సాయం కాపాడుతున్న ప్రాణం | Free Crowdfunding for India | Sakshi
Sakshi News home page

సాయం కాపాడుతున్న ప్రాణం

Jul 18 2024 9:22 AM | Updated on Jul 18 2024 9:22 AM

 Free Crowdfunding for India

క్రౌడ్‌ ఫండింగ్‌పెద్ద జబ్బుతో ఆసుపత్రి పాలైన నిరుపేదల దగ్గర లక్షల్లో ఖర్చుచేసేటంత డబ్బు ఉండదు. ప్రాణాలు నిలబడాలంటే ఏం చేయాలి మరి? ఇందుకు సమాధానమే క్రౌడ్‌ ఫండింగ్‌. ఆరోగ్యం, విద్య, జంతువుల సంక్షేమం, ప్రకృతి వైపరీత్యాలు, మహిళా సాధికారత కోసం విరాళాలను క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా సమకూర్చుతున్నాయి కొన్ని ఆన్‌లైన్‌ వేదికలు.

కర్నూలు జిల్లాకు చెందిన తొమ్మిదేళ్ల సానియా వెంట్రిక్యులర్‌ సెస్టల్‌ డిఫెక్ట్‌ వ్యాధితో బాధపడుతోంది. ఈ  వ్యాధి చికిత్సకు రూ.12 లక్షలు కావాలి. తండ్రి రాళ్లు కొట్టే పని చేస్తుంటాడు. తల్లి గృహిణి. కుమార్తెకు చికిత్స చేయించే స్తోమత లేకపోవడంతో వీరికి ‘ప్యూర్‌ లిటిల్‌ హార్ట్స్‌ ఫౌండేషన్‌’ అండగా నిలిచింది. ఈ ఫౌండేషన్‌ విభిన్న వేదికల్లో క్రౌడ్‌ ఫండింగ్‌ చేపట్టింది. రూ.12 లక్షలు క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా జమ అయ్యి, చిన్నారికి చికిత్స జరిగింది. ప్రాణాలు నిలబడ్డాయి.  

రహ్మద్‌ బాషా విజయవాడలో పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. ఇటీవల అతనికి నెలల నిండకుండానే 704 గ్రాముల బరువుతో కూతురు పుట్టింది. ఒక ప్రైవేట్‌ హాస్పిటల్‌లో ఐసీయు లో చికిత్స పోందుతోంది. పాప చికిత్సకు రూ.14 లక్షలు అవసరం. దయచేసి, సహాయం చేసి, మా పాపను బతికించండి’ అని క్రౌడ్‌ఫండింగ్‌ నిధుల సమీకరణ లింక్‌లో విన్నవించుకున్నాడు. చికిత్సకు అవసరమయ్యే డబ్బు వారికి అందుతోంది.  
 
కేరళలోని ఎర్నాకుళానికి చెందిన సారంగ్‌ మీనన్, అదితి నాయర్‌ల ఏడాదిన్నర కుమారుడు నిర్వాణ్‌  వెన్నెముక కండరాల క్షీణత అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ చికిత్సకు దాదాపు రూ.17.5 కోట్లు ఖర్చవుతుందని వైద్యులు చె΄్పారు. ఈ వ్యాధి నివారణకు ఉపయోగించే వన్‌టైమ్‌ డ్రగ్‌ జోల్జెన్మ్సా ఇండియాలో అందుబాటులో లేదు. దీనిని అమెరికా నుంచి తెప్పించాలి. ఇదే విషయాన్ని సోషల్‌ మీడియా ΄్లాట్‌ఫామ్‌ ద్వారా తెలియజేయడంతో క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా 72 వేల మంది విరాళాలు అందించారు. 
 
ఎంత పెద్ద ఆరోగ్య సమస్య వచ్చినా, మా వల్ల ఏమవుతుంది... అంటూ కుదేలవ్వాల్సిన పని లేదని చెప్పే ఇలాంటి కథనాలు ఎంతో ధైర్యాన్నిస్తున్నాయి. ఆరోగ్యపరంగా ఎంత అవసరం వచ్చినా, దాతల నుంచి విరాళాలు తెచ్చి పెట్టేందుకు నేడు ఎన్నో వేదికలు పనిచేస్తున్నాయి. వేలాది మంది బాధితుల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నాయి. అదే సమయంలో ఇలాంటి బాధితులకు సాయం చేశామనే సంతృప్తి దాతలకు లభిస్తోంది. కాకపోతే విరాళం ఇచ్చే ముందు విచారించి, నిజమైనదేనని నిర్ధారించుకోవడం ద్వారా తమ దానం నిష్ఫలం కాకుండా చూసుకోవచ్చు. మెడికల్‌ క్రౌడ్‌ ఫండింగ్‌ ΄్లాట్‌ఫామ్‌లు ఎలా పనిచేస్తాయో తెలుసుకుంటే.. సాయం పోందచ్చు. తోచినంత సాయమూ చేయచ్చు.

నిధుల సేకరణ ఇలా..!
దాతల సాయం అవసరమైన ఆన్‌లైన్‌ క్రౌడ్‌ ఫండింగ్‌ ΄్లాట్‌ఫామ్‌లను (ఇంపాక్ట్‌ గురూ, మిలాప్, కెట్టో, గో ఫండ్‌ మి, కిక్‌స్టార్టర్‌... మొదలైనవి) సంప్రదించవచ్చు ∙΄ాన్, ఆధార్, మెడికల్‌ డాక్యుమెంట్లు సమర్పించాలి. ఎంక్వైరీ అనంతరం వారి తరఫున నిధుల సమీకరణ పేజీని అవి సిద్ధం చేస్తాయి  సాయం అవసరమైన వారు ఈ పేజీ లింక్‌ను తమ నెట్‌వర్క్‌లో షేర్‌ చేసుకోవాలి ∙విరాళంలో కొంత మొత్తాన్ని కమీష్‌న్‌  రూపంలో మినహాయించుకునేందుకు సమ్మతి తెలియజేస్తే, వారి తరఫున క్రౌడ్‌ ఫండింగ్‌ ప్లాట్‌ఫామ్‌లు విస్తృత ప్రచారాన్ని చేపడతాయి ∙విరాళం ఇచ్చేందుకు పేమెంట్‌ లింక్‌లు కనిపిస్తాయి. ఇలా చేసే చెల్లింపులన్నీ పన్ను రాయితీ కల్పిస్తాయి ∙కావాల్సిన మొత్తం వచ్చినా, గడువు ముగిసినా లేదంటే బాధితులు అకాలంగా మరణించినా నిధుల సమీకరణ ఆగిపోతుంది. అనంతరం ఈ మొత్తం నుంచి కమీష్‌న్‌  మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని బాధితులకు క్రౌడ్‌ ఫండింగ్‌  ప్లాట్‌ఫామ్‌లు చెల్లిస్తాయి. ఇలా చేసే ముందు హాస్పిటల్‌ బిల్లులను చెక్‌ చేస్తాయి.

విశ్వసనీయమైన ఎంపిక
క్రౌడ్‌ ఫండింగ్‌లో ప్రతి ప్రయత్నం సవాల్‌తో కూడుకున్నదే. ప్రచారం చేసినప్పటికీ మొత్తం నిధుల సేకరణ లక్ష్యాన్ని చేరుకోలేకపోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో క్రౌడ్‌ఫండింగ్‌ విశ్వసనీయమైన ఆర్థిక ఎంపికగా మారినందున మోసం, దుర్వినియోగం వంటివీ జరగచ్చు. తప్పుదారి పట్టించే లేదా మోసపూరితమైన నిధుల సమీకరణను చూసినట్లయితే, దానిని వెంటనే మా దృష్టికి తీసుకురావాలి. 
– సాయంతి రాయ్, హెడ్‌ కమ్యూనికేషన్స్, మిలాప్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement