టమోటాలు ఇలా కూడా పెంచవచ్చు!

How To Grow Tomato Plants Upside Down  - Sakshi

ఇటీవల కాలంలో స్థలం లేకపోయినా మొక్కల పెంచుకునే సరికొత్త పద్ధతులు వస్తున్నాయి. ఆఖరికి ఫ్లాట్‌లోని బాల్కనీలో కూడా సులభంగా పెంచుకునే పద్ధతులను కూడా చూశాం. చిన్ని చిన్ని కుండీల్లోనే జామ, దానిమ్మ వంటి పళ్లు కాసే మొక్కలను పెంచి చూపించారు. ఇదంత ఒక ఎత్తైతే ఇప్పుడు ఏకంగా మొక్కలను తలకిందులుగా పెంచే సరికొత్త పద్ధతి మన ముందుకు వచ్చింది. పైగా దీని వల్ల ఎన్నో చీడ పీడలను కూడా నివారించొచ్చు, మంచి దిగుబడి కూడా వస్తుందంటున్నారు. అందులోనూ టమోటా మొక్కలను ఇలా పెంచితే స్థలం ఆదా అవ్వడమే గాక ఎక్కువ టమోటాలు పండించొచ్చు అంటున్నారు అగ్రికల్చర్‌ నిపుణులు. ఇంతకీ ఇదెలా సాధ్యం? ఎలా పెంచుతారంటే..

టమోటాలను తలకిందులుగా పెంచే పద్ధతిని ఎంచుకొనేటప్పుడూ అన్ని రకాల టమోటాలకు ఈ పద్ధతి మంచిది కాదనే విషయాన్ని గుర్తించుకోవాలి. ముఖ్యంగా చెర్రీ టమోటా వంటి కొన్ని రకాల టమాటాలకు మాత్రమే ఈ పద్ధతి సరైనది. ముందుగా వేలాడే మొక్కల కంటైనర్లను తీసుకోవాలి. ముఖ్యంగా చక్కగా వేలాదీయగల బకెట్‌ లేదా కుండిని తీసుకోవాలి దాని అడుగు భాగన రంధ్రం ఉండేలా చూసుకోండి. ఒకవేళ్ల రంధ్రం లేకపోతే మనం ఏర్పాటు చేసుకోవాలి. దీనికి మంచి ఎరువుతో కూడిన మట్టిని కుండీలో నింపి దానిలో టమోటా వితనాలు వేసి ఉంచాలి. ఆ విత్తనాలు మొలకెత్తిన వెంటనే..ఆ కుండీ పైభాగం కవర్‌ అయ్యేలా కవర్‌ లేదా ఏదైనా మూత వంటి వాటిని ఏర్పాటు చేసి తలకిందులుగా వేలాడదీసి ఆ రంధ్రంలో ఈ మొలకెత్తిన మొక్కను చొప్పించాలి. దీన్ని సూర్యరశ్మీ తగిలే చోట వేలాదీయండి.

ఆ తర్వాత మొక్కగా మొలికెత్తిన ఈ టమోటా మొక్కను చక్కగా పెరిగేలా తీగల వంటి సపోర్టు ఏర్పాటు చేసుకుని సమయానికి నీరు అందించాలి. చక్కగా గాలికి ఎక్స్‌పోజ్‌అయ్యి మంచిగా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే పరాగ సంపర్కం సులభతరమవుతుంది. ఇక ఈ పద్ధతిలో మొక్క మట్టికి బయటకు బహిర్గతం కావడం వల్ల నేల ద్వారా వచ్చే తెగుళ్లు, ఫంగస్‌, కట్‌వార్మ్‌ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం తక్కువుగా ఉంటుంది.

తలక్రిందులుగా వేలాడదీయడం వల్ల మొక్కలు ఎలాపడితే అలా వ్యాపించవు కాబట్టి చక్కగా నచ్చిన రీతీలో కట్‌ చేసుకుని ఆకర్షణీయంగా పెంచుకునే సౌలభ్యం ఉంటుంది. అంతేగాక వీటిని ఎండ తగిలే చోటికి తరలించుకుపోవడం సులభం, పైగా ఎక్కువ టమాటాలు కాస్తాయి కూడా. ముఖ్యంగా ఈ పద్ధతిలో పెంచాలనుకుంటే ఎంచుకునే బకెట్‌ లేదా కుండీ తోపాటు అందులో వేసే మట్టి, మనం వేసే మొక్కకు కాసే పళ్లని తట్టుకునే సామర్థ్యం తదితరాలు ఉన్నవాటినే ఎంచుకోవడం అత్యంత కీలకం. స్థలం సమస్యతో ఇబ్బంది పడే వాళ్లకు, ఇంటి పంటలంటే ఇష్టపడే వారికి ఈ విధానం చాలా బాగా ఉపయోగపడుతుంది. సులభంగా బాల్కనీల్లోనూ కిటికీల్లోనూ తలకిందులుగా టమాట మొక్కలను పెంచడమే గాక సమృద్ధిగా టమోటాలను పెంచగలుగుతారు కూడా.  

(చదవండి: ఇది గ్రీన్‌ పాలిటిక్స్‌ యుగం! రాజకీయ పార్టీలే గ్రీన్‌ పార్టీలుగా..!)

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top