ఈ సంగతి విన్నారా! ఒకే కాన‍్పులో.. 'నైన్‌ ఆల్‌ ఫైన్‌'..!! | Halima Cisse Morocco Woman 9 Babies Delivered Single Birth | Sakshi
Sakshi News home page

ఈ సంగతి విన్నారా! ఒకే కాన‍్పులో.. 'నైన్‌ ఆల్‌ ఫైన్‌'..!!

Apr 7 2024 1:36 PM | Updated on Apr 7 2024 1:36 PM

Halima Cisse Morocco Woman 9 Babies Delivered Single Birth - Sakshi

సాధారణంగా మనం ఎన్నో వింటుంటాం, చూసుంటాం. వింతలైనా, విశేషాలైనా, మరేవైనా కావచ్చు. అలాగే ఇక్కడ కూడా అవాకయ్యేలాగా ఓ అద్భుతం జరిగింది. ఇంతకీ అది అద్భుతమేనా? ముమ్మాటికీ అవుననే చెప్పవచ్చు. అదే.. ఈ 'ఒకే కాన్పులో తొమ్మిది మంది పుట్టడం.. అదీ బతికి బట్టకట్టడం' ఎప్పుడైనా చూశారా? మరెందుకు ఆలస్యం.. ఇప్పుడే చూసేయండి.

చూశారుగా.. అందరూ ఎంత చలాకీగా ఉన్నారో..! ఒకే కాన్పులో పుట్టి జీవించి ఉన్న తొలి 9 మంది కవలలు (నోనుట్లెట్స్) వీరు!! మొత్తం ఐదుగురు అక్కాచెల్లెళ్లు, నలుగురు అన్నదమ్ములు! దీనికి సంబంధించి గిన్నిస్ రికార్డు కూడా సాధించారు. ఈ నవ సోదరసోదరీమణులకు ఓ ఆరేళ్ల అక్క కూడా ఉందండోయ్! అంటే సంతానం టోటల్ టెన్ అన్నమాట.

మాలి దేశానికి చెందిన హలీమా సిస్చే, అబ్జెల్కాదెర్ ఆర్బీ అనే దంపతులకు 2021 మే 4న ఈ తొమ్మిది మంది మొరాకోలో జన్మించారు. అత్యంత అరుదైన కేసు కావడంతో డెలివరీ నిమిత్తం హలీమాను మాలి ప్రభుత్వం ప్రత్యేక వైద్య సదుపాయాలున్న మొరాకోలోని ఓ ఆస్పత్రికి పంపింది. కొన్ని ఆరోగ్యపరమైన సమస్యల వల్ల తల్లికి ముందుగానే.. 30 వారాల గర్భం సమయంలోనే వైద్యులు సిజేరియన్ చేశారు.

ఫ్రీ డెలివరీ కావడంతో ఒక్కొక్కరి బరువు కేవలం అరకిలో నుంచి కిలో మధ్య ఉంది. దీంతో పిల్లలు 10 నెలలపాటు ఇంక్యుబేటర్లు, ప్రత్యేక వసతులున్న కేంద్రంలో గడపాల్సి వచ్చింది. మరో రెండు నెలల్లో మూడో పుట్టినరోజు జరుపుకోనున్న వీరంతా ఇప్పుడు తమ ఇంటి గడపదాటి.. గిన్నిస్ చానల్ కార్యక్రమంలో సందడి చేసేందుకు తొలిసారి ఇటలీ పర్యటనకు వచ్చారు. ఈ నేపథ్యంలో వీరి ఫొటోలను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నిర్వాహకులు విడుదల చేశారు.

ఇవి చదవండి: ఆయుష్షులో సెంచరీ కొట్టి.. గిన్నిస్‌ రికార్డు కెక్కిన వృద్ధుడు!

Advertisement
 
Advertisement
Advertisement