7 నిమిషాల్లోనే సంపూర్ణ వర్కవుట్‌ | complete workout in just 7 minutes | Sakshi
Sakshi News home page

7 నిమిషాల్లోనే సంపూర్ణ వర్కవుట్‌

Published Tue, Mar 25 2025 11:55 AM | Last Updated on Tue, Mar 25 2025 5:13 PM

complete workout in just 7 minutes

శరవేగంగా శరీరం మొత్తానికీ వ్యాయామం 

కేవలం 7 నిమిషాల్లోనే సంపూర్ణ వర్కవుట్‌  

కండరాలన్నింటికీ కదలికలు, కేలరీల ఖర్చు

అంతర్జాతీయంగానూ పాపులరైన ‘హిట్‌’ వర్కవుట్‌

అమెరికాకు చెందిన వ్యాయామ మనస్తత్వవేత్త క్రిస్‌ జోర్డాన్‌ ఈ హిట్‌ అనే వ్యాయామ కార్యక్రమాన్ని రూపొందించారు. ఇది కదలికలు కురవైన శరీరం తెచ్చిపెట్టే సమస్యలకు.. కేవలం 7 నిమిషాల్లో పరిష్కరించగలదని ఆయన చెబుతున్నారు. సొంత శరీర బరువును ఉపయోగించి సుపరిచితమైన కాలిస్టెనిక్‌ వ్యాయామాలను చేయడమే హై ఇన్‌టెన్సిటీ ఇంటర్వెల్‌ ట్రైనింగ్‌ (హెచ్‌ఐఐటీ) ఈ హిట్‌ ఫార్ములా. ప్రతి రౌండ్‌కూ మధ్య ఐదు సెకన్ల  విశ్రాంతి తీసుకుంటూ చేసే హై ఇన్‌టెన్సిటీ ఇంటర్వెల్‌ ట్రైనింగ్‌ (హెచ్‌ఐఐటీ)గా దీనిని పేర్కొంటున్నారు. ఇందులో ప్రతి వ్యాయామం 30 సెకన్ల పాటు చేయాలి. ఒక భంగిమ నుంచి మరో భంగిమకు మారేటప్పుడు మధ్యన 5 సెకన్ల చొప్పున గ్యాప్‌ ఉండాలి.

వాల్‌ సిటప్స్‌: గోడ దగ్గర వెనుకభాగంలో నిల్చుని కురీ్చలో కూర్చున్నట్లుగా కూర్చునే భంగిమ. ఓ రకంగా గోడకుర్చీ వేయడం అని చెప్పొచ్చు.  

అబ్‌ క్రంచ్‌: ప్రాథమిక క్రంచ్‌తో ప్రారంభించి, వెనుకభాగంలో చదునుగా ఉంచి పడుకోవాలి, మోకాళ్లను వంచి పాదాలను నేలపై ఉంచి చేయాలి.

స్టెప్‌–అప్‌: దృఢమైన కుర్చీ లేదా బెంచ్‌కు ఎదురుగా నిలబడి, ఎడమ కాలితో ఓ సారి కుడికాలితో మరోసారి ప్రారంభించి చేయాలి. 30 సెకన్ల వ్యవధిలో వీలైనన్ని 
సార్లు చేయాలి.

స్క్వాట్‌: పాదాలను భుజం–వెడల్పు వేరుగా చేసి కాలి వేళ్లను ముందుకు ఉంచి నిలబడాలి. ఈ భంగిమలో ఉన్నప్పుడు బరువులో ఎక్కువ భాగాన్ని మడమల మీద ఉంచాలి. 30 సెకన్ల పాటు ఇలా చేయాలి.

ట్రైసెప్‌ డిప్‌: కుర్చీ లేదా బెంచ్‌ ముందు అంచున కూర్చుని, మన అరచేతులను అంచుపై ఉంచి దీనిని చేయాలి.

ప్లాంక్‌: చాపపై బోర్లా పొట్టపై పడుకుని దీన్ని చేయాలి. ఈ భంగిమలో మన మోచేతులు మన వైపు దగ్గరగా, అరచేతులు కిందికి వేళ్లు ముందుకు ఎదురుగా ఉంటాయి.

హై ‘నీస్‌’: 30 సెకన్ల పాటు ఉన్నచోటే పరుగెత్తడంగా దీన్ని చెప్పొచ్చు. ప్రతి అడుగుతో మోకాళ్లను వీలైనంత ఎత్తుకు పైకి తీసుకొస్తూ,  అరచేతులను తాకడానికి మన మోకాళ్లను వేగంగా పైకి కందికి ఎత్తుతూ చేయాలి.

లంజెస్‌: పాదాలను కలిపి నిలబడి, కుడి పాదం మీద ముందుకు సాగదీయాలి. ముందు, వెనుక మోకాలు రెండూ వీలైనంత 90–డిగ్రీల కోణానికి దగ్గరగా వంగి ఉండే వరకూ చేయాలి.

సైడ్‌ ప్లాంక్‌లు: చాపపై కుడి వైపున పడుకుని, ఎడమవైపు పడుకుని చేసే వ్యాయామం.  

పుష్‌–అప్స్‌: నేలపై లేదా చాపపై ‘ప్లాంక్‌’ పొజిషన్‌Œలోకి వెళ్లి చేసే ప్రక్రియ. బరువును పాదాలకు బదులుగా మోకాళ్లపై ఉంచడం ద్వారా  దీన్ని సులభతరం చేయవచ్చు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement