'నా సామిరంగ’ మూవీ హీరోయిన్‌ చుడిదార్‌లో లుక్‌ మాములుగా లేదుగా!

Ashika Ranganath Lovely Outfits And Looks - Sakshi

‘నా సామిరంగ’ సినిమాలో అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించి.. అలరించిన నటి.. ఆశికా రంగనాథ్‌!. తెలుగు, కన్నడ కల్చర్స్‌ సిమిలర్‌గానే ఉంటాయి. అందుకే కొంతమంది ఆమెని తెలుగు అమ్మాయనే అనుకున్నారు. పైగా నటి అనుష్కగారితో పోలుస్తూ జూనియర్‌ అనుష్క అని పిలవడం విశేషం. ఇక ఆశికా రియల్‌ లైఫ్‌లోనూ తన ట్రెండీ, ట్రెడిషనల్‌ లుక్స్‌తో ఆకట్టుకుంటోంది. అందుకు అమె సెలెక్ట్‌ చేసుకున్న కొన్ని ఫ్యాషన్‌ బ్రాండ్స్‌ ఇక్కడ..

రుడ్రెస్‌ బ్రాండ్‌: మహిమా మహాజన్‌ 
ముంబైకి చెందిన ఫ్యాషన్‌  డిజైనర్‌ మహిమా.. తన పేరు మీదే ఓ ఫ్యాషన్‌ హౌస్‌ను ప్రారంభించి తన చిన్నప్పటి కలను నిజం చేసుకుంది. బ్రైడల్‌ కలెక్షన్స్‌తో పాపులర్‌ అయింది. ఇండోవెస్టర్న్‌ డిజైన్స్‌కి కూడా ఫేమస్‌. అమ్మాయిలకు హాట్‌ ఫేవరేట్‌ ఈ బ్రాండ్‌! ధరలు అందుబాటులోనే ఉంటాయి. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయొచ్చు. దీని ధర రూ. 45,900/-

జ్యూలరీ బ్రాండ్‌: హౌస్‌ ఆఫ్‌ క్యూసీ 
2016లో ఆన్‌లైన్‌లో మొదలైన ఈ బ్రాండ్‌.. తన అందమైన డిజైన్స్‌తో ఇప్పుడు సెలబ్రిటీలకూ నోటెడ్‌ అయింది. ఎవరి వారికైనా నప్పే, ఎవరైనా మెచ్చే ఆభరణాలను అందించడం ‘హౌస్‌ ఆఫ్‌ క్యూసీ’ ప్రత్యేకత. ఈమధ్యే హైదరాబాద్, బెంగళూరులలో స్టోర్స్‌ ఓపెన్‌  చేశారు. ఆభరణాల నాణ్యత, డిజైన్స్‌ను బట్టే ధర ఉంటుంది. 
--దీపిక కొండి

(చదవండి: స్టన్నింగ్‌ బ్యూటీ శోభితా ధూళిపాళ ధరించిన చీర ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!)

whatsapp channel

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top