breaking news
the earth
-
International Asteroid Day: గ్రహశకలం నేలను ఢీ కొంటే..!
ఆస్టరాయిడ్స్ (Asteroids)అంటే గ్రహ శకలాలు. ఇవి సూర్యుని చుట్టూ దీర్ఘవలయాకార కక్ష్యలో తిరుగుతుంటాయి. గురు గ్రహానికీ, అంగారక గ్రహానికీ మధ్యగల మండ లంలో ఇవి ఎక్కువగా ఉన్నాయి. 2016 డిసెంబర్లో ప్రతి ఏడాదీ జూన్ 30వ తేదీని అంతర్జాతీయ గ్రహ శకల దినోత్సవం (International Asteroid Day ) గా జరపాలని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఇది 1908 జూన్ 30న రష్యాలోని సైబీ రియా ప్రాంతంలో ఉన్న తుంగస్కా నదిపై జరిగిన ఓ సంఘటనను గుర్తుచేసుకునే వార్షికోత్సవంగా చెప్ప వచ్చు. ఈ నదిపై ఓ గ్రహశకలం పేలిపోయింది. పెద్ద ్రVýæహశకలం ఒకటి గంటకు 53,913 కిలోమీటర్ల వేగంతో వాతావరణాన్ని ఢీకొట్టింది. ఈ గ్రహశకలం వాతావరణంలో ప్రవేశించడం వలన ఏర్పడిన ‘రాతి విస్ఫోటనం’ ధర్మో న్యూక్లియర్’ పేలుడు అని గమనించారు. ఈ పేలుడు వలన విస్తారమైన అటవీ ప్రాంతంలోని చెట్లన్నీ కూలి పోయాయి. ఈ పేలుడులో విడుదలైన శక్తి 1,000 హిరోషిమా అణుబాంబు లకు సమానం. అయినా అక్కడ ఎటు వంటి బిలం ఏర్పడలేదు. అంటే గ్రహ శకలం భూమిని ఢీకొట్టకుండా వాతావరణంలో పేలి పోయిందన్నమాట. ఈ సమయంలో ప్రకాశవంత మైన కాంతి, పెద ్దశబ్దాలు, భూప్రకంపనలు పశ్చిమ ఐరోపా వరకు నమోదు అయ్యాయి. ‘గ్రహశకలాలు – అవి భూమి చరిత్రలో, భవి ష్యత్తులో పోషించే పాత్ర, దానిపై అవగాహన కల్పించడంపై దృష్టి పెట్టడం’ ఈ ఏడాది దినోత్సవ ఇతివృత్తం. అంటే ఈ రోజున గ్రహ శకలాల ద్వారా సంభ వించే ప్రమాదాల గురించి అవగాహన పెరిగేందుకు ప్రపంచవ్యాప్తంగా సదస్సులు, ప్రదర్శనలు జరుపు తారు. గ్రహ శకలాల వల్ల కలిగే ప్రమాదాల నుండి భూమిని రక్షించుకోవడానికి చేపట్టాల్సిన చర్యల గురించి చర్చిస్తారు. ఏటా దాదాపు 17,000 గ్రహశకలాలు భూమి వైపు పడతాయని ఒక అంచనా. ఇవి వాతావరణంలో ప్రవేశించిన తరువాత చిన్న కణాలు లేదా దుమ్ముగా మారి పోతాయి. అందువల్ల అవి మనకు కన్పించవు. అను దినం 44,000 కిలోల గ్రహశకలాల పదార్థం భూమిపై పడుతుందని ఒక అంచనా. గ్రహశకలం నేల వైపు పడేటప్పుడు ముందుగా అది వాతావరణంలోకి వస్తుంది. వాతావరణంతో కలిగే ఘర్షణ వల్లఈ రాతి ముక్క బాగా వేడెక్కుతుంది. చివరకు అది కాలిపోయి ఆవిరిగా మారుతుంది.ఈ క్రమంలో ఆకాశంలో ప్రకాశవంతమైన గీత కన్పిస్తుంది. మన వాతా వరణం చాలా గ్రహశకలాలను ఇలా నాశనం చేస్తుంది కాబట్టి దాదాపు 95 శాతం ఈ రాతి ముక్కలు భూమిని చేరవు. ఈ విధంగా వాతావరణం గ్రహశకలాల బారి నుండి భూమిని కాపాడుతోంది. గ్రహశకలం భూమిని తాకితే వాతావరణంలో దుమ్ము, పొగ పెరుగుతాయి. వీటివల్ల ఆ ప్రాంతంలో సూర్యరశ్మి చేరక ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. ఫలితంగా అనేక జీవులు మరణిస్తాయి. ఒక అపార్టుమెంటు పరిమా ణంలో ఉన్న గ్రహశకలం భూమిని తాకితే ఒక చిన్న నగరం నాశనం అయిపోతుంది. – డా. సి.వి. సర్వేశ్వర శర్మ ,పాపులర్ సైన్స్ రచయిత -
లఖ్వీ విడుదలకు పాక్ కోర్టు ఆదేశం
పాక్ హైకమిషనర్‌ను పిలిపించి భారత్ నిరసన ఇస్లామాబాద్: ముంబై దాడుల సూత్రధారి లష్కరే తోయిబా ఉగ్రవాది జకీవుర్ రహ్మాన్ లఖ్వీని వెంటనే విడుదల చేయాలని పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్ హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. శాంతిభద్రతల పరిరక్షణ కింద లఖ్వీని నిర్బంధంలో ఉంచడాన్ని తప్పుబట్టింది. రావల్పిండి జైల్లో ఉన్న లఖ్వీ... కోర్టు ఆదేశాలపై శనివారం విడుదలయ్యే అవకాశముంది. దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది. లఖ్వీకి వ్యతిరేకంగా సరైన సాక్ష్యాలను పాక్ ప్రభుత్వం కోర్టుకు సమర్పించలేదని ఆగ్రహించింది. అతన్ని విడుదల చేయడం ప్రమాదకరమని హోం శాఖ సహాయ మంత్రి కిరెన్ రిజిజూ అన్నారు. భారత విదేశాంగ కార్యదర్శి అనిల్ వాధ్వా(తూర్పు) ఢిల్లీలోని పాక్ హైకమిషనర్ బాసిత్‌ను పిలిపించి నిరసన వ్యక్తం చేశారు. ముంబై దాడుల కేసులో లఖ్వీకి పాక్ ఉగ్రవాద వ్యతిరేక కోర్టు డిసెంబర్లో బెయిలివ్వడం తెలిసిందే. దీన్ని భారత్ వ్యతిరేకించడంతో శాంతి భద్రతల పరిరక్షణ కింద పాక్ ప్రభుత్వం అతడిని నిర్బంధించింది. లఖ్వీ పైకోర్టులో సవాలు చేయగా... విడుదల చేయాల్సిందిగా ఆదేశించింది.లఖ్వీని విడుదల చేసిన అధికారులు.. వెంటనే అదే చట్టం కింద మరోమారునిర్బంధించారు. కాగా, సంఝౌతా రైల్లో పేలుడు కేసు విచారణలో జాప్యం జరుగుం తోందని పాక్ సర్కారు ఇస్లామాబాద్‌లోని భారత డిప్యూటీ హైకమిషనర్‌ను పిలిపించు కుని నిరసన తెలిపింది.