International Asteroid Day: గ్రహశకలం నేలను ఢీ కొంటే..! | If an asteroid strikes the Earth what are the consequences | Sakshi
Sakshi News home page

International Asteroid Day: గ్రహశకలం నేలను ఢీ కొంటే..!

Jun 30 2025 10:32 AM | Updated on Jun 30 2025 10:43 AM

If an asteroid strikes the Earth what are the consequences

నేడు అంతర్జాతీయ గ్రహశకల దినోత్సవం

ఆస్టరాయిడ్స్‌ (Asteroids)అంటే గ్రహ శకలాలు. ఇవి సూర్యుని చుట్టూ దీర్ఘవలయాకార కక్ష్యలో తిరుగుతుంటాయి. గురు గ్రహానికీ, అంగారక గ్రహానికీ మధ్యగల మండ లంలో ఇవి ఎక్కువగా ఉన్నాయి. 2016 డిసెంబర్‌లో ప్రతి ఏడాదీ జూన్‌ 30వ తేదీని అంతర్జాతీయ గ్రహ శకల దినోత్సవం (International Asteroid Day ) గా జరపాలని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. 

ఇది 1908 జూన్‌ 30న రష్యాలోని సైబీ రియా ప్రాంతంలో ఉన్న తుంగస్కా నదిపై జరిగిన ఓ సంఘటనను గుర్తుచేసుకునే వార్షికోత్సవంగా చెప్ప వచ్చు. ఈ నదిపై ఓ గ్రహశకలం పేలిపోయింది. పెద్ద ్రVýæహశకలం ఒకటి గంటకు 53,913 కిలోమీటర్ల వేగంతో వాతావరణాన్ని ఢీకొట్టింది. ఈ గ్రహశకలం వాతావరణంలో  ప్రవేశించడం వలన ఏర్పడిన ‘రాతి విస్ఫోటనం’ ధర్మో న్యూక్లియర్‌’ పేలుడు అని గమనించారు. ఈ పేలుడు వలన విస్తారమైన అటవీ ప్రాంతంలోని చెట్లన్నీ కూలి పోయాయి. ఈ పేలుడులో విడుదలైన శక్తి 1,000 హిరోషిమా అణుబాంబు లకు సమానం. అయినా అక్కడ ఎటు వంటి బిలం ఏర్పడలేదు. అంటే గ్రహ శకలం భూమిని ఢీకొట్టకుండా వాతావరణంలో పేలి పోయిందన్నమాట. ఈ సమయంలో ప్రకాశవంత మైన కాంతి, పెద ్దశబ్దాలు, భూప్రకంపనలు పశ్చిమ ఐరోపా వరకు నమోదు అయ్యాయి. 

‘గ్రహశకలాలు – అవి భూమి చరిత్రలో, భవి ష్యత్తులో పోషించే పాత్ర, దానిపై అవగాహన కల్పించడంపై దృష్టి పెట్టడం’ ఈ ఏడాది దినోత్సవ ఇతివృత్తం. అంటే ఈ రోజున గ్రహ శకలాల ద్వారా సంభ వించే ప్రమాదాల గురించి అవగాహన పెరిగేందుకు ప్రపంచవ్యాప్తంగా సదస్సులు, ప్రదర్శనలు జరుపు తారు. గ్రహ శకలాల వల్ల కలిగే ప్రమాదాల నుండి భూమిని రక్షించుకోవడానికి చేపట్టాల్సిన చర్యల గురించి చర్చిస్తారు. 

ఏటా దాదాపు 17,000 గ్రహశకలాలు భూమి వైపు పడతాయని ఒక అంచనా. ఇవి వాతావరణంలో ప్రవేశించిన తరువాత చిన్న కణాలు లేదా దుమ్ముగా మారి పోతాయి. అందువల్ల అవి మనకు కన్పించవు. అను దినం 44,000 కిలోల గ్రహశకలాల పదార్థం భూమిపై పడుతుందని ఒక అంచనా. గ్రహశకలం నేల వైపు పడేటప్పుడు ముందుగా అది వాతావరణంలోకి వస్తుంది. వాతావరణంతో కలిగే ఘర్షణ వల్లఈ రాతి ముక్క బాగా వేడెక్కుతుంది. చివరకు అది కాలిపోయి ఆవిరిగా మారుతుంది.

ఈ క్రమంలో ఆకాశంలో ప్రకాశవంతమైన గీత కన్పిస్తుంది. మన వాతా వరణం చాలా గ్రహశకలాలను ఇలా నాశనం చేస్తుంది కాబట్టి  దాదాపు 95 శాతం ఈ రాతి ముక్కలు భూమిని చేరవు. ఈ విధంగా వాతావరణం గ్రహశకలాల బారి నుండి భూమిని కాపాడుతోంది. గ్రహశకలం భూమిని తాకితే వాతావరణంలో దుమ్ము, పొగ పెరుగుతాయి. వీటివల్ల ఆ ప్రాంతంలో సూర్యరశ్మి చేరక ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. ఫలితంగా అనేక జీవులు మరణిస్తాయి. ఒక అపార్టుమెంటు పరిమా ణంలో ఉన్న గ్రహశకలం భూమిని తాకితే ఒక చిన్న నగరం నాశనం అయిపోతుంది.    
– డా. సి.వి. సర్వేశ్వర శర్మ ,పాపులర్‌ సైన్స్‌ రచయిత 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement