Utkatasana: బలాన్ని పెంచే ఉత్కటాసనం | How to practice Utkatasana | Sakshi
Sakshi News home page

Utkatasana: బలాన్ని పెంచే ఉత్కటాసనం

Nov 5 2024 11:03 AM | Updated on Nov 5 2024 11:03 AM

How to practice Utkatasana

రోజులో ఎక్కువ సేపు కూర్చుని పనిచేసేవారిని తక్కువ సమయంలోనే రిలాక్స్‌ చేస్తుంది కుర్చీ ఆసనం. ఈ కుర్చీ భంగిమను ఉత్కటాసన అంటారు. ఈ ఆసనాన్ని సాధన చేయడానికి ముందుగా శరీరాన్ని నిలుచున్న స్థానంలో సిద్ధ పరచాలి.  

సులువైన సాధన
ముందు నిటారుగా నిల్చోవాలి. పాదాలు రెండూ దగ్గరగా ఉంచి, చేతులను పైకి ఎత్తాలి. 

కుర్చీలో కూర్చున్నట్టుగా మోకాళ్లను ముందుకు వంచాలి. దీంతో హిప్‌ భాగం వెనక్కి, మోకాళ్లు ముందుకు వచ్చి, చెయిర్‌ మీద కూర్చున్న భంగిమ వస్తుంది. 

చేతులను నమస్కారం చేసినట్టుగా ఒక దగ్గరగా చేర్చాలి. 

ఈ భంగిమలో పొట్ట భాగం లోపలికి తీసుకుంటూ, వెన్నెముకను నిటారుగా ఉంచాలి. ∙దీర్ఘ శ్వాసలు తీసుకుంటూ, వదులుతూ వీలైనంత వరకు ఈ ఆసనంలో ఉండచ్చు. 

5 నుంచి 6 సార్లు ఈ ఆసనాన్నిప్రాక్టీస్‌ చేయడం ద్వారా కండరాలు బలపడతాయి. 

మెరుగైన పనితీరు
కాలు, కాలు వెనుక, భుజం కండరాలను బలోపేతం అవుతాయి.  ∙రక్తప్రసరణ, గుండెపనితీరు పెరుగుతుంది. శ్వాసక్రియ మెరుగుపడటం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యమూ పెరుగుతుంది.  

Advertisement
 
Advertisement
Advertisement