బనానాతో బర్ఫీ.. సింపుల్‌గా, క్షణాల్లో చేసుకోవచ్చు | How To Make Banana Barfi Recipe In Telugu | Sakshi
Sakshi News home page

బనానాతో బర్ఫీ.. సింపుల్‌గా, క్షణాల్లో చేసుకోవచ్చు

Dec 12 2023 4:25 PM | Updated on Dec 12 2023 4:25 PM

How To Make Banana Barfi Recipe In Telugu - Sakshi

బనానా జాంగ్రీ బర్ఫీ తయారీకి కావల్సినవి:


అరటిపండ్లు – 3 (చిన్న చిన్న ముక్కలుగా తరిగి మిక్సీ పట్టుకోవాలి)
కొబ్బరి కోరు – ఒకటిన్నర కప్పులు, నెయ్యి – 3 టేబుల్‌ స్పూన్లు,
మిల్క్‌ పౌడర్‌ – 1 కప్పు, బెల్లం తురుము (జాంగ్రీ) – ముప్పావు కప్పు,
ఏలకుల పొడి – అర టీ స్పూన్‌   (అభిరుచిని బట్టి), 
చిక్కటి పాలు – పావు కప్పు (కాచినవి), జీడిపప్పు, బాదం ముక్కలు – గార్నిష్‌కి సరిపడా

తయారీ విధానమిలా:
ఒక పాత్రలో కొబ్బరి కోరు, బెల్లం తురుము, పాలు పోసుకుని.. సిమ్‌ ఫ్లేమ్‌లో స్టవ్‌ మీద పెట్టుకుని గరిటెతో కలుపుతూండాలి. కాస్త దగ్గర పడుతున్న సమయంలో నెయ్యి, అరటిపండు గుజ్జు, మిల్క్‌ పౌడర్, ఏలకుల పొడి వేసి గరిటెతో తిప్పుతూండాలి. మిశ్రమం మొత్తం దగ్గర పడగానే.. ఒక బౌల్లోకి తీసుకుని జీడిపప్పు, బాదం ముక్కలతో గార్నిష్‌ చేసి మూడు నాలుగు గంటల పాటు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. అనంతరం కావలసిన షేప్‌లో ముక్కలుగా కట్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి. 

Advertisement
 
Advertisement
Advertisement