
తమ నెలల వయసులో పూర్తిగా తల్లిపాలపైనే ఆధారపడటంతోపాటు... చాలాకాలం పాటు అలా తల్లిపాలు తాగుతూ పెరిగే పిల్లలకు భాషలు నేర్చుకునే సామర్థ్యం, ప్రతిభ (లాంగ్వేజ్ స్కిల్స్) చాలా ఎక్కువని కొన్ని పరిశోధనల్లో తేలింది.
అంతేకాదు... ఇలా తల్లిపాలపై దీర్ఘకాలం పెరిగే పిల్లల్లో మెదడు వికాసం బాగా జరగడం వల్ల వాళ్లకు సహజమైన తెలివితేటలూ, తార్కికంగా ఆలోచించే శక్తియుక్తులు (లాజికల్ స్కిల్స్) కూడా బాగా పెరుగుతాయంటూ హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది.
ఈ అధ్యయనం కోసం దాదాపు 1500 మంది తల్లులను ఎంపిక చేశారు. దాదాపు ఏడు సంవత్సరాల పాటు సాగిన ఈ అధ్యయనంలో చాలాకాలం పాటు తల్లిపాలు తాగిన పిల్లలూ, కేవలం కొద్దికాలం పాటు మాత్రమే బ్రెస్ట్ ఫీడింగ్‌పై ఉన్న పిల్లల తెలివితేటలనూ, ఐక్యూను పరీక్షించారు.
ఈ అధ్యయనంతో తేలిన అంశాలను బట్టి... చాలాకాలం పాటు తల్లిపాలు తాగిన పిల్లలు వారి మంచి సామర్థ్యాలను కనబరిచారు. సుదీర్ఘకాలం పాటు తల్లిపాలను తాగిన పిల్లలు ఎక్కువ వకాబు్యలరీని కలిగి ఉండటంతోపాటు, భాషపై మంచి పట్టు సాధించినట్లు తేలింది. హార్వర్డ్ పరిశోధకుల పరిశోధన వివరాలు ‘జామా పీడియాట్రిక్స్’ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
(చదవండి: నిద్రపోకపోతే బాసూ... మెమరీ లాసూ!