breaking news
statitics
-
గింజ కొంచెం..పోషకాలు ఘనం..!
జీడిపప్పు కొద్దిగా తీసుకున్నా చాలు, పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. జీడిపప్పు ఉత్పాదనలో మన దేశం ఇప్పుడు రెండో స్థానంలో ఉంది. నిజానికి ఇది మన స్థానిక పంట కాదు. పదహారో శతాబ్దిలో పోర్చుగీసు నావికుల ద్వారా వచ్చిన అనేక వృక్షజాతుల్లో జీడిమామిడి కూడా ఒకటి.పోర్చుగీసు నావికులు బ్రెజిల్ తీరం నుంచి గోవా తీరానికి జీడిమామిడి మొక్కలను తీసుకువచ్చి, ఇక్కడ ఈ పంటను అభివృద్ధి చేశారు. అనతి కాలంలోనే ఇది మన దేశంలోని తీరప్రాంతాలలో అన్నిచోట్లా విస్తరించింది. జీడిపప్పు ఎగుమతుల ద్వారా మన దేశానికి విదేశీ ఆదాయం కూడా గణనీయంగా లభిస్తోంది.జీడిపప్పు విశేషాలను గణాంకాలలో తెలుసుకుందాం...జీడిపప్పులో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వులు అధికంగా ఉంటాయి. వీటితో పాటు విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వందగ్రాముల జీడిపప్పు 553 కిలోకేలరీల శక్తినిస్తుంది. జీడిపప్పులోని పోషకాలను గణాంకాల్లో చూద్దాం.ఇదీ చదవండి: ఆ కేఫ్ ఒక కప్పు కాఫీకి మించి..! ప్రతి టేబుల్ వెనుక ఒక లైఫ్ స్టోరీ.. -
కేరళలో అత్యాచారాల గురించి తెలిస్తే అవాక్కే..
తిరువనంతపురం: తాజాగా విడుదలైన గణాంకాల్లో కేరళలో జరుగుతున్న నేరాల తీవ్రతను తెలియజేస్తున్నాయి. ఒక్క 2016లోనే ఆ రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై దాదాపు 16,960 నేరాలు చోటు చేసుకున్నాయి. వీటిల్లో అత్యాచారాలను విడిగా పేర్కొంటూ దాదాపు 2,568. ఒక్క ఏడాదిలోనే ఇన్ని సంఘటనలు చోటుచేసుకోవడంపై అక్కడి అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సినీ నటిపై లైంగిక వేధింపులు చోటు చేసుకోవడంతో కేరళలో ఇప్పటి వరకు గత ఏడాదిలో అసలు ఎన్ని నేరాలు చోటు చేసుకున్నాయనే జాబితా తీయగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2016లో చోటు చేసుకున్న ఒక్క లైంగిక దాడుల గణాంకాలు పరిశీలిస్తే మహిళలపై 1,644 ఘటనలు జరగగా చిన్నారులపై 924 ఘటనలు జరిగాయి. ఇవి 2015లో మహిళలపై 1,263, పిల్లలపై 720 చోటు చేసుకున్నాయి. సాధారణంగా ఏ ఏడాదికాయేడు ఇలాంటివి తగ్గుముఖం పట్టాల్సి ఉండగా మరింత పెరుగుతుండటంపై అధికారులు విస్తుపోతున్నారు.


