డైట్‌లో ఈ ఆహార పదార్థాలు చేర్చి..హైబైపీకి బ్రేక్‌ వేయండి | Sakshi
Sakshi News home page

డైట్‌లో ఈ ఆహార పదార్థాలు చేర్చి..హైబైపీకి బ్రేక్‌ వేయండి

Published Sun, May 19 2024 6:00 PM

High Blood Pressure: Add These Foods To Your Diet

మారుతున్న జీవనశైలి కారణంగా చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందర్నీ వేధించే వ్యాధి హైబీపీ. ముఖ్యంగా నిద్రలేమి ఒత్తిడి ఈ హైబీపీ బారిన పడేస్తున్నాయి. బీపీని స‌కాలంలో గుర్తించి నియంత్ర‌ణ‌లో ఉంచుకోకుంటే అది స్ట్రోక్‌, గుండెపోటు, గుండె వైఫ‌ల్యం, కిడ్నీ వైఫ‌ల్యం స‌హా ఇత‌ర అనారోగ్య‌ స‌మ‌స్య‌ల‌కు దారితీస్తుంద‌ని హెచ్చరిస్తున్నారు వైద్యులు. అలాంటి బీపీని నేచురల్‌ ప్రోబయాటిక్‌ ఆహారంతో చెక్‌  పెట్టొచ్చని చెబుతున్నారు అవేంటో చూద్దామా..!

జీర్ణవ్యవస్థకు మేలు చేసే మంచి బ్యాక్టీరియా ఉన్నందుకే పెరుగును నేచురల్‌ప్రోబయాటిక్‌ ఆహారం అంటారు. అరటిలో పొటాషియమ్‌ లవణాలుంటాయి. ఇటు అరటి, అటు పెరుగు... ఈ రెండూ రక్తపోట (హైబీపీ)ని సమర్థంగా అదుపు చేస్తాయని ఆస్ట్రేలియాలో నిర్వహించిన పరిశోధనల్లో తేలడం మాత్రమే కాదు... ఆ సంగతి ‘హైపర్‌టెన్షన్‌’ అనే హెల్త్‌జర్నల్‌లోనూ ప్రచురితమైంది.

 హైబీపీ రాకముందే నివారించాలంటే... అందుకు అరటి, పెరుగు, తియ్యటి మజ్జిగ బాగా ఉపయోగపడతాయి. వాటితోపాటు ఇంకా పూర్తిగా పులవకుండా... అందుకు సంసిద్ధంగా ఉన్న అట్ల పిండితో వేసే అట్లు, ఇడ్లీ వంటివి తీసుకుంటే కూడా హైబీపీ నేచురల్‌గానే నివారించవచ్చని వైద్య పరిశోధకులు, న్యూట్రిషన్‌ నిపుణులు పేర్కొంటున్నారు. 

(చదవండి: మంచు హోటల్‌లో మంచి విందు! కేవలం శీతాకాలంలోనే ఎంట్రీ..!)

Advertisement
 
Advertisement
 
Advertisement