అదరగొట్టిన ముంబై ట్విన్‌ సిస్టర్స్‌: శృతి, సంస్కృతి | Family of Ca Mumbai twins break into all India top 10 in CA exam | Sakshi
Sakshi News home page

అదరగొట్టిన ముంబై ట్విన్‌ సిస్టర్స్‌: శృతి, సంస్కృతి

Jan 12 2024 1:56 PM | Updated on Jan 12 2024 2:32 PM

Family of Ca Mumbai twins break into all India top 10 in CA exam - Sakshi

చార్టర్డ్‌ ఎకౌంటెంట్స్‌ (సీఏ) ఫైనల్‌ ఎగ్జామినేషన్‌లో ఇరవై రెండు సంవత్సరాల ముంబై ట్విన్స్‌ సంస్కృతి, శ్రుతి ఆల్‌–ఇండియా టాప్‌ టెన్‌ ర్యాంకుల జాబితాలో చోటు సాధించారు. సంస్కృతి రెండో ర్యాంక్, శ్రుతి ఎనిమిదో ర్యాంకు సాధించింది. పరీక్షలు వస్తున్నాయంటే సాధారణంగా చాలామందిలో ఉండే భయం ఈ ట్విన్‌ సిస్టర్స్‌లో ఉండేది కాదు.

పరీక్షలంటే వారికి పండగతో సమానం. ఆ ఇష్టమే వారిని ఎప్పుడూ విజేతలుగా నలుగురిలో గుర్తింపు తెస్తోంది. ఇద్దరికీ కొరియన్‌ సినిమాలు చూడడం, బ్యాడ్మింటన్‌ ఆడడం అంటే ఇష్టం. ఈ ట్విన్‌ స్టిసర్స్‌ కుటుంబాన్ని ‘ఫ్యామిలీ ఆఫ్‌ సీఏ’ అని పిలుస్తున్నారు. ఎందుకంటే నాన్న, అన్నయ్య, వదిన కూడా సీఏ చేశారు. ‘పరీక్షల కోసం నేను శ్రుతి కలిసి చదువుకున్నాం. ఏ డౌట్‌ వచ్చినా నాన్న, అన్నయ్య అందుబాటులో ఉండేవాళ్లు. కఠినమైన ΄ పోటీ పరీక్షలు ఎదుర్కోవడానికి ఈ రకమైన సపోర్టింగ్‌ సిస్టమ్‌ అవసరం’ అంటుంది సంస్కృతి.

జైపూర్‌కు చెందిన మధుర్ జైన్ ఆల్ ఇండియా టాపర్‌గా నిలిచాడు. మూడో ర్యాంక్‌ను జైపూర్‌కు చెందిన తికేంద్ర కుమార్ సింఘాల్ , రిషి మల్హోత్రా మళ్లీ పంచుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement