బ్యూటిప్స్‌: ఇలా చేయండి.. ఈ ఒక్కటీ చాలు! | Beauty Tips: Do This For Glowing Skin | Sakshi
Sakshi News home page

బ్యూటిప్స్‌: ఇలా చేయండి.. ఈ ఒక్కటీ చాలు!

Mar 14 2024 7:53 AM | Updated on Mar 14 2024 7:53 AM

Beauty Tips: Do This For Glowing Skin - Sakshi

బ్యూటిప్స్‌

కొంతమంది స్కిన్‌ చాలా మెరిసిపోతుంది. మరి కొంతమందికి మాత్రం డ్రై స్కిన్, మొటిమలు, టాన్, పిగ్మంటేషన్, మచ్చలు, డల్‌ స్కిన్‌ వంటి సమస్యలు ఉంటాయి. వీటి వల్ల చాలా మంది సెల్ఫ్‌ కాన్ఫిడెన్స్‌ కోల్పతారు. నలుగురిలోకి వెళ్ళలేరు. అయితే, విటమిన్‌ ఇ చర్మానికి సంబంధించిన అనేక సమస్యల్ని దూరం చేస్తుంది. మరి దీనిని ఎలా అప్లై చేయాలి. అప్లై చేస్తే ఏయే లాభాలు ఉన్నాయో తెలుసుకోండి.

ఇలా చేయండి..

  • చర్మ సమస్యలకి విటమిన్‌ ఇ చక్కటి ఉపశమనం. ఇందుకోసం టీ స్పూన్‌ బొప్పాయి జ్యూస్, టీ స్పూన్‌ రోజ్‌ వాటర్‌ని తీసుకోవాలి. అందులోనే విటమిన్‌ ఇ ఆయిల్‌ కలిపి ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తర్వాత క్లీన్‌ చేయాలి. దీనివల్ల ముఖం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది.
  • స్కిన్‌ టోన్‌ పెరగడానికి: కొద్దిగా విటమిన్‌ ఇ ఆయిల్‌ని అంతే పరిమాణంలో పెరుగు, గుడ్డుతో కలపండి. దీనిని బాగా మిక్స్‌ చేయండి. దీనిని బాగా కలిపి ముఖానికి అప్లై చేసి మృదువుగా మసాజ్‌ చేయండి. తర్వాత శుభ్రం చేయండి. ముఖం మెరిసిపోతుంది.
  • విటమిన్‌ ఈ ఆయిల్‌ని కలబందతో కలిపి కూడా వాడొచ్చు. దీనివల్ల ముఖం మెరిసిపోతుంది. కాంతిమంతంగా మారుతుంది.
  • టీ స్పూన్‌ పరిమాణంలో గ్రీన్‌ టీ తీసుకోండి. అందులోనే తేనె కూడా వేయండి. తర్వాత కొద్దిగా విటమిన్‌ ఇ ఆయిల్‌ వేయండి. వీటన్నింటిని కలిపి ముఖానికి పట్టించి, ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. దీనివల్ల ముఖంపై ముడతలు, మచ్చలు తగ్గిపోతాయి.


    ఇవి చదవండి: చరిత్రను తిరగరాశారు.. రంగస్థలానికి కొత్త వెలుగు తెచ్చారు

Advertisement
 
Advertisement
Advertisement