క్యాబేజ్‌తో ఎగ్‌ భుర్జి.. ఎప్పుడైనా ట్రై చేశారా? చపాతీలో బావుంటుంది | Best Egg Recipes: How To Make Cabbage Egg Bhurji Recipe In Telugu, Making Process Inside - Sakshi
Sakshi News home page

Cabbage Egg Bhurji Recipe: క్యాబేజ్‌తో ఎగ్‌ భుర్జి.. ఎప్పుడైనా ట్రై చేశారా? చపాతీలో బావుంటుంది

Dec 1 2023 11:00 AM | Updated on Dec 1 2023 12:13 PM

How To Make Cabbage Egg Bhurji Recipe In Telugu - Sakshi

క్యాబేజ్‌ ఎగ్‌  భుర్జి తయారీకి కావల్సినవి

క్యాబేజీ తురుము – రెండు కప్పులు; నూనె – మూడు టేబుల్‌ స్పూన్లు;
ఉల్లిపాయ తరుగు – అరకప్పు; అల్లం వెల్లుల్లి పేస్టు – ఒకటిన్నర టీస్పూన్లు;
పచ్చిమిర్చి – చిన్నవి ఆరు(సన్నగా తరగాలి); ధనియాల పొడి – అరటీస్పూను;
పసుపు – అరటీస్పూను; కారం – ముప్పావు టీస్పూను; గుడ్లు – నాలుగు;
ఉప్పు – రుచికి సరిపడా; కొత్తిమీర తరుగు – రెండు టేబుల్‌ స్పూన్లు. 

తయారీ విధానమిలా:
►స్టవ్‌ మీద మందపాటి బాణలి పెట్టి నూనె వేసి వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ తరుగు వేసి వేయించాలి.  ఉల్లిపాయ వేగాక, అల్లం వెల్లుల్లి పేస్టువేసి వేయించాలి.
► అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిన తరువాత పచ్చిమిర్చి తరుగు వేయాలి. మిర్చి వేగిన తరువాత ధనియాల పొడి, కారం, పసుపు, క్యాబేజీ తరుగు, రుచికి సరిపడా ►ఉప్పు వేసి కలిపి బాణలి మీద మూతపెట్టి సన్న మంట మీద మగ్గనివ్వాలి.
►గుడ్లసొనను ఒక గిన్నెలో వేసి బీటర్‌ లేదా ఫోర్క్‌తో కలిపి పక్కన పెట్టాలి. ∙క్యాబేజీ ఉడికి దగ్గర పడుతున్నప్పుడు గుడ్ల సొనవేసి కలుపుతూ వేయించాలి.
► చక్కగా వేగిన తర్వాత కొత్తిమీర చల్లుకుని దించేయాలి. ∙రోస్టెడ్‌ బ్రెడ్, చపాతీ, రోటీలోకి ఇది మంచి సైడ్‌ డిష్‌.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement