నీలిరంగులో కనిపించే పండ్లు, కూరగాయలు ఇవే..! | Delicious Blue Fruits And Vegetables with Powerful Health Benefits | Sakshi
Sakshi News home page

నీలిరంగులో కనిపించే పండ్లు, కూరగాయలు ఇవే..!

Jul 20 2025 3:11 PM | Updated on Jul 20 2025 4:25 PM

 Delicious Blue Fruits And Vegetables with Powerful Health Benefits

కొన్ని పండ్లు, కూరగాయలు సర్వసాధారణంగా ఒక నిర్దిష్టమైన రంగులో ఉంటాయి. అవి భిన్నమైన రంగులో కనిపిస్తే, అదొక విచిత్రంగా ఉంటుంది. అలవాటైన రంగుల్లో కాకుండా, నీలిరంగులో కనిపించే కొన్ని రకాల పండ్లు, కూరగాయల సంగతి తెలుసుకుందాం...

టొమాటోలు పండిన తర్వాత ఎర్రని ఎరుపురంగులో ఉంటాయి. పచ్చిగా ఉన్నప్పుడు లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. అరుదుగా కొన్ని జాతుల టొమాటోలు ముదురు నీలి రంగులోను, ముదురు ఊదా రంగులోను ఉంటాయి. వీటిని ‘బ్లూ టొమాటో’ అని, ‘పర్పుల్‌ టొమాటో’ అని అంటారు. ఇవి ప్రకృతి సిద్ధంగా పండినవి కాదు. 

ఇంగ్లండ్‌లోని జాన్‌ ఇనెస్‌ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్తలు జన్యు మార్పిడి ద్వారా ఈ నీలి టొమాటో జాతులను సృష్టించారు. నేరేడు జాతికి చెందిన పండ్ల రంగుకు కారణమైన పిగ్మెంట్‌తో ముదురు నీలి, ముదురు ఊదా రంగులు వచ్చేలా టొమాటోలను రూపొందించారు. వీటిని ఇప్పుడు పలు యూరోపియన్‌ దేశాల్లో పండిస్తున్నారు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని, ఈ జాతుల టొమాటో మొక్కలు చీడ పీడలను తట్టుకుని పుష్కలంగా దిగుబడిని ఇవ్వగలవని చెబుతున్నారు.

బ్లూ క్యారట్స్‌
మొక్కజొన్న దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా దొరుకుతుంది. సాధారణంగా మొక్కజొన్న గింజలు పసుపు రంగులో ఉంటాయి. అక్కడక్కడా లేత పసుపు, తెలుపు రంగు గింజలతో కూడా ఉంటాయి. అరుదుగా నీలి రంగు గింజలు ఉండే మొక్కజొన్నలు మెక్సికోలో పండుతాయి. 

మామూలు మొక్కజొన్న మాదిరిగానే నీలి మొక్కజొన్నను కూడా రకరకాల వంటకాల్లో ఉపయోగిస్తారు. సాధారణ మొక్కజొన్నల కంటే నీలి మొక్కజొన్నలో యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయని చెబుతారు.

నీలి ముల్లంగి
మన దేశంలో ఎక్కువగా ముల్లంగి తెలుపు రంగులోనే దొరుకుతుంది. కొన్ని దేశాల్లో ఎరుపు, పసుపు, గులాబి వంటి రంగుల్లో కూడా దొరుకుతుంది. అరుదుగా కొన్ని చోట్ల ముదురు నీలి, ముదురు ఊదా రంగుల్లో కూడా ముల్లంగి దొరుకుతుంది. 

నీలి, ఊదా రంగుల్లో ఉన్న ముల్లంగిని కోస్తే, లోపలి భాగంలో నీలి, ఊదా రంగులతో పాటు కొంత తెలుపుదనం కూడా ఉంటుంది. రుచికి ఈ రకం ముల్లంగి కొంచెం తీపిగా, కొంచెం ఘాటుగా ఉంటుంది. వీటిని పచ్చిగా తినడంతో పాటు సలాడ్లు, ఇతర వంటకాల తయారీలో కూడా ఉపయోగిస్తారు.

చిలకడ దుంపలు సాధారణంగా కాస్త ఎరుపురంగు తొక్కతోను, లేత గోధుమ రంగు తొక్కతోను ఉంటాయి. తొక్క రంగు ఎలా ఉన్నా, లోపలి భాగం తెలుపుగా లేదా లేత నారింజరంగులోను ఉంటుంది. ముదురు రంగు తొక్క కలిగి, లోపలి భాగం కూడా ముదురు ఊదా రంగు లేదా ముదురు నీలి రంగులో ఉండే ‘బ్లూ స్వీట్‌ పొటాటో’ రకాన్ని జపాన్‌లో పండిస్తారు. 

దీనిని ‘ఒకినావన్‌ స్వీట్‌ పొటాటో’ అంటారు. సాధారణ చిలకడ దుంపల కంటే ఈ ‘బ్లూ స్వీట్‌ పొటాటో’ రకానికి చెందిన చిలకడ దుంపల్లో పోషకాలు మరింత అధికంగా ఉంటాయని చెబుతారు.

నీలి అరటిపండ్లు
అరటిపండ్లు ఎక్కువగా పసుపురంగులో ఉంటాయి. కొన్ని ఆకుపచ్చగాను, అరుదుగా ఇంకొన్ని ఎరుపు రంగులోను ఉంటాయి. జావాలో మాత్రం ప్రపంచంలోనే అత్యంత అరుదైన నీలిరంగు అరటిపండ్లు పండుతాయి. దీనిని ‘బ్లూ జావా బనానా’ అని, ‘హవాయిన్‌ బనానా’ అని అంటారు. అరటిచెట్లు శీతల ప్రాంతాల్లో ఎక్కువగా పెరగవు. 

అయితే, ఈ నీలి అరటిపండ్ల జాతికి చెందిన చెట్లు మాత్రం చల్లని వాతావరణాన్ని కూడా తట్టుకుని పెరగగలవు. దీని రుచి వెనీలా ఐస్‌క్రీమ్‌లా ఉంటుంది. అందువల్ల దీనిని  ‘వెనీలా బనానా’ అని, ‘ఐస్‌క్రీమ్‌ బనానా’ అని కూడా అంటారు. ఇప్పుడు వీటిని యూరోపియన్‌ దేశాల్లో కూడా పండిస్తున్నారు.

బ్లూ స్వీట్‌ పొటాటో
చిలకడ దుంపలు సాధారణంగా కాస్త ఎరుపురంగు తొక్కతోను, లేత గోధుమ రంగు తొక్కతోను ఉంటాయి. తొక్క రంగు ఎలా ఉన్నా, లోపలి భాగం తెలుపుగా లేదా లేత నారింజరంగులోను ఉంటుంది. ముదురు రంగు తొక్క కలిగి, లోపలి భాగం కూడా ముదురు ఊదా రంగు లేదా ముదురు నీలి రంగులో ఉండే ‘బ్లూ స్వీట్‌ పొటాటో’ రకాన్ని జపాన్‌లో పండిస్తారు. 

దీనిని ‘ఒకినావన్‌ స్వీట్‌ పొటాటో’ అంటారు. సాధారణ చిలకడ దుంపల కంటే ఈ ‘బ్లూ స్వీట్‌ పొటాటో’ రకానికి చెందిన చిలకడ దుంపల్లో పోషకాలు మరింత అధికంగా ఉంటాయని చెబుతారు.

బ్లూ పొటాటో
బంగాళ దుంపలు పైకి గోధుమరంగులో ఉంటాయి. తొక్క తీశాక తెలుపురంగులో ఉంటాయి. అయితే, ముదురు నీలి రంగులోను, ముదురు ఊదా రంగులోను ఉండే బంగాళ దుంపలు కూడా ఉన్నాయి. తొక్క తీసి, తరిగిన తర్వాత కూడా ఈ దుంపలు ముదురు ఊదా లేదా నీలి రంగుల్లోనే ఉంటాయి. 

‘అడిరోన్‌డాక్‌ బ్లూ’ జాతికి చెందిన బంగాళ దుంపలు ఈ ముదురు ఊదా లేదా నీలి రంగుల్లో ఉంటాయి. అమెరికాలోని కార్నెల్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వీటి నుంచి మరిన్ని నీలిరంగు బంగాళ దుంపల జాతులను కూడా ఇటీవలి కాలంలో అభివృద్ధి చేశారు. 

(చదవండి: పెయిన్‌ కిల్లర్స్‌ వాడితే..ప్రెగ్నెన్సీకి ప్లాన్‌ చేయకూడదా..?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement