పెదాలకు ఇది రాసుకుంటే గులాబీ రంగులోకి మారతాయి | Sakshi
Sakshi News home page

పెదాలకు ఇది రాసుకుంటే గులాబీ రంగులోకి మారతాయి

Published Fri, Dec 8 2023 4:50 PM

Best Ways To Achieve Naturally Pink Lips - Sakshi

హార్మోన్ల మార్పులు, విటమిన్ల లోపం, ధూమపానం, హైపర్‌ పిగ్మేంటేషన్‌ వంటి పలు కారణాల వల్ల పెదాలు నల్లగా మారుతుంటాయి. ఆ నలుపుదనం తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు

  • కొబ్బరి నూనె, తేనెలో పంచదార కలపండి. ఈ మిశ్రమాన్ని పెదవులపై స్క్రబ్‌గా ఉపయోగించండి. ఇది పెదవులపై చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. పెదాలను మృదువుగా, అందమైన రంగులోకి మారుస్తుంది.
  •  రెగ్యులర్‌గా లిప్‌స్టిక్‌ వాడేవాళ్ల పెదాలు నల్లగా మారుతుంటాయి. అందుకే లిప్‌స్టిక్‌ను ఎక్కువసేపు ఉంచుకోవచ్చు. బయటి నుంచి రాగానే ఆలివ్‌ ఆయిల్‌ లేదా బాదం ఆయిల్‌తో లిప్‌స్టిక్‌ను తొలగించుకోవాలి. 
  • విటమిన్ ఈ టాబ్లెట్స్ అనేవి గ్రేట్ రెమెడీగా పనిచేస్తాయి.విటమిన్ ఈ అప్లై చేయడం వల్ల పెదాలు మృదువుగా మారతాయి. 
  • గులాబీ నీళ్లను ప్రతిరోజూ పెదాలకు రాసుకోవడం వల్ల లేత గులాబీ రంగులోకి మారతాయి. 
  • పెదాలకు లిప్‌బామ్‌ ఎంచుకునేటప్పుడు ఎస్పీఎఫ్‌ 30 ఉండేలా చూసుకోవాలి. దీనిని రెగ్యులర్‌గా వాడటం వల్ల మీ పెదాలు అందంగా మెరుస్తాయి.
  • పెదవులు పగిలి బాధ పెడుతుంటేనేతిని కొద్దిగా వేడి చేసి, పెదవులపై మృదువుగా పూయాలి. ఇరవై నిమిషాల పాటు అలానే ఉంచి, గోరువెచ్చని నీటితో కడగాలి. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల సమస్య తగ్గిపోతుంది.
  • స్ట్రాబెర్రీని పేస్ట్‌లా చేసి, అందులో కాస్త పాల క్రీమ్ వేసి కలపాలి. దీన్ని పడుకోబోయేముందు పెదవులకు అప్లై చేసి, ఉదయాన్నే శుభ్రంగా కడుక్కోవాలి. నల్లని పెదవులు ఉన్నవారు తరచూ ఇలా చేస్తూ ఉంటే... నలుపు పోయి, పెదవులు గులాబీ రంగులోకి మారతాయి

Advertisement
 
Advertisement
 
Advertisement