బనానా – ఓట్స్‌తో వెరైటీగా కజ్జికాయలు.. ఓసారి ట్రై చేయండి | How To Make Banana Oats Kajjikayalu Recipe In Telugu | Sakshi
Sakshi News home page

బనానా – ఓట్స్‌తో వెరైటీగా కజ్జికాయలు.. ఓసారి ట్రై చేయండి

Oct 10 2023 3:53 PM | Updated on Oct 10 2023 4:11 PM

How To Make Banana Oats Kajjikayalu Recipe In Telugu - Sakshi

బనానా – ఓట్స్‌ కజ్జికాయలు తయారీకి కావల్సినవి: 
అరటిపండు గుజ్జు – 1 కప్పు
ఓట్స్‌ పౌడర్‌ – అర కప్పు (1 టేబుల్‌ స్పూన్‌  నెయ్యి వేసుకుని దోరగా వేయించుకోవాలి)
కొబ్బరి కోరు – పావు కప్పు
పంచదార పొడి  2 టేబుల్‌ స్పూన్లు
సోయా పాలు – పావు కప్పు
నూనె – 4 టేబుల్‌ స్పూన్లు
మైదాపిండి – 1 కప్పు, ఉప్పు – కొద్దిగా

తయారీ విధానమిలా:
ముందుగా స్టవ్‌ ఆన్‌  చేసుకుని.. కళాయిలో 2 టేబుల్‌ స్పూన్ల నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. అందులో కొబ్బరికోరు, ఓట్స్‌ పౌడర్‌ వేసుకుని దోరగా వేయించి.. అరటిపండు గుజ్జు, పంచదార పొడి వేసుకుని కలుపుతూ ఉండాలి. చివరిగా సోయా పాలు పోసుకుని తిప్పుతూ మూత పెట్టి చిన్న మంటపైన మగ్గనివ్వాలి.

ఈలోపు మైదాపిండిలో  2 టేబుల్‌ స్పూన్ల నూనె, తగినంత ఉప్పు వేసుకుని కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుని ముద్దలా చేసుకుని పావు గంట పక్కన పెట్టుకోవాలి. అనంతరం ఆ మిశ్రమంతో చిన్న చిన్న ఉండలు చేసుకుని చపాతీల్లా ఒత్తుకుని, మధ్యలో బనానా–ఓట్స్‌ మిశ్రమం పెట్టుకుని కజ్జికాయలుగా చుట్టుకోవాలి. వాటిని నూనెలో దోరగా వేయించుకుంటే సరిపోతుంది. ఇవి నిలువ ఉండవు. 

Advertisement
 
Advertisement
Advertisement