గింజ కొంచెం..పోషకాలు ఘనం..! | Health Tips: Cashew Nuts: Nutrition, Benefits, Uses, Side Effects | Sakshi
Sakshi News home page

గింజ కొంచెం..పోషకాలు ఘనం..!

Oct 25 2026 10:22 AM | Updated on Oct 25 2026 11:24 AM

Health Tips: Cashew Nuts: Nutrition, Benefits, Uses, Side Effects

జీడిపప్పు కొద్దిగా తీసుకున్నా చాలు, పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. జీడిపప్పు ఉత్పాదనలో మన దేశం ఇప్పుడు రెండో స్థానంలో ఉంది. నిజానికి ఇది మన స్థానిక పంట కాదు. పదహారో శతాబ్దిలో పోర్చుగీసు నావికుల ద్వారా వచ్చిన అనేక వృక్షజాతుల్లో జీడిమామిడి కూడా ఒకటి.

పోర్చుగీసు నావికులు బ్రెజిల్‌ తీరం నుంచి గోవా తీరానికి జీడిమామిడి మొక్కలను తీసుకువచ్చి, ఇక్కడ ఈ పంటను అభివృద్ధి చేశారు. అనతి కాలంలోనే ఇది మన దేశంలోని తీరప్రాంతాలలో అన్నిచోట్లా విస్తరించింది. జీడిపప్పు ఎగుమతుల ద్వారా మన దేశానికి విదేశీ ఆదాయం కూడా గణనీయంగా లభిస్తోంది.

జీడిపప్పు విశేషాలను గణాంకాలలో తెలుసుకుందాం...జీడిపప్పులో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వులు అధికంగా ఉంటాయి. వీటితో పాటు విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వందగ్రాముల జీడిపప్పు 553 కిలోకేలరీల శక్తినిస్తుంది. జీడిపప్పులోని పోషకాలను గణాంకాల్లో చూద్దాం.

ఇదీ చదవండి: ఆ కేఫ్‌ ఒక కప్పు కాఫీకి మించి..! ప్రతి టేబుల్‌ వెనుక ఒక లైఫ్‌ స్టోరీ..

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement