బొట్టు.. బొట్టు.. మెట్ట భూముల్లో పచ్చని పంట చిగురించేట్టు!

Cultivation Of Crops With The Help Of Drip, Sprinklers - Sakshi

మారుతున్న కాలానుగుణంగా.. వ్యవసాయ పద్ధతులలో కొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అందుకు నిదర‍్శనంగా.. కొందరు రైతులు మైదానంలాంటి మెట్ట భూముల్లో కూడా పంటలు పండిస్తున్నారు. వర్షాకాలం వర​కు ఎందుకు ఎదురుచూపులంటూ.. వారి వద్దనున్న నూతన టెక్నాలజీతో కూడిన పరికరాలను ఉపయోగించి పచ్చని పంటలు పండిస్తున్నారు. వారిని గురించి తెలుసుకుందాం.

స్ప్రింక్లర్లతో  సాగు చేస్తున్న కొత్తిమీర

వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మాడుగులపల్లి మండలంలోని సాగర్‌ ఆయకట్టేతర ప్రాంత రైతులు బిందు, తుంపర సేద్యంపై దృష్టి సారించారు. డ్రిప్పు, స్ప్రింక్లర్లను ఏర్పాటు చేసుకొని మెట్ట భూముల్లో పచ్చని పంటలు పండిస్తున్నారు. తీగజాతి కూరగాయలు, ఆకుకూరలు, వేరుశనగ తదితర పంటలను సాగు చేస్తున్నారు. మండలవ్యాప్తంగా 3 నుంచి 4 వేల ఎకరాల్లో వేరుశనగ, కొత్తమీర, దోస, ఇతర కూరగాయలు పండిస్తున్నట్లు మండల ఉద్యానశాఖ అధికారి అనంతరెడ్డి తెలిపారు. ప్రభుత్వం బిందు, తుంపర సేద్యం పరికరాలు సబ్సిడీపై అందిస్తే మరింత మంది రైతులు ప్రత్యామ్నాయ పంట సాగు చేసి ఆదాయం గడించే అవకాశం ఉంది.

ఇవి చదవండి: ఈ సీసన్‌లో.. బెండసాగుతో అధిక దిగుబడులు!

whatsapp channel

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top