ఈ ఇమేజ్ చూస్తే కేవలం కప్ప మాత్రమే కనిపిస్తోంది కదూ. కానీ సరిగా చూస్తే ఇంకొకటి కూడా కనిపిస్తుంది. ఇది కేవలం మీ ఐక్యూకి మాత్రమే కాదు పరీక్ష. మీరు ఏవిధంగా ఆలోచించగలరు అనేదాన్ని కూడా తెలియజేస్తుంది. ఇలాంటి ఫజిల్స్ మనకు ఎదరయ్యే సమస్యలను ఎలా కూడా చూడాలో తెలుపుతుంది. ఈజీగా ఎలా బయటపడాలో మెదడుకు ఓ ఎక్స్‌ర్‌సైజ్‌లా కూడా ఉంటుంది. అసలు దీనికి మన జీవితంలో ఎదుర్కొనే సమస్యలకు ఎలాంటి సంబంధం ఉండదు అనకండి.
కొన్ని సమస్యలు మనకు ఓ పట్టాన పరిష్కారం కావు. ఏదో ఒక యాంగిల్ ఆలోచించి ఏ స్టెప్ తీసుకోలేక ఒకింత గందరగోళానకి గురవ్వుతాం. అదే ఒక సమస్యను రెండు లేదా మూడు రకాలుగా ఆలోచించగలిగితే సమస్య సులభంగా పరిష్కారమవుతుంది. ఇక అదంతా సరే! ముందు ఈ ఫోటోలో ఇంకొక చిత్రం కూడా ఉంది ట్రై చేయండి. త్వరగా కనిపెట్టండి. ఏ మాత్రం ఆలస్యం చేయకండి. కన్‌ఫ్యూజ్ అవ్వద్దు కాస్త ఓపికగా చూడండి ప్లీజ్. ఇక ఆ బొమ్మలో కనిపిస్తున్న మరో ఆకృతి (రివర్స్‌లో చూస్తే) ఏంటంటే.. ఓ గుర్రం ముఖం కనిపిస్తుంది చూడండి. చూసే కన్నుని బట్టి ఆకృతి మారుతుంది. అలాగే మన సమస్యను చూసే విధానం బట్టి మనలోని భ్రమలను భయాలు కూడా దూరం చేసుకోగలుగుతాం.
(చదవండి: రెండువేల ఏళ్ల క్రితమే ఇంత అద్భుత ఆభరణమా!)


