Beauty Tips: Easy Exercises To Get Rid Of Double Chin - Sakshi
Sakshi News home page

డబుల్‌ చిన్‌తో పెద్దవాళ్లలా కనిపిస్తున్నారా? ఇలా చేస్తే అందంగా, నాజుగ్గా..

Jun 24 2023 1:26 PM | Updated on Jun 24 2023 1:56 PM

Beauty Tips:  Easy Exercises To Get Rid Of Double Chin - Sakshi

ముఖం నాజుగ్గా ఉంటే.. ఏ వయసు వారైనా సరే.. అందంగా కనిపిస్తారు. నలుగురిలో ప్రత్యేకంగా అగుపిస్తారు. సాధారణంగా చాలా మందికి.. వయసు పెరిగే కొద్దీ డబుల్‌ చిన్‌ ఏర్పడి.. చెంపల చుట్టూ కొవ్వు పేరుకుని.. రుపురేఖలు మారిపోతాయి. అలాంటి వారికి ఈ ఫేషియల్‌ స్లిమ్మింగ్‌ ఎక్సర్‌సైజర్‌ చక్కటి  పరిష్కారాన్ని చూపిస్తోంది.
 

ఈ టూల్‌ని పళ్ల మధ్య కరిచిపెట్టుకుని.. నములుతున్నట్లుగా బాగా కదిలించాలి. అలా చేయడం వల్ల ముఖం, మెడ, గెడ్డం వంటి భాగాల్లో పేరుకున్న కొవ్వు పూర్తిగా తగ్గి.. అందమైన షేప్‌ వస్తుంది. దీనికోసం ఉపయోగించిన  ఫుడ్‌–గ్రేడ్‌ మెటీరియల్‌.. హీట్‌–రెసిస్టెంట్‌ సిలికాన్‌ కావడంతో ఎలాంటి హానీ కలుగదు. ఈ స్లిమ్మర్‌.. ముఖంలో పేరుకున్న కొవ్వుని ఇట్టే కరిగిస్తుంది.

రన్నింగ్, వాకింగ్, జిమ్‌ వంటివి చేస్తున్న సమయాల్లో కానీ.. ల్యాప్‌టాప్‌లో పని చేసుకుంటూ కానీ, టీవీ చూస్తూ కానీ ఎప్పుడైనా ఈ టూల్‌ని నోట కరిచి.. ఫేస్‌ ఎక్సర్‌సైజ్‌ చేసుకోవచ్చు. సుమారు నెల పాటు క్రమం తప్పకుండా రోజుకి మూడు నుంచి పది నిమిషాలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. దీన్ని ఉపయోగించే ముందు 30 సెకన్ల పాటు గోరువెచ్చని నీటిలో వేసి క్లీన్‌ చేసిన తర్వాతే నోట్లో పెట్టుకోవాలి.

ముందుగా దవడలకు ఇరువైపులా పెట్టుకుని.. తర్వాత.. ముందుపళ్ల మధ్య పెట్టుకుని వ్యాయామం చెయ్యాలి. అలా చేయడంతో ముఖంలోని కండరాలు కదిలి.. ఫేస్‌ ’V’ షేప్‌లోకి మారుతుంది. డబుల్‌ చిన్‌ పూర్తిగా తగ్గుతుంది. ఇక ఈ టూల్‌ వాడటం పూర్తి అయ్యాక.. చల్లటి నీళ్లతో దాన్ని క్లీన్‌ చేసి దాచిపెట్టుకోవాలి. ఈ ఎక్సర్‌సైజర్‌తో ఒక ప్రత్యేకమైన తాడు కూడా లభిస్తుంది. దాన్ని ఉపయోగించి.. జిమ్‌కి వెళ్లే సమయాల్లో ఈ టూల్‌ని మెడలో వేసుకుని వెంట తీసుకెళ్లొచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement