నడుము, కాళ్లు, వెన్నెముకకు శక్తినిచ్చే త్రికోణాసనం! | Health Benefits Of The Triangular Shaped Asanam | Sakshi
Sakshi News home page

నడుము, కాళ్లు, వెన్నెముకకు శక్తినిచ్చే త్రికోణాసనం!

Jun 20 2026 9:52 AM | Updated on Jun 20 2026 9:52 AM

Health Benefits Of The Triangular Shaped Asanam

యోగా

త్రికోణాసనం

త్రికోణాసనం అర్థం... ‘త్రి‘ అంటే మూడు, ‘కోణం‘ అంటే కోణం. శరీరం త్రిభుజాకారంలో ఉండే ఆసనాన్ని త్రికోణాసనం అంటారు. చేసే విధానం... నిటారుగా నిలబడి కాళ్లను 3–4 అడుగుల దూరంలో ఉంచాలి. చేతులను భుజాల స్థాయిలో పక్కలకు చాచాలి. కుడి పాదాన్ని కుడివైపుకు తిప్పాలి.

శ్వాస వదులుతూ కుడివైపుకు వంగి, కుడి చేతిని కుడి పాదం దగ్గర ఉంచాలి. ఎడమ చేతిని పైకి చాచి, చూపును ఎడమ చేతి వేళ్లపై నిలపాలి. 10–30 సెకన్లు ఈ స్థితిలో ఉండాలి. శ్వాస తీసుకుంటూ మళ్లీ మొదటి స్థితికి రావాలి. ఇదే విధంగా ఎడమ వైపు చేయాలి.

ప్రయోజనాలు... శరీర కండరాలను బలోపేతం చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. సమతుల్యత, ఏకాగ్రతను పెంచుతుంది. కాళ్లు, తొడలు, నడుము భాగాలను దృఢంగా చేస్తుంది. శరీరంలోని అదనపు కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. ఛాతీ విస్తరించి శ్వాసక్రియ మెరుగు
పడుతుంది.

జాగ్రత్తలు... తీవ్రమైన వెన్నునొప్పి లేదా మెడ నొప్పి ఉన్నవారు జాగ్రత్తగా చేయాలి. తల తిరగడం లేదా అధిక రక్తపోటు ఉన్నవారు నిపుణుల పర్యవేక్షణలో చేయాలి. ఆసనాన్ని బలవంతంగా చేయకూడదు. – అనిత పాతర్ల, యోగా ట్రైనర్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement