిపిస్తాయి.దండి యాత్రలో అతి పిన్న వయస్కుడుఉప్పుపై పన్నును వ్యతిరేకిస్తూ సబర్మతి ఆశ్రమం నుండి ‘దండి యాత్ర’ ప్రారంభించారు గాంధీజీ. భారతదేశంలో వివిధ ప్రాంతాలు, వర్గాలకు చెందిన ప్రజలు ఈ యాత్రలో పాల్గొన్నారు. ఈ మార్చ్‌లో పాల్గొన్న వారిలో అత్యంత పిన్న వయస్కుడు పదహారేళ్ల విఠల్ లీలాధర్ ఠక్కర్. -
సెలబ్రిటీల ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్, రాంచరణ్, ప్రగ్యా, ఇంకా..!
79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులను భారత దేశం ఘనం నిర్వహించుకుంటోంది. చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతీ భారతీయుడు దేశవ్యాప్తంగా మువ్వన్నెల జెండాను ఎగుర వేసి వేడుకలను చేసుకుంటున్నారు. పలువురు రాజకీయ, సినీ, క్రీడారంగ ప్రముఖులు, సెలబ్రిటీలు ఇండిపెండెన్స్ డే వేడుకల వివరాలను పంచుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలకు, అభిమానులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అందిస్తున్నారు. అలాంటివాటిలో కొన్నింటిని చూద్దాం.టాలీవుడ్ హీరో రాంచరణ్ తన కుమార్తె క్లింకారాతో కలిసి వేడుకలను నిర్వహించారు. తిరంగా జెండాకు సెల్యూట్ చేస్తూ వీడియోను షేర్ చేశారు.. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan)నటి ప్రగ్వాజైశ్వాల్ అందరికీ 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది. View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా,మనం అనుభవిస్తున్న స్వేచ్ఛకు, అందుకోసం తమ ప్రాణాలను పణంగా పెట్టిన లెక్కలేనన్ని ప్రాణాలకు కృతజ్ఞత తెలుపుదాంఅంటూ పోస్ట్ చేసింది. అలాగే పహల్గామ్ దాడి, ఆపరేషన్ సిందూర్‌లో అసమాన ధైర్యాన్ని ప్రదర్శించిన ధైర్యవంతులను గుర్తు చేసుకున్నారు.. మన ప్రశాంత జీవనానికి తోడ్పడుతున్న ప్రతి సైనికుడికి. మన సాయుధ దళాలకు, లక్షలాది మందికి సెల్యూట్ చేసింది. View this post on Instagram A post shared by Mohammed Siraj (@mohammedsirajofficial) ప్రముఖ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ కూడా ఇన్‌స్టాలో ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలతో ఒక ఫోటోను షేర్ చేశారు. -
జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం వైఎస్ జగన్
-
జెండా ఊంచా రహే హమారా!
జెండా అనేది మన గుర్తింపు. నాగరికత పుట్టినప్పటినుంచే అవి మన అస్తిత్వంలో ప్రధాన పాత్రను పోషించాయి. భారతదేశ స్వాతంత్య్రానికి 75 ఏళ్లు పూర్తవుతున్న అద్భుతమైన సందర్భంలో ఉన్నాం. జెండాలతో భావోద్వేగ బంధాన్ని ఏర్పర్చే లక్ష్యంతో ‘హర్ ఘర్ తిరంగా’ (ఇంటింటికీ మువ్వన్నెల జెండా) కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. దేశవ్యాప్తంగా జెండాలు పంపిణీ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసింది. త్రివర్ణ పతాకాన్ని ఇంటిపై రెపరెపలాడించడం ద్వారా భారతీయులందరిలోనూ జాతీయవాద భావన మేల్కొల్పాలనేది ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశం. అప్పుడే దేశమంతా ఒకే తాటిపైకి వస్తుంది. జాతి నిర్మాణంలో మనమంతా భాగస్వాములు కావాలనే స్ఫూర్తి రగులుతుంది. మహాభారతంలో దుర్యోధనుడి పరాజయంతో కురుక్షేత్ర యుద్ధం ముగుస్తుంది. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడి రథానికి కట్టిన గుర్రాలను విడిపించి, ఆ రథం నుంచి అర్జునుడిని దూరంగా తీసుకెళ్తాడు. అదే సమయంలో, కురుక్షేత్ర యుద్ధం ఆసాంతం అర్జునుడి రథానికి పైభాగంలో రక్షణ కవచంలా ఉన్నటువంటి హనుమంతుని చిత్రం పతాకం నుంచి మాయమైపోతుంది. ఆ మరుక్షణమే రథం ఒక్క సారిగా నిప్పులు చిమ్ముతూ పేలిపోతుంది. ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయిన అర్జునుడిని ఉద్దేశిస్తూ జగన్నాథుడు, ‘యుద్ధంలో భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు వంటి మహామహులు నీపై వినియో గించిన శక్తిమంతమైన అస్త్రాలతో నీ రథం ఎప్పుడో తునాతునకలు అయి ఉండేది. కేవలం నీ రథం మీద ఉన్న జెండాపై కపిరాజే నీకు నిరంతరం రక్షగా నిలిచాడు’ అని చెబుతాడు. నాగరికత పుట్టినప్పటినుంచే మన అస్తిత్వంలో, మన రక్షణలో జెండాలు పోషించిన పాత్రను తెలియజేసే ఉదాహరణలు ఎన్నో చెప్పుకోవచ్చు. వివిధ సందర్భాల్లో ప్రజలు తమ విధేయతను చాటు కునేందుకు కూడా పతాకాలు ఎంతో ఉపయుక్తం అయ్యాయి. మన ధర్మాన్నీ, మన ఆచార వ్యవహారాలనూ ఈ పతాకాలు ప్రతిబింబి స్తాయి. కార్తికేయుడు సేవల్ కోడి పతాకాన్ని వినియోగించడం, రాముడు లంకానగరంపై యుద్ధానికేగినపుడు సూర్యపతాకాన్ని వాడటం, త్రేతాయుగంలో యుధిష్ఠిరుడు బంగారు వర్ణంలోని చంద్రుడి జెండాను వినియోగించడం మొదలుకుని... ఒడిశాలోని పరమ పవిత్రమైన పూరిలోని జగన్నాథాలయంలో వాయుదిశకు వ్యతిరేకంగా రెపరెపలాడే పతాకం (పతితపాబన్ బనా) వరకు యుగయుగాలుగా పతాకాలు మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగమైపోయాయి. 1947 జూలై 22న రాజ్యాంగ సభ మన జాతీయ పతాకానికి ఆమోదం తెలిపింది. మన తెలుగువాడైన పింగళి వెంకయ్య రూపొం దించిన జాతీయ పతాకానికి 1921లో మహాత్మా గాంధీ ఆమోదం తెలిపారు. వివిధ మార్పులతో 1947లో త్రివర్ణ పతాకంగా రూపు దిద్దుకుంది. ఇవాళ మనకు నిరంతర స్ఫూర్తిని నింపుతున్న వెంకయ్య ప్రముఖ జాతీయవాది, స్వాతంత్య్ర సమరయోధుడు, బహుభాషా కోవిదుడు కూడా. 1913లో జపనీస్ భాషలో వారు చేసిన అద్భుత మైన ప్రసంగానికిగానూ ‘జపాన్ వెంకయ్య’గా పేరుపొందారు. ఆగస్టు 2న ఆ మహనీయుడి జయంతి సందర్భంగా... మన మువ్వన్నెల జెండాను రూపొందించడంలో వారి కృషిని మనమంతా తెలుసుకుని ప్రేరణ పొందాల్సిన అవసరం ఉంది. ఎన్నో ఏళ్లు పోరాడి, ఎందరో వీరుల అసమానమైన త్యాగాల అనంతరం స్వాతంత్య్రాన్ని సంపాదించుకున్న తర్వాత కూడా జాతీయ జెండాతో మన అనుబంధం... భావోద్వేగ బంధం కంటే నియమబద్ధమైన (ఫార్మల్), సంస్థాగతమైన బంధంగా మాత్రమే కొనసాగింది. అలాంటి పరిస్థితిని మార్చి, మువ్వన్నెలను మన జీవితా లతో పెనవేసి, భావోద్వేగ బంధాన్ని ఏర్పర్చే లక్ష్యంతోనే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ‘హర్ ఘర్ తిరంగా’ (ఇంటింటికీ మువ్వన్నెల జెండా) కార్యక్రమాన్ని రూపొందించారు. భారతదేశ స్వాతంత్య్రానికి 75 ఏళ్లు పూర్తవుతున్న పవిత్రమైన, అద్భుతమైన సందర్భంలో ఉన్నాం. ప్రతి భారతీయుడూ త్రివర్ణ పతాకాన్ని ఇంటిపై రెపరెప లాడించడం ద్వారా జాతీయవాద భావన ప్రతి ఒక్కరిలోనూ మేల్కొ ల్పాలనేది ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశం. ప్రజల భాగస్వామ్యంతోనే ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమం విజయవంతం అవు తుంది. అప్పుడే దేశమంతా ఒకే తాటిపైకి వస్తుంది. ఈ ఉద్యమంలో రాష్ట్రాలూ, కేంద్ర పాలిత ప్రాంతాలూ, కేంద్ర ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖలూ సంపూర్ణమైన ఉత్సాహంతో పాల్గొంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినట్లుగా ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు దేశమంతా త్రివర్ణ పతాకం రెపరెపలాడేలా ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో స్వాతంత్య్ర పోరాట ఘట్టాలను, దేశభక్తిని, భారతీయుల ఐక్యతను ప్రతిబింబించేలా కార్యక్రమాలు చేపడుతున్నారు. జాతీయ జెండా ఎగురవేసేందుకు ఇదివరకున్న నియమ, నిబంధనల్లో స్వల్ప మార్పులు తీసుకొచ్చారు. తద్వారా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం ఓ కార్యక్రమంగా మాత్రమే కాకుండా ‘మన దేశం’ అనే భావన ప్రతి ఒక్కరిలోనూ ఇది పెంపొందిస్తుంది. జాతి నిర్మాణంలో మనమంతా భాగస్వాములు కావాలనే బాధ్యతను కూడా ఈ కార్యక్రమం గుర్తుచేస్తుంది. జాతీయ జెండాను చూడగానే ఇవాళ మన దేశ యువతకు దేశ ఉజ్వలమైన భవిష్యత్తు కనబడుతోంది. జాతీయ జెండాను చూసిన పుడు ఓ తల్లికి తనతోపాటు తన కుటుంబానికి ఉన్న విస్తృతమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓ సైనికుడికి మువ్వన్నెలను చూసిన పుడు... దేశ రక్షణ కోసం ఊపిరున్నంతవరకూ పోరాడాలన్న స్ఫూర్తి అందుతుంది. ఓ ప్రభుత్వాధికారి జెండాను చూసినపుడు ప్రభుత్వ, రాజ్యాంగ లక్ష్యాలను అమలుచేసేందుకు కావాల్సిన ఉత్సాహం, సమాజంలోని చివరి వ్యక్తి వరకూ పథకాల ఫలాలు అందించాలన్న తపన పెరుగుతాయి. ‘ఇంటింటికీ మువ్వన్నెలు’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకుగానూ కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జెండాలు పంపిణీ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా ప్రతి పోస్టాఫీసులో 2022 ఆగస్టు 1 నుంచి జాతీయ జెండాలను అందు బాటులోకి తీసుకువస్తోంది. దీనికితోడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా జాతీయ జెండాలను ప్రజలకు అందుబాటులోకి ఉంచేందుకు భాగ స్వామ్య పక్షాలతో కలిసి పనిచేస్తున్నాయి. అలాగే కేంద్ర ప్రభుత్వ ఈ–మార్కెట్లోనూ (జెమ్) జెండాలు అందుబాటులోకి రాను న్నాయి. వివిధ ఈ–కామర్స్ కంపెనీలతో, స్వయం సహాయక బృందాలతోనూ కేంద్రం సమన్వయంతో పనిచేస్తోంది. భౌతికంగా ఇంటిపై జెండా ఎగురవేయాలి. దీంతోపాటుగా వర్చువల్ గా కూడా ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో పాల్గొనేలా ఏర్పాట్లు జరుగు తున్నాయి. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రారంభించిన వెబ్సైట్లో ఎవరైనా జెండాను పిన్ చేయడంతోపాటు, ఇళ్లపై ఎగుర వేసిన త్రివర్ణ పతాకంతో సెల్ఫీ తీసుకుని పోస్ట్ చేయవచ్చు. 1947 జూలై 22న రాజ్యాంగ సభలో త్రివర్ణ పతాకంపై తీర్మానం సందర్భంగా సరోజిని నాయుడు మాట్లాడుతూ... ‘ఈ సభలోని ప్రతి ఒక్కరూ మువ్వన్నెల ప్రాధాన్యతను భావ కవితల రూపంలో వెల్లడిం చారు. ఓ కవయిత్రిగా, ఓ మహిళగా నా భావాన్ని వ్యక్తపరుస్తున్నాను. మహిళలం ఎప్పుడూ దేశ ఐక్యత, సమగ్రత కోసం నిలబడతాం. ఈ జెండాకు రాజు, సామాన్యుడు, ధనవంతుడు, పేదవాడు అనే తేడాలే లేవు. ప్రత్యేకమైన హక్కులంటూ ఏమీ లేవు. జెండాను చూసినపుడు దేశం కోసం మనం చేయాల్సిన కర్తవ్యం, బాధ్యత, త్యాగం మాత్రమే మనకు గుర్తుకురావాలి. మనం హిందువులమో, ముస్లింలమో, క్రిస్టియన్లమో, సిక్కులమో, జొరాస్ట్రియన్లమో లేక వేరొక మత స్తులమో కావొచ్చు. కానీ మన భారతమాత హృదయం, ఆత్మ అవిభాజ్యమైనవి. నవభారతంలో జన్మించే ప్రతి ఒక్కరూ త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేస్తారు. తమ గౌరవాన్ని చాటుకుంటారు’ అని పేర్కొన్నారు. ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా మనం జెండా ఎగురవేస్తున్నప్పుడు, సరోజిని నాయుడు చెప్పిన మాటలన్నీ మన గుండెల్లో మార్మోగుతూ ఉండాలి. జాతీయవాద భావన మనలో నిరంతరం స్ఫూర్తి రగిలిస్తూ ఉండాలి. వ్యాసకర్త కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖామాత్యులు -
‘కత్తి’ హీరోయిన్ మరోసారి వార్తల్లోకి, అటు భర్తతో మాల్దీవుల్లో హల్చల్
సాక్షి, హైదరాబాద్: కత్తి మూవీ హీరోయిన్, హిందీ బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ సనాఖాన్ మరోసారి వార్తల్లో నిలిచింది. పాఠశాల స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సనాఖాన్ ఈ వేడుకలను సంబంధించిన వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. గుజరాత్‌కు చెందిన వ్యాపారవేత్త, భర్త ముఫ్తీ అనాస్ సయ్యద్‌తో కలిసి ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలను సనాఖాన్ పోస్ట్ చేసింది. అలాగే భర్తతో మాల్దీవుల్లో గడిపిన అద్భుతమైన క్షణాలను, ఫోటోలను ఫ్యాన్స్‌తో పంచుకుంది. 75 వసంతాల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ఆమె ఆ తరువాత విద్యార్థులనుద్దేశించి మాట్లాడింది. అయితే ఆ తరువాత వారిద్దరూ వెళుతుండగా, విద్యార్థులంతా చుట్టు ముట్టి హడావిడి చేశారు. ‘సనా..సనా’ అటూ పెద్దగా అరుస్తూ సందడి చేశారు. దీంతో పోలీసులు, బాడీగార్డులు వారికి రక్షణగా ఏర్పడ్డారు. దేవుడా.. ఈ ప్రేమ ఎప్పటికీ ఉండాలని ఆ అల్లాను ప్రార్థిస్తున్నా నంటూ ఆ వీడియోను షేర్ చేసింది. మరోవైపు భర్త అనాస్‌తో సనా ఇటీవల మాల్దీవుల్లో హాలీడే ట్రిప్‌ను ఎంజాయ్ చేసింది. అక్కడి బీచ్, వాటర్ విల్లా, పూల్‌లో సరదాగా గడపింది. పూల్ ఫ్లోటీపై స్వారీ చేస్తూ దాదాపు నీటిలో పడిపోవడం, రియాల్టీ, ఎక్స్పెక్టేషన్ అంటూ ఊయలను గట్టిగా ఊపుతూ భర్త తనను భయపెట్టి, నవ్వించిన ఫన్నీ వీడియోను కూడా అభిమానులతో షేర్ చేసింది. కాగా సినిమా లైఫ్ స్టయిల్‌కు పూర్తిగా దూరం కావాలని భావిస్తున్నానంటూ గత ఏడాది అక్టోబర్‌లో ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చింది. ఆ సృష్టికర్త ఆదేశాలకు నటను స్వస్తి పలికి మానవాళికి సేవ చేయాలని భావిస్తున్నానని ప్రకటించింది. ఆ తరువాత అనాస్‌ని వివాహమాడి మరో సర్ప్రైజ్ ఇచ్చింది. సనాఖాన్ ఖత్రోన్ కే ఖిలాడీ, హల్లా బోల్, జై హో,ఏక్ ప్రేమ్ కథ వంటి చిత్రాలతోపాటు, టాలీవుడ్ హీరో కళ్యాణ్ రామ్ నటించిన చిత్రం కత్తి మూవీలో హీరోయిన్గా నటించింది. 'గగనం', 'మిస్టర్ నూకయ్య' సినిమాలో కూడా నటించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Saiyad Sana Khan (@sanakhaan21) View this post on Instagram A post shared by Saiyad Sana Khan (@sanakhaan21) View this post on Instagram A post shared by Saiyad Sana Khan (@sanakhaan21) View this post on Instagram A post shared by Saiyad Sana Khan (@sanakhaan21) -
వందేమాతరం.. మనదే ఈ తరం
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయనేత్రీ భారతమాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు అంటూ.. చిన్నారుల దేశభక్తి గీతాలు, సమైక్యతను చాటేలా వ్యాయామ విద్యార్థుల విన్యాసాలు, జాతీయ భావాన్ని కలిగించే ప్రసంగాలతో ఏలూరు పోలీస్ పరేడ్ గ్రేండ్స్లో సోమవారం స్వాతంత్య్ర దిన వేడుకలు అంబరాన్నంటాయి. –ఏలూరు (మెట్రో) జిల్లావ్యాప్తంగా 70వ స్వాతంత్య్ర దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. జిల్లాస్థాయిలో ఏలూరులో జరిగిన వేడుకల్లో దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బేటీ బచావో–బేటీ పడావో నినాదంతో సర్వశిక్షాభియాన్ శకటాన్ని ప్రదర్శించారు. ఆర్డబ్ల్యూఎస్, డీఆర్డీఏ, వైద్యారోగ్య శాఖ, 108, 104, చంద్రన్న సంచార చికిత్స, అటవీ శాఖ, వ్యవసాయ, ఐటీడీఏ శాఖలు శకటాలను ప్రదర్శించాయి. విన్యాసం.. అబ్బురం వేడుకలలో భాగంగా వివిధ పాఠశాలల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఏలూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన ‘దేశమంటే మట్టికాదోయ్– దేశమంటే మనుషులోయ్’, కొవ్వలి జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు ‘జయహో..’, శర్వాణీ ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు ‘భరత ఖండమే నా దేశం’, గోపన్నపాలెం ప్రభుత్వ వ్యాయామ కళాశాల విద్యార్థులు ‘భారతీయం’, ఏలూరు రవీంద్రభారతి విద్యార్థులు ‘చెక్‌దే ఇండియా’, చైతన్య విద్యార్థులు ‘వందేమాతరం’ నృత్య రూపకాలు ఆకట్టుకున్నాయి. గోపన్నపాలెం వ్యాయామ విద్యార్థులు అబ్బురపరిచే విన్యాసాలతో అలరించారు. విజేతలకు మంత్రి మాణిక్యాలరావు ప్రశంసా పత్రాలు అందించారు. గోపన్నపాలెం వ్యాయామ కళాశాల విద్యార్థుల నృత్యం మొదటి స్థానంలో నిలిచింది. కలెక్టర్ కె.భాస్కర్, ఎస్పీ భాస్కర్‌భూషణ్, డీఈవో డి.మధుసూదనరావు, డెప్యూటీ డీఈవో డి.ఉదయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


