
నిగనిగలాడే పొడవాటి కేశాలతో వచ్చే అందమే వేరు. అయితే ఆధునిక జీవనశైలి, కాలుష్యం కారణంగా జుట్టు నిర్జీవంగా మారి, పలుచబడిపోయి చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఈ సెల్‌రిటర్న్ ఆల్ఫా రే హెయిర్ గాడ్జెట్ కేశ క్లేశాలకు చెక్ పెడుతుంది. ఆరోగ్యకరమైన జుట్టు కోసం ఈ అత్యాధునిక పరికరం చాలా చక్కగా పని చేస్తుంది. ఇది ఎల్‌ఈడీ సాంకేతికతతో పనిచేస్తుంది. తలలోని రక్త ప్రసరణను మెరుగుపరచి, జుట్టు రాలడాన్ని నివారించి, జుట్టు ఒత్తుగా పెరిగేందుకు దోహదపడుతుంది.
ఈ గాడ్జెట్‌లో మొత్తం 720 ఎల్‌ఈడీ లైట్లు ఉంటాయి, వీటిలో ఎరుపుకాంతితో వెలువడే ఆల్ఫా ఈ కాంతి కిరణాలు జుట్టు కుదుళ్లలోకి చొచ్చుకుపోయి, వాటికి ఆక్సిజన్‌ను అందిస్తాయి. ఈ పరికరాన్ని వైర్‌లెస్‌గా వినియోగించుకోవచ్చు. రోజుకు ఇరవై నిమిషాలు ఉపయోగిస్తే మంచి ఫలితాలుంటాయి. ఇది సాఫ్ట్, నార్మల్, పవర్ అనే మూడు వేర్వేరు మోడ్‌లను కలిగి ఉంటుంది. ఈ పరికరంలో ఒకదానికొకటి అనుసంధానమై టాప్, సెంటర్, ఆల్ఫా ప్యాడ్ అనే మూడు భాగాలు ఉంటాయి.
క్లినికల్ అధ్యయనాల ప్రకాశం ఈ సెల్‌రిటర్న్ ఆల్ఫా రే హెయిర్ గాడ్జెట్ జుట్టు సాంద్రతను, మందాన్ని బాగా మెరుగుపరుస్తుంది. పని పూర్తయ్యాక దీని భాగాలను విడి విడిగా విడదీసుకోవచ్చు. దీనికి మెత్తటి దిండును కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. దీన్ని ఆన్ చేసుకుని చిత్రంలో చూపినట్లుగా సేదతీరితే సరిపోతుంది. ఉత్తమ ఫలితాలు అందుతాయి.