చిరకాల ప్రియుడ్ని పెళ్లాడిన ‘కర్లీ గర్ల్‌’, యువరాణిలా..ఫోటోలు వైరల్‌ | Fashion Influencer Rupali Curl Girl Gets Married ​his boy friend | Sakshi
Sakshi News home page

చిరకాల ప్రియుడ్ని పెళ్లాడిన ‘కర్లీ గర్ల్‌’, యువరాణిలా..ఫోటోలు వైరల్‌

Jan 28 2025 11:50 AM | Updated on Jan 28 2025 3:06 PM

Fashion Influencer Rupali Curl Girl Gets Married ​his boy friend

ప్రముఖ ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్ తన చిరకాల  ప్రియుడితో  వివాహ బంధంలోకి అడుగు పెట్టింది.  'కర్ల్ గర్ల్' అనే ఇన్‌స్టా యూజర్‌నేమ్‌తో ప్రసిద్ధి చెందిన రూపాలీ హసీజా,  బాక్సర్‌, హెల్త్‌ కోచ్‌ విజయ్‌కాంబ్లీని పెళ్లాడింది.   ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేసింది.దీంతో కొత్త జంటకు అభినందనల వెల్లువ కురుస్తోంది.

పెళ్లికూతురు ముస్తాబులో రూపాలీ యువరాణిలా  మెరిసిపోయింది.  తెలుపు , గోధుమ రంగు మేళవించిన పువ్వులు, న్యూడ్-టోన్డ్ షీర్‌  చీరను ధరించింది. దానికి సరిపోయే దుపట్టాతో స్టైల్ చేసింది.  రూపాలీ లుక్‌లో మరో హైలైట్ ఆమె ఆభరణాల ఎంపిక. వివాహ వేడుకను దృష్టిలో ఉంచుకుని, డైమండ్ నెక్‌పీస్, మ్యాచింగ్ కుందన్ మాంగ్ టీకా,మ్యాచింగ్ స్టడ్ చెవిపోగులు  భలే అందంగా అమరాయి.  

చదవండి: పదేళ్ల తరువాత తొలిసారి : తన బాడీ చూసి మురిసిపోతున్న పాప్‌ సింగర్‌


మరోవైపు, రూపాలి భర్త  విజయ్‌ కాంబ్లీ ఆలివ్ రంగు కుర్తా-పైజామా  ధరించాడు. అలాగే దానికి మ్యాచింగ్‌ తలపాతో  పెళ్లి కొడుకు ముస్తాబులో రాజాలా ఉన్నాడు.  తిలకం దిద్దడం, ముద్దు పెట్టుకోవడం  లాంటి అందమైన ఫోటోను స్పెషల్‌  ఎట్రాక్షన్‌గా  ఉన్నాయి.  ఆచారాన్నిజనవరి 24న పెళ్లకున్నట్టు తెలిపింది.  10.1 లక్షలకుపైగా ఫాలోయర్లున్న  రూపాలి తన  స్పెషల్‌ డేగురించి ఇలా పోస్ట్‌ చేసింది.  నేను నీ రాణిని, నువ్వు నా రాజావి."మై రాణి హన్ తేరే, తు రాజా మేరా వే మై హీర్ తేరే సజ్నా, తు రంఝా మేరా వే)  అంటూ పేర్కొంది. (అందం, ఆరోగ్యమే కాదు, బరువు తగ్గడంలో కూడా ‘గేమ్‌ ఛేంజర్‌’ ఇది!)
 


ఫ్యాషన్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌గా  పాపులర​ అయిన రూపాలీ ఎట్టకేలకు తన చిరకాల ప్రియుడిని వివాహం చేసుకుంది, అతనితో  మూడు సంవత్సరాలుగా డేటింగ్ చేస్తోంది. గత ఏడాది డిసెంబర్‌లో ప్రపోజల్ ఫోటోలను షేర్ చేసింది. బీచ్‌లో అందమైన తమ డ్రీమ్‌ ప్రపోజల్‌ ఫోటోలను తమ బంధాన్ని అభిమానులకు తెలిపిన సంగతి తెలిసిందే.

గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement
 
Advertisement
Advertisement