నోరూరించే బ్యాగులు..చూడటానికే అమ్మకానికి కాదట!

France: Paris Designer Make Vegetable Bags Goes Viral In Social Media - Sakshi

ఖరీదైన బ్రాండ్‌ ‘హమీజ్‌’ సంస్థ రొటీన్‌కు భిన్నంగా అంటే లెదర్‌తో కాకుండా కూరగాయలతో బ్యాగ్‌లను తయారు చేసింది. ధరా రొటీన్‌కు భిన్నమే. ధరే ప్రకటించకపోవడం. కారణం అమ్మకానికి కాకుండా ఆసక్తికోసం తయారైన బ్యాగ్‌లు కావడం. ప్యారిస్‌కు చెందిన డిజైనర్‌ బెన్‌ డెన్‌జర్‌..  తాజా కీరా, బ్రొకొలీ, క్యాబేజ్, యాపిల్‌తో కొన్ని బ్యాగులను రూపొందించాడు.

వాటిని హమీజ్‌ సంస్థ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘నోరూరించే కళాత్మకమైన హమీజ్‌ బ్యాగ్‌లు’ అంటూ  పోస్ట్‌ చేసింది. దాంతో అవి ఆ బ్రాండ్‌ న్యూడిజైనర్‌ బ్యాగ్స్‌ అనుకొని  కొనుగోలు చేసేందుకు చాలా మంది ప్రయత్నించారు. తర్వాత ఆ బ్యాగులు అమ్మకానికి పెట్టినవి కాదని తెలిసి నిరాశ పడ్డారు. ఈ వ్యవహారమంతా వైరల్‌గా మారింది. ఊహించని ఆ స్పందనను గుర్తించి త్వరలోనే ఈ డిజైనర్‌ బ్యాగ్‌లను అందిస్తామని  హమీజ్‌ సంస్థ ప్రకటించడం కొసమెరుపు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top